Asianet News TeluguAsianet News Telugu

యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడులే జగన్ టార్గెట్... అందుకోసమే...: వర్ల రామయ్య

మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కింజారపు  అచ్చెన్నాయుడినే ముఖ్యమంత్రి టార్గెట్ చేశారని టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య ఆరోపించారు. వీరిద్దరిని లక్ష్యంగా చేసుకోడానికి ప్రత్యేక కారణాలున్నాయని పేర్కొన్నారు. 

AP CM YS Jagan targetes Yanamala , Atchannaidu...; Varla Ramaiah
Author
Guntur, First Published Feb 21, 2020, 8:45 PM IST

గుంటూరు: పంచాయతీ మంత్రిత్వశాఖ ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు రంగులేయడానికి నామినేషన్ ద్వారా రూ.1400 కోట్లు ఖర్చు చేశారని... దీనికి పంచాయతీరాజ్ కమిషనర్ లెటర్ నెం. 751 ద్వారా సర్క్యులర్ ఇచ్చారని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.   ఇందులో సీఎం జగన్ రెడ్డి బొమ్మ గ్రామ సచివాలయాలపైన ముద్రించమని కోరారని... దీనిని హైకోర్టు కూడా తప్పుబట్టింది కాబట్టి బొమ్మ వేసుకున్న దానికి జగన్, పంచాయతీ మంత్రి  అవినీతికి పాల్పడట్టు వారు అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు.

ఈఎస్ఐ ఆసుపత్రుల్లో అక్రమాలు జరిగాయంటూ అబద్ధపు పుత్రిక సాక్షి పత్రిక మీడియాలో ఇష్టానుసారంగా కథనాలు వండివారిస్తుందని ఆరోపించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టెలీ హెల్త్ సర్వీసెస్ కార్యక్రమం తెలంగాణలో అమలు ఉండగా అదే పద్ధతిలో  మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని అచ్చెన్నాయుడు ఒక నోట్ ను సంబంధిత శాఖకు పంపించడం జరిగిందని... దీనిని సాక్షి పత్రిక భూతద్దంలో చూపిస్తోందన్నారు. 

విజిలెన్స్ రిపోర్ట్ పేరా 11లో ఈసీజీ సర్వీసెస్, టోల్ ఫ్రీ సర్వీసెస్ కింద మొత్తం రూ. 7.96 కోట్ల రూపాయల పనులను మాత్రమే నామినేషన్ కింద కేటాయించినట్లుగా ఉన్నదన్నారు. ఇది కూడా అధికారులు చేశారని... కానీ వాస్తవ విరుద్ధంగా అచ్చెన్నాయుడు వందల కోట్లు అవినీతి చేసినట్లు వైసిపి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

read more  ఏపికి మహిళా ముఖ్యమంత్రి... ప్రచారం చేయిస్తున్నదే జగన్... ఎందుకంటే...: దేవినేని ఉమ 

బీసీ కార్పోరేషన్ నిధులను జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించిన విషయాన్ని అచ్చెన్నాయుడు వేలెత్తి చూపించారని...అంతేకాకుండా  ప్రభుత్వ వైఫల్యాలాను కూడా వేలెత్తి చూపుతున్నందునే అతన్ని టార్గెట్ చేశారని అన్నారు. అచ్చెన్నాయుడు వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి వైసీపీ పథకం ప్రకారం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. 

సీఎం జగన్ పై 9 నెలల్లోనే ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు టీడీపీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర విజయవంతం కావడాన్ని జీర్ణించుకులేని వైసీపీ నేతలు అచ్చెన్నాయుడుపై బురద జల్లుతున్నారన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల భూములను జగన్ లాక్కుంటున్నాడని మండిపడ్డారు. 

బడుగు, బలహీన వర్గాలకు చెందిన కార్పోరేషన్ల నిధులను పక్కదారి పట్టిస్తున్నారని అచ్చెన్నాయుడు ప్రజాక్షేత్రంలో గట్టిగా నిలదీస్తుండటంతో జగన్ ఆయనపై వ్యక్తిగత కక్ష పెంచుకున్నాడని అన్నారు.  ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసి ప్రజావ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి జగన్ నానా తంటాలు పడుతున్నాడని... ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని పనిగట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తున్న అవినీతి పత్రికలు వాస్తవాలు గ్రహించాలన్నారు. 

2016 లో ప్రధాని మోదీ ఈఎస్ఐ సమావేశం ఏర్పాటు చేసి టెలీ హెల్త్ సర్వీసెస్  సేవలను టెక్నాలజీ ద్వారా అందించాలని సూచించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా 2016 డిసెంబర్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలలోని ప్రిన్సిపల్ సెక్రటరీలకు లేఖ రాయడం జరిగిందని... వీలైనంత త్వరగా ఆయా రాష్ట్రాలలో టెలీ హెల్త్ సర్వీసెస్ ను అమలు చేయాలన్నది ఆ లేఖ ఉద్దేశమని తెలిపారు. ప్రధానమంత్రి ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వ అధికారులంతా మినిట్స్ రెడీ చేసుకుని ఆ దిశగా ముందుకు వెళ్లడం జరిగిందన్నారు. 

read more  ముఖ్యమంత్రి పదవికోసం... జగన్ పైనే విజయసాయి రెడ్డి కుట్రలు..: బుద్దా సంచలన వ్యాఖ్యలు

టెలీ హెల్త్ సర్వీసెస్ అప్పటికే తెలంగాణలో అమలు చేస్తున్నారని అధికారులు నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకురావడంతో అదే పద్ధతిలో  మన రాష్ట్రంలోనూ అమలు చేయమని ఆయన ఒక నోట్ ను శాఖకు పంపించడం జరిగిందన్నారు. కానీ వైకాపా పచ్చ మీడియా ఆ నోట్ ను బూతద్ధంలో చూపుతూ అచ్చెన్నాయుడిపై లేని అవినీతి బురదను పూయాలని చూస్తుందని మండిపడ్డారు. 

 అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉన్న సమయంలో ఏ ఒక్క పనులను కూడా నామినేషన్ పద్ధతిలో ఇవ్వమని ఎక్కడా చెప్పలేదన్నారు.  టెండర్ పద్ధతిలోనే ముందుకు వెళ్లమని నోట్ లు కూడా విడుదల చేయడం జరిగిందని వెల్లడించారు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కనీసం ఒక్క ట్యాబ్లెట్ ను గానీ, ఒక్క ఇంజక్షన్ ను గానీ పక్కదారి పట్టించలేదన్న విషయాన్ని అవినీతి పత్రికలు తెలుసుకోవాలని సూచించారు. 

అచ్చెన్నాయుడు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న సాక్షి మీడియాపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.  ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలపై బురదజల్లడం మానుకుని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని జగన్ ప్రభుత్వానికి రామయ్య సూచించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios