Asianet News TeluguAsianet News Telugu

జగన్ పై మహిళా ఎమ్మెల్సీ సెటైర్లు... శాసనమండలిలో గందరగోళం

ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దుకు సంబంధించిన బిల్లులపై శాసనమండలిలో సాగుతున్న చర్చలో గందరగోళానికి దారితీసింది. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి ఎమ్మెల్సీల వాదోపవాదాలతో సభ దద్దరిల్లుతోంది. 

TDP MLC Sandyani satires on cm ys jagan in ap council
Author
Amaravathi, First Published Jan 21, 2020, 9:12 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దుకు సంబంధించిన బిల్లులను శాసనమండలిలో చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా టిడిపి ఎమ్మెల్సీ సంధ్యారాణి సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళం సృష్టించారు. ఆమె చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై అధికార వైసిపి ఎమ్మెల్సీలు, మంత్రులు ఆగ్రహానికి లోనవడంతో సభ వేడెక్కింది. 

ఏపికి మూడు రాజధానులు ఏర్పాటుచేయాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సంధ్యారాణి తప్పుబట్టారు. ఈ క్రమంలోనే అమరావతి ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక ఏకంగా సీఎం జగనే డమ్మీ కాన్వాయ్ లో తిరుగుతున్నారని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలు మండలిలో దుమారాన్ని రేపాయి. 

ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వైసిపి ఎమ్మెల్సీలు, మంత్రులు సభలోనే నినదించడం ప్రారంభించారు. దీంతో  టిడిపి ఎమ్మెల్సీలు కూడా ప్రతిగా నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగతున్నాయి. 

read more  జగన్ ప్రభుత్వ నిర్ణయాలు అత్యద్భుతం...: నోబెల్ గ్రహీత్ కైలాస్ సత్యార్థి

ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దుకు సంబంధించిన బిల్లులను శాసనమండలి ఛైర్మన్ ఎట్టకేలకు పరిగణనలోనికి తీసుకున్నారు. రూల్ 71 కింద  రెండు గంటలపాటు చర్చకు ఛైర్మన్ అనుమతిచ్చారు. టీడీపీ సభ్యులకు 56 నిమిషాలు, వైసీపీ కి 18, బీజేపీకి 4, పీడీఎఫ్ 10, ఇండిపెండెంట్ లకు 16, నామినేటెడ్ ఎంఎల్సీ లకు 16 నిమిషాలు చొప్పున మాట్లాడేందుకు సమయం కేటాయించారు.

అంతకుముందు తొలుత రూల్ 71పై చర్చ జరిపి మిగిలిన అంశాలలోకి వెళ్లాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపిన వైసీపీ సభ్యులు.. ఇది సభా సాంప్రదాయానికి విరుద్ధమని, ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులపై మొదట చర్చ చేపట్టాలని పట్టుబట్టారు.

టీడీపీకి సంఖ్యాబలం ఉండటంతో రూల్ 71 కింద చర్చ జరిపేందుకు ఛైర్మన్ షరీఫ్ అనుమతిచ్చారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చర్చను ప్రారంభించగా వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు.

read more  రాజధాని మార్పుపై న్యాయపోరాటం... పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం

మంత్రులు స్వయంగా ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులపై చర్చించాలని నినాదాలు చేశారు. టీడీపీ చెప్పినట్లుగా ఛైర్మన్ నడుచుకోవడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి బొత్స. 


 

Follow Us:
Download App:
  • android
  • ios