Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు రేప్ కేసుపై సీఐడీ ఆరా: నిందితుడి తల్లి పోలీస్ శాఖలో ఉన్నతాధికారి

గుంటూరులో బిటెక్ విద్యార్థినిపై అత్యాచారం చేసి, ఆమె నగ్న దృశ్యాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన కేసుపై సీఐడి ఆరా తీస్తోంది. నిందితుల్లో ఒకతని తల్లి పోలీసు శాఖలో పనిచేస్తోంది.

CID jumped into action on Guntur molestation case
Author
Guntur, First Published Jun 29, 2020, 12:41 PM IST

గుంటూరు: గుంటూరులో బిటెక్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసుపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. నిందితుల్లో ఒక్కడైన వరుణ్ తేజ్ తల్లి పోలీసు శాఖలోని కమ్యూనికేషన్ విభాగంలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మరో నిందితుడు ఆవుల కౌశిక్ తండ్రి వైద్యుడు. ఈ స్థితిలో కేసును నీరుగారుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

బాధితురాలి కుటుంబ సభ్యులకు, నిందితుల కుటుంబాల సభ్యులకు మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో కేసు పూర్వపరాలపై, దర్యాప్తు జరుగుతున్న తీరుపై సీఐడి ఆరా తీస్తోంది. 

విద్యార్థి నగ్న దృశ్యాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వ్యక్తిని కూడా పోలీసులు గుర్తించిట్లు సమాచారం. ఐపి అడ్రస్ ద్వారా అతని ఆచూకీని గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డితో సమావేశమయ్యారు. 

ఈ సంఘటనను తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వాసిరెడ్డి పద్మ చెప్పారు. పరువు పోతుందనే భయంతో బాధితురాలి కుటుంబ సభ్యులు బయటకు రాలేదని వారు చెప్పారు. వీడియోలు సర్క్యులేట్ కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. 

 ఇదిలావుంటే, అశ్లీల వీడియోల ద్వారా యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్న కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. అశ్లీల వీడియోలు చిత్రీకరించి యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్న కేసులో పోలీసులు వరణ్, కౌశిక్ అనే ఇద్దరు యువకులను దిశ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో జరిగింది. 

యువతి అశ్లీల వీడియోల కేసులో ఇద్దరు యువతుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వరుణ్ స్నేహితురాలికి, కౌశిక్ సోదరికి అశ్లీల వీడియోలు పంపించారని, వారు వాటిని పోర్న్ సైట్లలో అప్ లోడ్ చేశారని పోలీసులు గుర్తించారు. 

ఇద్దరు యువతులపై కేసు పెట్టే దిశగా పోలీసులు ఆలోచన చేస్తు్ననారు. ఇద్దరు యువకులు ఒకరి తర్వాత ఒకరు బాధిత యువతిని ప్రేమించినట్లు నమ్మించి, అశ్లీల వీడియోలు తీసి మూడేళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నారు. 

విషయం బాధిత యువతి కుటుంబ సభ్యులకు తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

బిటెక్ విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారం చేసి, అశ్లీల వీడియోలు చిత్రీకరించిన విషయం తెలిసిందే. కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి తాగించి స్పృహ తప్పిన తర్వాత యువతిపై వారు అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది. ఆ వీడియోలను పోర్న్ సైట్లలో పెట్టి వేధిస్తున్నారు. ఈ వ్యవహారం 2017 నుంచి సాగుతూ వచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios