సెక్స్ టాయ్స్ వాడకం.. మహిళల్లో వ్యాధుల ముప్పు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?
ప్రపంచ వ్యాప్తంగా ఒంటరి మహిళల్లో సెక్స్ టాయ్స్ వాడకం పెరుగుతోంది. గత పదిహేనేళ్లలో సెక్స్ టాయ్స్ వాడకం బాగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతోపాటే మహిళల్లో వ్యాధులు కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

కాలం మారుతోంది. దాంతో పాటు మనుషుల అలవాట్లు కూడా మారుతున్నాయి. సుఖం, సంతృప్తి కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. అలా వచ్చినవే సెక్స్ టాయ్స్. ఈ సెక్స్ టాయ్స్ వాడకం ద్వారా ఒంటరి మహిళలు లైంగిక సుఖాన్ని పొందుతున్నారు. కానీ దీనివల్ల వారిలో అనేక రకాల శారీరక సమస్యలు కనిపిస్తున్నాయి.
సెక్స్ టాయ్స్ వాడకం కారణంగా పంచ వ్యాప్తంగా మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత కనిపిస్తోందని వైద్యులు గుర్తించారు. సెక్స్ టాయ్స్ వాడకం గురించి అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. లేకపోతే అనేక రకాల శారీరక సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు.
‘సెక్స్ టాయ్స్ వాడాలో వద్దో నిర్ణయించుకునే హక్కు వ్యక్తిగతం. కానీ శారీరక సమస్యల గురించి అందరూ అప్రమత్తంగా ఉండాలి. హార్మోన్ల అసమతుల్యత ఎప్పుడూ మంచిది కాదు’ అని వైద్యులు చెబుతున్నారు.
సెక్స్ టాయ్స్ వాడకం- ప్రమాదాలు
ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే భారతదేశంలో కూడా ఒంటరి మహిళల్లో సెక్స్ టాయ్స్ వాడకం పెరుగుతోంది. కానీ అందరూ సెక్స్ టాయ్స్ వాడకంలోని ప్రమాదాల గురించి తెలుసుకోవడం లేదు. అందుకే అనేక రకాల వ్యాధులు పెరుగుతున్నాయి. వైద్యుల అభిప్రాయం ప్రకారం, అన్ని కంపెనీల సెక్స్ టాయ్స్ శరీరానికి మంచివి కావు. బాగా ఆలోచించి సెక్స్ టాయ్స్ కొనాలి. నాసిరకం సామాగ్రి కొంటే సమస్యలు ఎదురవుతాయి. మంచి నాణ్యత గల సెక్స్ టాయ్స్ మాత్రమే వాడాలి. అంతేకాకుండా సెక్స్ టాయ్స్ నిర్వహణ కూడా ముఖ్యం. ప్రతిసారి వాడిన తర్వాత సెక్స్ టాయ్స్ ని బాగా శుభ్రం చేయాలి. లేకపోతే శరీరంలో వ్యాధులు సంక్రమించవచ్చు.
సెక్స్ టాయ్స్ వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
వైద్యుల సూచలన ప్రకారం, సెక్స్ టాయ్స్ వాడకంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మంచి నాణ్యత గల సెక్స్ టాయ్స్ మాత్రమే కొనుగోలు చేయాలి. నాణ్యతను పరిశీలించి సెక్స్ టాయ్స్ కొనాలి. సెక్స్ టాయ్స్ సాధారణంగా ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. ఈ రకమైన సెక్స్ టాయ్స్ నుండి అనేక రకాల బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతాయి. అందువల్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. సెక్స్ టాయ్స్ పిల్లల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. కొన్నిసార్లు దంపతులు కలిసి సెక్స్ టాయ్స్ వాడతారు. ఈ సందర్భంలో ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వాడిన తర్వాత సెక్స్ టాయ్స్ ని బాగా శుభ్రం చేయాలి.