Asianet News TeluguAsianet News Telugu

విద్యుత్ విధానాల్లో సవరణలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

*ఇకపై విద్యుత్ ఉత్పత్తి ధరలపై ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఛార్జీల విధింపు

*ఎనర్జీ బ్యాంకింగ్, పంపిణీ విధానం ఉపసంహరణ

*పునరుత్పాదక విద్యుత్ ధరల్లో భారీ హెచ్చుతగ్గులకు అవకాశం లేకుండా మార్పులు
 

AP government orders amendments to power policies
Author
Hyderabad, First Published Nov 18, 2019, 8:08 PM IST

సౌర, పవన, హైబ్రిడ్ విద్యుత్ విధానాల్లో సవరణలు చేస్తూ ఆంధ్ర ప్రదేష్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పునరుత్పాదక విద్యుత్ ధరల్లో భారీ తేడాల వల్ల డిస్కమ్ లు నష్టపోతున్నాయని ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. ఇకపై విద్యుత్ ఉత్పత్తి ధరలపై ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఛార్జీల విధింపు జరుగుందని స్పష్టం చేశారు.

ఎనర్జీ బ్యాంకింగ్, పంపిణీ విధానం ఉపసంహరించుకుంటూ పునరుత్పాదక విద్యుత్ ధరల్లో భారీ హెచ్చుతగ్గులకు అవకాశం లేకుండా మార్పులు జరగనున్నాయి. అలాగే పునరుత్పాదక విద్యుత్ ధరలను ఈఆర్సీ ప్రతీ ఏడాది నిర్ధారించేలా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇకపై విద్యుత్ సంస్ధలకు భూకేటాయింపులన్నీ లీజు విధానంలోనే జరగాలని ఆదేశాలు జారీ చేశారు.

also read: ఆ బొగ్గు క్షేత్రంపై జగన్ కన్ను: ప్రధాని మోదీకి లేఖ

అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ఒడిశా తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్‌కో థర్మల్‌ ప్లాంట్‌కు కేటాయించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. 

రాష్ట్రంలోని ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల సామర్ధ్యం 5010 మెగావాట్లు ఉందని తెలిపారు. మహానది కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్, సింగరేణి కోల్‌ కాలరీస్‌ లిమిటెడ్‌ల నుంచి బొగ్గు సరఫరా కోసం ఒప్పందాలు ఉన్నాయని తెలిపారు. 

ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల అవసరాలకు సరిపడా బొగ్గు, సింగరేణి కోల్‌ కాలరీస్‌ లిమిటెడ్‌ నుంచే సరఫరా అయ్యేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత సింగరేణి కోల్‌ కాలరీస్‌ను తెలంగాణా రాష్ట్రానికి కేటాయించారని గుర్తు చేశారు. 

అయితే సింగరేణి కోల్ కాలరీస్ లో కనీసం బొగ్గు నిల్వల్లో వాటాను కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వలేదన్నారు. ఇతర రాష్ట్రాల నుంచే వచ్చే బొగ్గు మీదే ఎక్కువగా ఆధారపడుతున్నామని చెప్పుకొచ్చారు.  

రాష్ట్ర విద్యుత్‌ రంగంలో భరోసా లేకుండా పోయిందని జగన్ లేఖలో పేర్కొన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరాకు ఈ పరిస్ధితి తీవ్ర అవరోధంగా మారిందన్నారు. పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. 

ఐబి వ్యాలీ, మరియు తాల్చేరు క్షేత్రాల్లో భారీగా బొగ్గు నిల్వలు ఉన్నాయని లేఖలో వివరించారు సీఎం జగన్. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌ఘడ్, తెలంగాణా రాష్ట్రాలకు బొగ్గు సంపద ఉందని కానీ ఏపీకి లేదన్నారు. 

వాణిజ్య అవసరాల కోసం మధ్యప్రదేశ్‌లో ఒకటి, చత్తీస్‌ఘడ్‌లో ఒక గనిని ఏపీఎండీసీకి కేటాయించారని అయితే ప్రతీగని నుంచి 5ఎంఎంటీఏలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 
కానీ ఈ గనుల నుంచి బొగ్గు వెలికితీయడానికి నిర్వహణా వ్యయం చాలా అధికంగా ఉందన్నారు.

కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ బొగ్గు గనుల చట్టం–2015 ప్రకారం ట్రాంచీ –6ను ఏపిజెన్‌కో వినియోగం కోసం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారని గర్తు చేశారు
మార్చి 2020 నాటికి ఏపీ జెన్‌కో తన థర్మల్‌ కేంద్రాల ద్వారా మరో 1600 మెగావాట్ల అదనపు విద్యుత్‌ ఉత్పాదనకు సిద్ధమవుతోందని తెలిపారు. ఈ అదనపు విద్యుత్‌ తయారీకోసం ఏటా 7.5 ఎంఎంటీఏల బొగ్గు నిల్వలు అవసరం ఉందని లేఖలో పొందుపరిచారు.

అంతేకాకుండా ప్రస్తుతం ఎదుర్కొంటున్న బొగ్గు కొరతను నివారించడానికి, బొగ్గు ఒప్పందాల ప్రకారం మరింత బొగ్గును సరఫరాచేయాల్సి ఉందన్నారు. అందువల్ల 
మందానికిని– ‘‘ఎ’’ కోల్‌ బ్లాక్, తాల్చేరు కోల్‌ఫీల్డ్, అంగుల్‌ బొగ్గు క్షేత్రాలను వెంటనే కేటాయించాలని లేఖలో కోరారు. 

మందాకిని కోల్ బ్లాక్ ను ఏపీజెన్ కోకు కేటాయించాలని కోరుతున్నామని తెలిపారు.కేంద్ర బొగ్గుశాఖ ప్రకటించిన విధంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో ఏడాదికి కనీసం 50 ఎంఎంటీఏ బొగ్గును ఏపీఎండీసీ, ఏపీ జెన్‌కోకు కేటాయించాలని విజ్ఞప్తి ప్రధాని మోదీని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ సీరియస్: సిఎస్ ఎల్వీ బదిలీ వెనక అసలు ట్విస్ట్.

Follow Us:
Download App:
  • android
  • ios