Anjali: ఓర్నీ... అంజలి 'ఐటం సాంగ్' వెనక ఇంత స్కెచ్ ఉందా?
నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా చివరి పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ నితిన్, కృతీశెట్టి లుక్ విడుదల చేసింది.
సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ తో హాట్ స్టెప్పులేసి మెప్పించిన బ్యూటీ అంజలి ..ఇప్పుడు మరోసారి తనలో హాట్ ఐటెం గర్లని బయటకు రప్పించింది. తాజాగా నితిన్ హీరోగా నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అంజలి పోస్టర్ ని రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ టైటిల్ సాంగ్ ని విడుదల చేయనున్నారు. సినిమాల్లో ఐటెం సాంగ్ లు పెట్టడం కొత్త విషయమేమీ కాదు. అయితే అంజలి ని తీసుకురావటం వెనక అసలు కారణం వేరే ఉందంటున్నారు. మొదట ఈ ఐటం సాంగ్ ని ప్లాన్ చేయలేదట.
కానీ ‘మాచర్ల నియోజకవర్గం’ ప్రాజెక్టుకు క్రేన్స్ వేసి లేపినా క్రేజ్ రావటం లేదంటున్నారు. నితిన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి మొదలెట్టిన ప్రాజెక్టుపై రకరకాల రూమర్స్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సినిమా రీషూట్స్ కు వెళ్లాలని, మొదట కథ చెప్పినప్పుడు ఉన్నట్లుగా ఫైనల్ అవుట్ ఫుట్ లో కనిపించకపోవటంతో ఇప్పుడు హంగులు అద్దే పోగ్రామ్ పెట్టుకున్నారంటున్నారు. ఈ క్రమంలోనే అంజలిని రంగంలోకి దించారంటున్నారు. అంజలి ఐటెం సాంగ్ కు కాస్త ఎక్కువ పే చేసినా బిజినెస్ పరంగా బాగా ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. సినిమాపై నెగిటివ్ బజ్ పోయి పాజిటివ్ క్రియేట్ చేయాలని టీమ్ చేసే ప్రయత్నాల్లో ఇదొకటి అంటున్నారు.
నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా చివరి పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ నితిన్, కృతీశెట్టి లుక్ విడుదల చేసింది.
దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. పొలిటికల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. మిగిలిన ఒక పాటను త్వరలో చిత్రీకరించనున్నాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్ట్ 12న సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల.