Asianet News TeluguAsianet News Telugu

తన కోసం తమ్ముడు... కొడుకు కోసం నందమూరి కుటుంబం...: చంద్రబాబుపై అంబటి ఫైర్

టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. ఆయన తన స్వార్థం కోసం కుటుంబసభ్యులనే నాశనం చేసిన వ్యక్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

YSRCP MLA Ambati Rambabu fires on chandrababu
Author
Guntur, First Published Jan 28, 2020, 2:40 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ శాసనమండలిని రద్దు చేయాలన్న మంత్రిమండలి కీలక నిర్ణయంపై అసెంబ్లీలో సుధీర్ఘ చర్చ తర్వాతే ఆమోదించడం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. సోమవారం శాసనసభ ఓ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుందని... మండలి రద్దుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని అన్నారు.  

గతంలో 1983 సంవత్సరంలో మాజీ సీఎం ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాన్నే సిఎం జగన్ మరోసారి తీసుకున్నారని అన్నారు.  చాలా రాష్ట్రాల్లో మండలి లేకుండానే పరిపాలన సాగుతోందన్నారు.

మండలి రద్దు వంటి కీలక నిర్ణయాన్ని తీసుకునే సమయంలో ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు ఎందుకు అసెంబ్లీ నుండి పారిపోయారని అన్నారు.ఆయన అభిప్రాయాన్ని అసెంబ్లీలో చెప్పేందుకు ఎందుకు వెనకాడారని నిలదీశారు. 

read more  ఢీల్లీకి తీర్మానం:ఇక ఏపీ శాసనమండలి రద్దు కేంద్రం చేతుల్లోనే

పరిమితులకు లోబడి పనిచేయాల్సిన శాసనమండలిని దానికి విరుద్దంగా పనిచేసేలా చంద్రబాబు ఓవరాక్షన్ చేయించారని అన్నారు. వెన్నుపోటు రాజకీయంలో చంద్రబాబును మించనవారు లేరన్నారు.

కేవలం ఎనిమిది నెలల క్రితం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై చంద్రబాబు పిచ్చిసవాళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై చంద్రబాబుకు అసలు గౌరవం ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అంత ఉబలాటంగా ఉంటే టిడిపికి చెందిన 23 మంది ఎంఎల్ఏలు, ఎంపీలతో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని అంబటి సూచించారు. 

చంద్రబాబు లాంటి యూటర్న్ రాజకీయవేత్త దేశంలోనే లేరని ప్రజలంటున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఎన్నో చేయకూడని పనులు చేశారని... కుమారుడి కోసం ఎన్టీఆర్ కుటుంబాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఇలాంటి ఘోరాలు ఎన్నో చేశారని అన్నారు.

read more  రాష్ట్ర ప్రయోజనాల కోసమే.... మండలి రద్దుపై డిప్యుటీ సీఎం

తన రాజకీయం కోసం సొంత తమ్ముడినే నాశనం చేసిన చంద్రబాబుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై చౌకబారు విమర్శలు చేసే అర్హత  లేదన్నారు. జగన్ పై బురద చల్లడమే పనిగా కొన్ని పత్రికలు పెట్టుకున్నాయన్నారు.

ఏం చెప్పినా చూపించే ఛానళ్లు ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్ పై చంద్రబాబు దిగజారుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు శాసనమండలిపై గతంలో ఏమన్నారు, ఇప్పుడు ఏమన్నారనేది ఆ ఛానళ్లు, పత్రికలు ఎందుకు చూపించడం లేదని అంబటి ప్రశ్నించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios