Asianet News TeluguAsianet News Telugu

మేం గుజరాత్ తో పోటీపడ్డాం... అందువల్లే...: చంద్రబాబు నాయుడు

తెలుగుదేశం పార్టీ హయాంలో ఆంధ్ర ప్రదేశ్ లో పారిశ్రామికి అభివృద్ది ఎలా జరిగింది... పెట్టుబడులను ఎలా ఆకర్షించాం అన్న దానిపై టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ద్వారా వివరించారు. 

Nara Chandrababu Naidu Tweets On AP Development in TDP Government
Author
Guntur, First Published Feb 15, 2020, 2:37 PM IST

అమరావతి: నవ్యాంధ్ర ప్రదేశ్ లో టిడిపి పాలనలో పెట్టుబడులు వెల్లవలా వస్తే ప్రస్తుత వైసిపి పాలనలో అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోతున్నట్లు మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత నిర్ణయాలు, ప్రభుత్వ చేతకాని పాలన వల్ల పెట్టుబడిదారులు వెనక్కి తగ్గడమే కాదు రాష్ట్రం ఆదాయాన్ని, యువత ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా విరుచుకుపడ్డారు. 

''గత ఏడాది(2018-19) అత్యధిక పెట్టుబడులు(11.8%) ఆకర్షించి దేశంలోనే ఏపి అగ్రస్థానంలో ఉంది. అంతేకాకుండా గత 5ఏళ్లలో (2014-19) దేశవ్యాప్తంగా రూ 7,03,103కోట్ల పెట్టుబడులు వస్తే, అందులో ఏపికి రూ.70వేల కోట్లు వచ్చాయి.అందుకు ఆర్బీఐ తాజా బులెటిన్ వివరాలే ప్రత్యక్ష సాక్ష్యం''అంటూ చంద్రబాబు టిడిపి పాలనలో  వచ్చిన పెట్టుబడులు గురించి వివరించారు.

read more  డైరీలో నమోదు చేసుకున్నాడు: చంద్రబాబు మాజీ పీఎపై పార్థసారథి
 
''తెదేపా హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో మహారాష్ట్ర, గుజరాత్ లతో పోటీబడ్డాం. అలాంటిది వైసీపీ ప్రభుత్వంలో పిపిఏల రద్దు, వాటాల కోసం బెదిరింపులు, డీలర్ షిప్ ల కోసం వేధింపులు తట్టుకోలేక 9నెలల్లోనే రూ.లక్షా 80వేల కోట్ల పెట్టుబడులు వెనక్కిపోవడం బాధాకరం'' అని అన్నారు. 
 
''ఇటీవల దావోస్ లో కూడా పారిశ్రామికవేత్తలు ఏపిలో గత 9నెలల రివర్స్ పాలనపై ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ తీరుతో రాష్ట్రానికి చెడ్డపేరు రావడమే కాకుండా, లక్షలాది యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతోంది. ఇకనైనా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్దిపై, భావితరాల భవిష్యత్తుపై దృష్టిసారించాలి'' అంటూ చంద్రబాబు ట్విట్టర్ ద్వారా వైసిపి  ప్రభుత్వానికి సూచనలిచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios