మగువల యవ్వనం కాపాడే చిట్కా ఇదే...

మహిళల యవ్వనం చెక్కుచెదరకుండా ఉండటంతో పాటు ఆరోగ్యం పదిలపర్చుకోవడానికి మార్గాలేమయినా ఉన్నాయా? ఇది పెళ్లయిన ప్రతిమహిళను వేధించే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మా దగ్గిర ఉందంటూ కాస్మొటిక ఇండస్ట్రీ ఖరీదయిన లేపనాలు తయారుచేసి కోట్లు దండుకుంటూ ఉంది. అదే విధంగా మహిళలు కూడా యవ్వనం, అందం,ఆరోగ్యం కాపాడుకునేందుకు ఎంతటి ఖర్చుకయినా వెనకాడరు. అయితే, ఖర్చులేని మార్గాన్ని శాస్త్రవేత్తలిపుడు కనిపెట్టారు. వారానికి ఒక్కసారైనా సెక్స్ లో పాల్గొంటే ఆడవాళ్ల వయస్సు తగ్గి యవ్వనంగా , ఆరోగ్యవంతంగా మారుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయం అమెరికాలోని శాన్ ప్రాన్సిస్కో యూనివర్సిటి శాస్త్రవేత్తలు లైంగిక జీవితంపై చేసిన పరిశోధనల్లో వెల్లడయింది. 129 మంది మగువలను వారు పరిశోధన కోసం ఎంచుకుని వారికి గల లైంగిక వాంచలు, భాగస్వామితో వారి కలయిక, సెక్స్ పై వారి అభిప్రాయాలను సేకరించారు. అలాగే వారి రక్త నమూనాలను కూడా సేకరించి, వీటన్నింటిని క్రోడీకరించి వారి వయసులో వస్తున్న మార్పులపై ఓ నిర్దారణకు వచ్చారు.
లైగికంగా ఎక్కువ సార్లు కలుస్తుండటం వల్ల డీఎన్ఎ లో మార్పులు సంభవించి ఆరోగ్యకరంగా ఉంటూ ఎక్కువ కాలం జీవించడవచ్చని ఈ పరిశోధనకు సారధ్యం వహించిన థామస్ డిసోజ అంటున్నారు. అంతేకాదు, వయసుకు మించిన యవ్వనంతో మెరిసి పోతారని  కూడా ఆయన తెలిపాడు. అలాగే శరీరంలోని వ్యాధి నిరోధకతపై కూడా లైంగిక వాంచలు, సెక్స్ జీవితం ప్రభావం చూపుతాయని ఆయన తెలిపాడు.

హైదరాబాద్, నల్గొండ ప్రజలకు కెసిఆర్ హెచ్చరిక

కృష్ణా నదిలోకి ఆశించిన నంత వరద నీరు రాకపోవడం  నీరుతక్కువగా ఉన్నందున హైదరాబాద్, నల్లగొండ ప్రజలకు మంచినీటి సమస్య వచ్చే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు (కెసిఆర్ )హెచ్చరించారు. ఈ జిల్లాల ప్రజలు ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా వాడుకోవవలసి ఉంటుందని  కెసిఆర్ సూచించారు. ఈ ఏడాది కృష్ణా నదికి వరద నీరు రాలేదని నాగార్జున్‌సాగర్‌లో నీరు డెడ్ స్టోరేజీ కంటే తక్కువ ఉందని ఆయన అన్నారు. దీంతో నీటిని వృధా చేయకుండా  జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు.
కృష్ణా నది నీళ్లపై ఆధారపడిన హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో మంచినీటి సరఫరాకు ఇబ్బంది రాకుండా డేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయబోతున్నట్లు కూడా ఆయన వెల్ల డించారు.  ఈ మేరకు ఆయన
హైదరాబాద్, నల్లగొండ అధికారులకు సీఎం ఆదేశాలు కూడా జారీ చేశారు. 
సింగూర్ నుంచి హైదరాబాద్‌కు నీరు వదలాలని ఆదేశించారు. నాగార్జునసాగర్ నుంచి అక్కంపల్లి ద్వారా ఉదయసముద్రానికి నీరు వదిలి నల్లగొండ జిల్లా ప్రజలకు మంచి నీరు కొరత లేకుండా చూడాలని కూడా ఆయన సూచనలిచ్చారు. సింగూర్ నుంచి హైదరాబాద్‌కు, అక్కంపల్లి నుంచి ఉదయ సముద్రానికి మంగళవారం రాత్రి నుంచే నీటి విడుదల జరగాలని సీఎం ఆదేశించారు.                        

ప్రియుడి ఇంటిముందు ప్రియురాలి నిరసన (వీడియో)

జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో  ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఓ అమ్మాయి అతడి ఇంటి ముందు బైటాయించి నిరసన తెలుపుతోంది.వివరాల్లోకి వెళితే రాయికల్ కు చెందిన ఇంద్యాల అరవింద్ అనే యువకుడు  మల్లపూర్ మండలం రేగుంట గ్రామనికి చెందిన రాజమణి లు గత కొన్ని రోజులగా ప్రేమించుకుంటున్నారు.  రాజమణి కి ఇంతకు ముందే వివాహం కాగా, భర్తతో విడాకులు తీసుకుని అరవింద్ తో సహజీవనం చేస్తోంది. ఇపుడు అరవింద్ తనను మోసం చేసి వేరే పెళ్ళి చేసుకుంటున్నాడని,అందుకే అతని ఇంటి ముందు బైటాయించినట్లు తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడినుండి కదిలేది లేదని రాజమణి చెబుతోంది. 
 

కస్టమర్ పై రెస్టారెంట్ యాజమాన్యం దాడి 

ఓ రెస్టారెంట్ యాజమాన్యం కస్టమర్ పై దాడి చేసిన సంఘటన జూబ్లీహిల్స్ లో జరిగింది . జూబ్లీహిల్స్ లోని ఉల్వచారు  రెస్టారెంట్ లో ఓ వ్యక్తి బోజనం చేయడానికి వెళ్లాడు. అయితే అక్కడ అందించిన బిర్యానిలో బొద్దింకను గమనించిన కస్టమర్ ఈ విశయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. అయితే దీనిపై   రెస్టారెంట్ యజమాని స్పందించలేదుకదా, చివరకు తన సిబ్బందితో కలిసి ఆ వ్యక్తిపైనే దాడికి దిగారు.  అతడిని బలవంతంగా హోటల్ లోంచి బయటికి గెంటేసారు రెస్టారెంట్ సిబ్బంది.   
 

బాబా రాంపాల్ నిర్ధోషి 

2014 అల్లర్ల కేసులో దోషిగా అభియోగాలు ఎదుర్కొంటున్న బాబా రాంపాల్ ను నిర్ధోషిగా తేల్చింది హర్యాన కోర్టు. బల్వారాలో జరిగిన హింసకు ఈయనే కారణమంటూ అభియోగాలు చేసిన పోలీసులు కోర్టులో మాత్రం దీన్ని నిరూపించలేక పోయారు. దీంతో ఆయనపై వున్న రెండు కేసులను కొట్టివేసింది న్యాయస్థానం. 2014 నుంచి హిస్సార్ జైలులో వుంటున్న ఆయన పై మరో మూడు కేసులు వున్నాయి కావున విడుదలయ్యే అవకాశాలు లేవు.
 

అర్జున్ రెడ్డి  పై చర్యలు తీసుకొండి - వీహెచ్ 
 

డ్రగ్స్ తీసుకుంటున్న వారి పై చర్యలు తీసుకుంటామంటున్న ఐటీ మంత్రి కేటీఆర్, అలాంటి డ్రగ్స్ కు ప్రచారం కల్పిస్తున్నట్లు గా వున్న అర్జున్ రెడ్డి లాంటి సినిమా బాగుందని చెప్పడం ఏమిటని హన్మంతరావు విమర్శించారు.ఓ వైపు ఈ సినిమా చూసి యువత చెడిపోతున్నా, హీరో తమ బంధువు అయినందుకే సినిమా పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. 
ఈ మూవీలో మందు తాగి వైద్యం చేసే హీరోను చూసి, బయట వున్న డాక్టర్లు కూడా అలా ప్రవర్తించరని మీరు హామీ ఇవ్వగలరా అని కేటీఆర్ ను ప్రశ్నించారు వీహెచ్.  ఈ సినిమా పై సెన్సార్ బోర్డుకు, సిటీ కమిషనర్ మహేందర్ రెడ్డి కి ఫిర్యాదు చేశానని  తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అర్జున్ రెడ్డి సినిమా చూసి వెంటనే చర్యలు తీసుకోవాలని వీహెచ్ సూచించారు.
 

బిక్కనూర్ మండలంలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం (వీడియో)    
 

నిజామాబాద్ జిల్లాలోని  బిక్కనూర్ మండలంలో పలు అభివృద్ది పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.  ఈ కార్యక్రమాల్లో ఆయనతో పాటు  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జహీరాబాద్ ఎంపి బిబీ పాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ ధఫెదార్ రాజు, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తో పాటు పలు శాఖల ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు.
 

ఆర్టీసి పనితీరును మెరుగుపరుస్తాం -  మంత్రి మహేందర్ రెడ్డి (వీడియో)  

సచివాలయంలో టీఎస్ ఆర్టీసీ పనితీరు పై అధికారులతో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి   సమిక్షా సమావేశం నిర్వహిస్తున్నరు. రీజియన్ ల వారిగా, సర్వీస్ ల వారిగా, ప్రభుత్వం నుంచి రావాల్సిన రాబడులు, నష్టాలపై ఆరా తీసిన ఆయన, సేవలను మరింత విస్తరించి ఆర్టీసిని నష్టాల నుంచి లాభాల బాటలోకి నడపించాలని  అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఎండీ రమణారావు లు పాల్గొన్నారు. 
 

హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ చైర్మన్ నియామకం పై హైకోర్టు స్టే విధించింది. రూల్ 3 ప్రకారం బాలల పరిరక్షణకు సంబంధించి కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉన్న వారినే నియమించాల్సి ఉందని  పిటిషనర్ పేర్కొన్నారు. అలాగే రూల్ 4 ప్రకారం సెలక్షన్ కమిటీ చైర్మన్ లేకుండా కమిషన్ చైర్ పర్సన్ నియామకం చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని కోర్టుకు విన్నవించారు. ఇలా నియామక ప్రక్రియలో ప్రభుత్వం చట్టాలను అతిక్రమించారన్నపిటిషనర్ వాదనతో ఏకీభవించిన  ఉన్నత న్యాయస్థానం, తదుపరి ఉత్తర్వులు వెల్లువరించే వరకు ఈ నియామకంపై స్టే విధిస్తున్నట్లు   తెలిపింది.
 

ఏపీ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలపై విచారించనున్న హైకోర్టు

  

అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు అడ్వాన్స్డ్ టెలీకమ్యూనికేషన్స్ కు అక్రమంగా ఇచ్చారంటూ హైకోర్టును ఆశ్రయించిన మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆర్ రామకృష్ణా రెడ్డి పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది.  దీనిపై 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ  అసెంబ్లీకి, రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.
 

మరో కార్పోరేట్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్: కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో మరో  కార్పోరేట్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది.  నారాయణ జూనియర్ కాలేజీలో సెకండియర్‌ చదువుతున్న విద్యార్థి నాగసాయి కాలేజి హాస్టల్‌లో ఉరేసుకొని చనిపోయాడు. అయితే ఈ మృతికి నారాయణ  కాలేజీ యజమాన్యమే కారణమని ఆరోపిస్తూ బందువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహన్ని పోస్టుమార్టం కొరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు.  దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
 

కావేరి పుష్కరాలకు నెల్లూరు నుంచి ప్రత్యేక బస్సులు

తమిళనాడులో జరిగే కావేరి నది పుష్కరాలకు నెల్లూరు ఆర్టీసి వారు బస్సులు నడుపుతారు.  ప్రస్తుతం 20 బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అవసరం అయితే ఎన్ని బస్సులు అయిన ఏర్పాటు చేస్తామని నెల్లూరు ఎపిఎస్ అర్టీసి అధికారులు చెప్పారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి టిక్కెట్లు అందుబాటుల ఉంటాయని  నెల్లూరు ఆర్టీసీ ఆర్ఎం రవివర్మ వెల్లడి

 

విద్యుత్ ఉద్యోగుల మహా నిరాహారదీక్ష ప్రారంభం 

తెలంగాణ విద్యుత్ సంస్థలో సీమాంధ్ర ఉద్యోగుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా మింట్ కాంపౌండ్ లో విద్యుత్ ఉద్యోగుల మహా నిరాహారదీక్ష కు దిగారు. తెలంగాణ విద్యుత్ ఇంజినిర్స్ ఉద్యోగుల అసోసియేషన్ ప్రెసిడెంట్ శివాజీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నాలో  పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆంద్రా ఉద్యోగులు తిష్ట వేసారని, వారిని ప్రభుత్వం గుర్తించి తరిమికొట్టాలని వారు డిమాండ్ చేశారు. 
 

డబుల్ బెడ్ రూం ఇళ్లు కోసం ఆత్మహత్యాయత్నం
 

తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు  కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి కరెంట్ స్తంభం ఎక్కి అలజడి సృష్టించిన సంఘటన  కూకట్ పల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే కూకట్ పల్లి ఉషా ముళ్ళపూడి హాస్పిటల్ వద్ద యాదయ్య అనే వ్యక్తి తాను తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆరెస్ పార్టీకి ఎన్నో విధాలుగా సేవలందించానని, ఇపుడు అదే టీఆరెస్ ప్రభుత్వం తనపై వివక్ష చూపుతోందని, తనకు న్యాయం చేయకుంటే  స్తంభం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ హంగామా సృష్టించాడు. అయితే పోలీసులు రంగ ప్రవేశం చేసి కరెంట్ నిలిపివేయించి సత్తయ్య ను కిందకు దించి,కౌన్సెలింగ్ నిర్వహించారు.                         
 

లడ్డూ దొంగలున్నారు...తస్మాత్ జాగ్రత్త

నేరేడ్ మెట్ సాయినాథపురంలోని నవయుగ యూత్ ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో గుర్తు తెలియని వ్యక్తి గణేష్ చేతిలోని లడ్డు దొంగిలించడానికి ప్రయత్నించాడు. అయితే దొంగ మండపంలో అలికిడి చేయడంతో మండపంలోనే నిద్రించిన నిర్వాహకుడు లేచి వెంబడించడంతో లడ్డును అక్కడే  వదిలేసి  దొంగ పరారయ్యాడు.ఈ దొంగతనం మొత్తం మండపంలో పెట్టిన సి.సి కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.                         
 

సామూహిక గణేష్ నిమజ్జనాల తేది ఖరారు  

హైదరాబాద్ : వినాయక సామూహిక నిమజ్జనోత్పవాలను సెప్టెంబర్ 5 వ తేదీ (మంగళవారం) న ఘనంగా నిర్వహించనున్నట్లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తెలిపింది. నిమజ్జన తేదీ ఖరారు చేయడానికి సమావేశమైన  ఉత్పవ సమితి ఈ నిర్ణయాన్ని తీసుకుంది. భక్తులు, మండప నిర్వహకులు ఈ విషయాన్ని గమనించి, అందుకు అనుగునంగా ఏర్పాట్లు చేసుకోవాలని  గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రెటరీ భగవంత్ రావు తెలిపారు.