Asianet News TeluguAsianet News Telugu

వికేంద్రీకరణ బిల్లుపై హైకోర్టులో విచారణ... ప్రభుత్వానికి ఆదేశాలు

ఏపి వికేంద్రీకరణ, సీఆర్డీఏ  రద్దుతో పాటు జగన్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. తాజాగా ఆ పిటిషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగింది.

Highcourt to hear petitions CRDA Repeal and evacuation of offices from amaravati
Author
Amaravathi, First Published Feb 26, 2020, 2:48 PM IST

అమరావతి: సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లు, రాజధాని నిర్మాణాల కొనసాగింపు,హైకోర్టు తరలింపుపై  వచ్చిన పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ చేపట్టింది. న్యాయస్థానం ముందు పిటిషనర్లు, ప్రభుత్వం తరపు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. అయితే ఇరు పక్షాల వాదనల అనంతరం తదుపరి విచారణ వచ్చే నెల 30కి వాయిదా వేసింది హైకోర్టు. 

ఈ సందర్భంగా ప్రభుత్వం రాజధాని అద్యయనం కోసం ఏర్పాటుచేసిన జీఎన్ రావు, బోస్టన్, హైపవర్ కమిటీల నివేదికలను కోర్టుకు సమర్పించాలని ఏజీకి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి వాటిని తమకు అందివ్వాలని ఏజికి సూచించింది. 

రాజధానిలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై తాజాగా హైకోర్టులో మరో పిటిషన్ దాఖలయ్యింది. సీఆర్డీఏ చట్టానికి, మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారని కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను అత్యవసర వ్యాజ్యంగా భావించి విచారణ చేపట్టాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. 

read more  చంద్రబాబు ఓటమి ట్రంప్ కు కోపం తెప్పించిందా...అందుకే జగన్ కు..: కన్నబాబు

ఓవైపు మండలిలో వికేంద్రీకరణ బిల్లు ఆగిపోవడం, కోర్టుల్లో విచారణలు సాగుతున్న పాలనా వికేంద్రీకరణ విషయంలో ముందుకే సాగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది.  

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణను అధికారికంగా ప్రారంభించింది. పాక్షిక న్యాయ విభాగమైన విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్ సభ్యుల కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

ఇప్పటి వరకు ఆ విభాగాలన్నీ వెలగపూడి సచివాలయంలో ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అవి కర్నూలు తరలనున్నాయి. ఈ విభాగాలన్నింటికీ అవసరమైన భవనాలు సమకూర్చాలని ఆర్ అండ్ బీ, కర్నూలు కలెక్టర్ కు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

read more  బాబు కళ్లలో ఆనందం కోసం పచ్చ మీడియా ఏదైనా రాస్తుంది: విజయసాయి

న్యాయసంబంధితమైన కార్యాలయాలను అన్నింటినీ కర్నూలులో పెడుతామని ఏపి ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ఆ మేరకు తమ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం పూనుకుంది. మూడు రాజధానుల ప్రతిపాదనను ఓ వైపు ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ముందుకే వెళ్లాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, దాన్ని అమలు పెడుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios