బాల్ గంగాధర్ తిలక్ భారతదేశానికి స్వాతంత్ర్య కోసం పోరాటం ప్రారంభించిన వ్యక్తి, ఆయన మనువడు కాంగ్రెస్ లీడర్ రోహిత్ తిలక్ పైన రేప్ కేసు బుక్ చేశారు పోలీసులు. వివరాల్లోకి వేళ్తే సోమవారం రాత్రి పుణే లో ఒక మహిళ రోహత్ పైన పిర్యాదు చేసింది, ఆమే పోలీసులకు తనని రోహిత్ తిలక్ బలవంతం చెయ్యబోయ్యడని. తన నుండి తప్పించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని. చివరికి రోహిత్ ని చెంపకేసి కొట్టి తప్పించుకొని వచ్చినట్లు ఆమే తన కంప్లైంట్ పెర్కొంది. అయితే పోలీసులు ఆ మహిళ ఇచ్చిన వివరాలను నమోదు చేసుకోని రోహిత్ పైన దర్యాప్తు ప్రారంభించారు,

ఇప్పటి వరకు రోహిత్ తిలక్ నుండి ఎలాంటి సమాచారం లేదు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మహారాష్ట్ర కీలక నాయకులు. అయితే సోషల్ మిడియాలో రోహిత్ కి వ్యతిరేకంగా వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు నేటిజన్లు. దేశం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి మనువడు ఇలాంటి పాడు పనులు ఏంటని ఘాటుగానే స్పందిస్తున్నారు.