Asianet News TeluguAsianet News Telugu

వైసిపికి షాకిచ్చిన 17మంది ఎమ్మెల్యేలు... అసెంబ్లీ అధికారులపై జగన్ సీరియస్

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానం పై జరిగిన అసెంబ్లీలో  ఓటింగ్ జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై సీఎం జగన్ సీరియస్ అయినట్లు సమాచారం. 

AP CM YS  Jagan  serious on his  party  MLAs
Author
Amaravathi, First Published Jan 27, 2020, 7:15 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై శాసనసభలో సోమవారం ఉదయం నుండి చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఈ తీర్మానంపై ఓటింగ్ కూడా జరిగింది. అయితే ఈ తీర్మానం శాసనసభ ఆమోదాన్ని పొందినప్పటికి ఈ ఓటింగ్ ప్రక్రియలో ముఖ్యమంత్రి జగన్ కు షాకిచ్చే ఫలితం వెలువడింది. 

ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన అతి కీలకమైన మండలి రద్దు తీర్మానాన్ని కొందరు వైసిపి ఎమ్మెల్యేలు వ్యతిరేకించేలా వ్యవహరించారు. ఓటింగ్ సమయంలో దాదాపు 17 మంది వైసిపి ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. అత్యంత కీలకమైన సమయంలో ఎమ్మెల్యేలు సభలో లేకపోవడంపై సీఎం జగన్ సీరియస్ అయినట్లు సమాచారం. వారిపై చర్చలు తీసుకునే ఆలోచనలో సీఎం వున్నట్లు తెలుస్తోంది. 

read more  గొంతు నొక్కడం కాదు జగన్ ఏకంగా మర్డర్ చేశారు...: నిమ్మల రామానాయుడు

అయితే మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో తాము ఓటింగ్ కి దూరంగా ఉన్నట్లు ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మండలిలో జరిగే చర్చల ద్వారా తీసుకునే నిర్ణయాలతో ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారట. అలాంటి మండలి రద్దుతో వైఎస్ ఆశయాలకు తూట్లు పొడిచినట్టు అవుతుందని..... అందుకే అసెంబ్లీకి దూరంగా వున్నామని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారట.

ఓటింగ్ సందర్భంగా శాసనసభ అధికారులు వ్యవహరించిన తీరు కూడా ముఖ్యమంత్రికి కోపాన్ని తెప్పించినట్లు తెలుస్తోంది. మండలి రద్దు తీర్మానంపై ఓటింగ్ చేపట్టిన అధికారులు రెండుసార్లు సభ్యుల కౌంటింగ్ చేపట్టడమే సీఎం కోపానికి కారణమని తెలుస్తోంది. మొదటిసారి 121 మంది అనుకూలం అని ప్రకటించిన స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించగా అంతకంటే ఎక్కువమంది ఉన్నారని సభ్యులు చెప్పడంతో మరోసారి లెక్కింపు చేపట్టారు.

అసెంబ్లీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ లెక్క తప్పినట్లు తెలుస్తోంది. ఓటింగ్ సమయంలో అలస్యంపై కూడా సీఎం అసహనం వ్యక్తం చేశారట. ఓటింగ్ సమయంలో సభలో విప్ లు చెవిరెడ్డి,దాడిశెట్టి రాజాలు లేకపోవడంపై కూడా సీఎం జగన్ సీరియస్ అయినట్లు సమాచారం. 

read more  జగన్ కు రివర్స్ టెండరింగ్ ద్వారానే బుద్దిచెప్పేది... అదెలాగంటే: వంగవీటి రాధ

అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానంపై జరిగిన ఓటింగ్ లో రద్దుకు అనుకూలంగా 133, వ్యతిరేకంగా 0 ఓట్లు వచ్చాయి. మండలి రద్దుకు అనుకూలంగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఓటేసినట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios