కూతురు కులాంతర వివాహం చేసుకుందని కూతురి భర్తను అత్యంత కిరాతకంగా కిరాయి హంతకులతో హత్య చేయించిన మారుతీ రావు నిన్న ఆత్మహత్య చేసుకొని విగత జీవిగా మారాడు. 

ఇటు కూతురు తన వద్దకు రాక, పైపెచ్చు కేసులో తానే దోషినని తేలబోతున్న తరుణంలో కూతురితో జరిపిన రాయబారాలు కూడా విఫలమైన వేళ మనో వేదనకు లోనై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. 

వాస్తవానికి మారుతీ రావు తన అర్థ బలాన్ని చూసుకొనే... అల్లుడు ప్రణయ్ ని హత్యా చేయిస్తే... కూతురు తనం వద్దకు వస్తుంది, ఆతరువాత కేసులోంచి ఎలాగో ఒకలాగా బయట పడొచ్చు అనుకున్నాడు. కానీ అందుకు విరుద్ధంగా కూతురు ససేమిరా రాననడంతో ఎం చేయాలో తెలియని సంకట స్థితికి లోనయి తనువు చాలించాడు. 

Also read: మారుతీరావు కి తలకొరివి పెట్టనున్న తమ్ముడు, అమృతకు దక్కని అవకాశం

అగ్రకులస్థుల్లో ఉండే ఒక అహంభావం, ధన బలం వల్ల వచ్చిన ఒక కావరం అన్ని మారుతి రావులో మనకు కనబడుతాయి. ఇక ఈ విషయాలన్నీ పక్కనబెడితే... సమాజంలో మారుతీ రావుకు ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ కూడా లభించింది. 

కన్నకూతురుని అంతలా ప్రేమించిన తండ్రిని కాదని వెళ్లడం ఎంతవరకు న్యాయం అని చాలామంది ఆయనకు బాసటగా నిలిచారు. మారుతీరావు ఫాన్స్ క్లబ్బులు రాష్ట్రమంతా వెలిశాయి.

మారుతీ రావుకు అనుకూలంగా చాలామంది కాలేజీ విద్యార్థులు మాట్లాడడం విశేషం. అందులో ఒక బాలిక మాట్లాడిన విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అయి, దానికి డీజే ఎఫెక్ట్స్ కూడా ఆడ్ చేసి ఆన్ లైన్ లో విడుదల చేసారు. 

ఇకపోతే..., సాధారణంగా సెన్సేషనల్  విషయాలు బయటకు రాగానే వాటిపై సినిమా తీయాలనుకునే రామ్ గోపాల్ వర్మ ఆ దిశగా చూస్తున్నాడా అనే అనుమానం కలుగక మానదు. దిశా ఉదంతం జరగగానే ఆ విషయంపై సినిమాను కూడా మొదలెట్టాడు.

ఇక ఇప్పుడు ఈ మారుతీ రావు ధి "చంపేంత, చచ్చేంత ప్రేమ" కూడా కావడంతో చూడాలి రామ్ గోపాల్ వర్మ ఈ విషయం మీద కూడా సినిమా తీస్తారేమో! 

ఇక దిశా ఘటన మీద సినిమా తీయాలనిన్ అనుకున్న వర్మ ఆదిశగా పనులు మొదలుపెట్టాడు. దిశా ఉదంతం జరిగిన ప్రాంతంలో షూటింగ్ మొదలుపెట్టాడు. దానికి ముందు వర్మ శంషాబాద్ ఏసిపిని కూడా కలిశారు. 

Also read: మారుతీ రావు మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి.. : నివేదికలో ఏముంది

ఆయన్ని అడిగి దిశ కేసు వివరాలు తెలుసుకున్నారు. దిశ సంఘటనపై సినిమా తెరకెక్కించేందుకు తనకు ఎవరి అనుమతి కూడా అవసరం లేదని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దిశ చిత్ర షూటింగ్.. ఆ ఘోరం జరిగిన చటాన్ పల్లి ప్రాంతంలో ప్రారంభమైంది. 

ప్రస్తుతం దిశని కిడ్నాప్ చేయడం.. అత్యాచారం, హత్య, సజీవదహనానికి సంబంధించిన సన్నివేశాలని ఆ ప్రాంతంలో వర్మ చిత్రీకరిస్తునట్లు తెలుస్తోంది. వర్మ తన క్రియేటివిటీతో ఈ ఘోర సంఘటనని ఎలా చూపించనున్నాడో మరి.