గుంటూరు: గుంటూరు జిల్లాలో  మరో పోలీసు అధికారి భాగోతం వెలుగు చూసింది. ఇప్పటికే ఇద్దరు ఎస్ఐలు మహిళలతో వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నందున పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకొన్నారు. తాజాగా సీఐ వెంకట్‌రెడ్డిపై ఐజీ వేటేశారు.

Also read:హైద్రాబాద్‌లో విచారణ పేరుతో తల్లీ కూతుళ్లతో ఎస్ఐ వివాహేతర సంబంధం

గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న సీఐ వెంకట్ రెడ్డి ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా  గుంటూరు రేంజీ ఐజీ విచారణ జరిపారు. విచారణలో మహిళతో సీఐ వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్టుగా  అధికారులు గుర్తించారు.

గుంటూరు జిల్లా అరండల్‌పేట ఎస్ఐ బాలకృష్ణ ఘటన  జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఎస్ఐ బాలకృష్ణతో పాటు ఆయనకు సహకరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు.ఈ  ఘటన మరువకముందే మరో ఎస్ఐ కూరపాటి నాగేంద్రపై కూడ ఓ యువతి లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు చేసింది.

ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఎస్ఐ తనను లైంగికంగా వేధింపులు పాల్పడినట్టుగా బాధితురాలు ఆరోపించారు. ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరో వైపు సీఐ వెంకట్ రెడ్డిపై కూడ ఇదే రకమైన ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకొన్నారు.