చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ నిర్మిస్తున్నాడు అని నిన్న మొన్నటి వరకు మాట్లాడుకునే వారు. ఎప్పుడైతే నోరుజారి చిరంజీవి ఓ పిట్ట కథ ఈవెంట్ లో ఆ చిత్రం పేరు ఆచార్య అని ప్రకటించారో... ఆ నాటి నుండి ఆచార్య అనే పిలుస్తున్నాము. 

చిరంజీవి సినిమా అనే సరికి మామూలుగానే ఒక రకమైన హైప్ ఉంటుంది. ఇక దానికి తోడు మహేష్ బాబు కూడా ఆడ్ అవడంతో ఈ సినిమా పై జనల ఎక్సపెక్టేషన్స్ ఒక  లెవెల్ కి చేరుకున్నాయి. 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సూపర్ స్టార్ మహేష్ బాబు తన పాత్ర ఇతివృత్తాన్ని వినేసారు. దాన్ని చూసి చాలా ఇంప్రెస్స్ కూడా అయ్యారట. కొరటాల శివతో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు చేసిన అనుభవం వల్ల, శివ డైరెక్షన్ పై పూర్తి విశ్వాసంతో నిడివి తక్కువగా ఉన్నప్పటికీ.... మహేష్ బాబు ఈ చిత్రానికి ఒప్పుకున్నట్టు టాక్. 

Also read: కొరటాల కండీషన్ కు ఖంగుతిన్న రామ్ చరణ్!

ఇక ఈ విషయంపై తాజా సమాచారం ఏమిటంటే... మహేష్ బాబు డైరెక్టర్లకు తన కాల్ షీట్స్ కూడా ఇచ్చేశాడంట. మే ఎండింగ్ నుండి కానీ, లేదంటే జూన్ మొదటివారం నుండి కానీ షూటింగ్ చేయడానికి మహేష్ బాబు ఓకే అన్నాడట. 

మహేష్ ప్రస్తుతం పరుశురాం తో ఒక సినిమా తీస్తున్నందున, ఆ షూటింగ్ మధ్యలో ఉండడం వల్ల, దాని చిత్రీకరణ పూర్తయిన తరువాత మహేష్ బాబు ఈ చిత్రానికి షూటింగ్ ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. 

ఎవరి పాత్రలేమిటి...?

ఈ సినిమాకు ఆచార్య అన్న పేరుకు తగ్గట్టుగానే చిరంజీవి ఒక మావోయిస్టుగా కనపడనున్నాడు. మహేష్ బాబు విద్యార్ధి నేతగా, చిరంజీవిని చూసి స్ఫూర్తి పొందే స్టూడెంట్ లీడర్ గా ఈ చిత్రం లో కనిపించనున్నట్టు తెలియవస్తుంది. 

ఇంకొక గాసిప్ ప్రకారం చిరంజీవి ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అని అలా అతను ఆచార్యుడిగా భావితరాలకోసం ఎలా పోరాటం చేసాడనేది చూపెట్టనున్నట్టు సమాచారం. 

Also read: మెగాస్టార్ 'ఆచార్య' రిలీజ్ డేట్ ఫిక్స్?

మొత్తానికి ఏది ఏమైతే ఏం మెగాస్టార్, పవర్ స్టార్లిద్దరూ ఒక స్క్రీన్ పై కనపడనుండడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో చివరంజీవిని చాలా నూతనంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు కొరటాల శివ.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలియవస్తుంది.