Asianet News TeluguAsianet News Telugu

శాకాహారంతో మెరుగైన శృంగార జీవితం.. బ్రిటీష్ జర్నలిస్ట్ స్వీయ అనుభవం

శాఖాహారం తీసుకోవడం వల్ల తన శృంగార జీవితం మెరుగైందని బ్రిటిష్ జర్నలిస్ట్ జార్జెట్ కల్లీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర సమాధానాలు చెబుతూ.. కల్లీ తన అనుభవాన్ని పంచుకున్నారు. తాను శాకాహారం తీసుకోవడం ప్రారంభించినప్పటి నుండి, తన సెక్స్ లైఫ్ మునుపటి కంటే మెరుగ్గా మారిందని చెప్పింది. 

vegetarian food changed the bedroom life of this journalist you also know how
Author
London Bridge, First Published Jan 13, 2022, 10:26 PM IST

శాఖాహారం తీసుకోవడం వల్ల తన శృంగార జీవితం మెరుగైందని బ్రిటిష్ జర్నలిస్ట్ జార్జెట్ కల్లీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర సమాధానాలు చెబుతూ.. కల్లీ తన అనుభవాన్ని పంచుకున్నారు. తాను శాకాహారం తీసుకోవడం ప్రారంభించినప్పటి నుండి, తన సెక్స్ లైఫ్ మునుపటి కంటే మెరుగ్గా మారిందని చెప్పింది. ఒకరోజు మాంసాహారం తీసుకుని తన ప్రేమికుడితో ఏకాంతంగా గడుపుతుండగా నిద్రపోయానని జార్జెట్ అన్నారు. కల్లీ విషయంలో ఇలా చాలా సార్లు జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె మాంసాహారాన్ని విడిచిపెట్టి శాఖాహారిగా మారింది. నాటి నుండి ఆమె సెక్స్ జీవితం కూడా మెరుగుపడిందట.

శాకాహారానికే మొగ్గు చూపిన భాగస్వామి:

జార్జెట్ మాట్లాడుతూ.. తాను గడిచిన ఆరు నెలలుగా శాఖాహారిననని... దీని వల్ల నడుము చుట్టూ వున్న కొవ్వు కూడా తగ్గిందన్నారు. తన ఎనర్జీ లెవెల్‌తో పాటు సెక్స్‌ కోరికలు కూడా పెరుగుతున్నాయని తెలిపింది. తనను చూసి తన భాగస్వామి కూడా వేగన్ డైట్‌ వైపు మొగ్గుచూపారని జార్జెట్ తెలిపారు. ఇప్పుడు ఆయన తనను మునుపటి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చెప్పారు.

ఇది కేవలం ఆలోచన కాదు, సైన్స్:

ఇది కేవలం ఆలోచన కాదని.. ఇది దీని వెనుక సైన్స్ దాగి ఉందని బ్రిటీష్ జర్నలిస్ట్ చెబుతున్నారు. శాకాహారం ఎక్కువగా తినడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుందని... దీని కారణంగా సెక్స్ కోరిక కూడా పెరుగుతుంది. ఆకు కూరలు, అత్తి పండ్లు, గుమ్మడి గింజలు, మిరియాలు, డార్క్ చాక్లెట్, బాదంపప్పులు, విటమిన్ బిలలో జింక్‌ పుష్కలంగా లభిస్తుందని ఆమె తెలిపారు. ఇది టెస్టోస్టెరాన్ (సెక్స్ హార్మోన్) స్థాయిని అలాగే లైంగిక కోరికను పెంచుతుందని తద్వారా శృంగార జీవితం కూడా బాగుంటుందని జార్జెట్ చెప్పారు. 

శీఘ్ర ఫలితాల కోసం ఇలా చేయండి:

మాంసం, గుడ్లు, పాలలో అధిక కొలెస్ట్రాల్, స్టాట్యూరెటేడ్ జంతువుల కొవ్వు కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి మన ధమనులను మూసుకుపోయేలా చేస్తాయి. దీంతో మన శరీరంలోని దిగువ భాగాలకు రక్త ప్రసరణను నెమ్మదించి.. తద్వారా ఇది పురుషులలో నపుంసకత్వానికి దారితీస్తుంది. దీంతో ఫలితాలు త్వరితగతిన, అద్భుతంగా రావాలంటే వ్యాయామంతో పాటు ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని జార్జెట్ సూచిస్తున్నారు. ఇందుకోసం స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, యాపిల్స్ వంటి పండ్లను మీ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆమె చెబుతున్నారు.

20% ప్రమాదం తగ్గుతుంది:

అదే సమయంలో.. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఫ్లేవనాయిడ్‌లు అధికంగా ఉండే ఆహారం పురుషులలో అంగస్తంభన ప్రమాదాన్ని 20 శాతానికి పైగా తగ్గిస్తుందట. మాంసాహారం, పాల పదార్థాలు తీసుకోకపోవడం వల్ల మన శరీరంలో సెరోటోనిన్ హార్మోన్ స్థాయి పెరుగుతుందని పరిశోధనలో తేలింది. ఈ హార్మోన్ మనల్ని సంతోషంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. మాంసాహారం తినే వారి కంటే శాఖాహారం తినే వారి శరీరం నుంచి వచ్చే వాసన బాగుంటుందని మరో పరిశోధనలో వెల్లడైంది.

Follow Us:
Download App:
  • android
  • ios