కిచెన్ రూంని.. ఇలా క్లీన్ చేస్తే తలతలా మెరిసిపోతుంది
మన ఇంట్లో చాలా తొందరగా మురికిగా మారే గదుల్లో కిచెన్ ఒకటి. అందుకే ఆడవాళ్లు కిచెన్ రూంని క్లీన్ చేయడానికి గంటల సమయం తీసుకుంటారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే మాత్రం నిమిషాల్లో చకచకా క్లీన్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వంటగదిని క్లీన్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే ఆడవాళ్లు గంటలకు గంటలు వంటింటిని క్లీన్ చేస్తుంటారు. అలాగే క్లీనింగ్ కోసం రకరకాల చిట్కాలను ఫాలో అవుతుంటారు. నిజానికి వంటింటిని క్లీన్ చేయడం ఆడవాళ్లకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. కానీ కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం కేవలం నిమిషాల్లోనే వంటగదిని నీట్ గా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పాత బట్టలతో శుభ్రం
ప్రతి ఒక్కరి ఇంట్లో పాత దుస్తులు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి వేటికీ పనికిరావని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఈ పాత బట్టలను ఎన్నింటికో వాడొచ్చు. అవును వీటితో ఎన్నో రకాల పనులను కంప్లీట్ చేయొచ్చు. ముఖ్యంగా పాత దుస్తులను ఉపయోగించి వంటింటిని తలతలా మెరిసేలా చేయొచ్చు.
కిచెన్ సింక్ క్లీన్
కిచెన్ లో తొందరగా మురికిగా మారే ప్లేస్ ఏదైనా ఉందంటే అది డిష్ వాషింగ్ సింక్ అనే చెప్పాలి. ఎందుకంటే దీనిలో తిన్న ప్లేట్లు, గ్లాసులు, వండిన గిన్నెలు పేరుకుపోతాయి. దీనివల్ల కిచెన్ లో దుర్వాసన వస్తుంది. అలాగే ఈగలు, బొద్దింకలు కూడా వస్తాయి. అందుకే కిచెన్ లో రెగ్యులర్ గా క్లీన్ చేయాల్సిన వాటిలో సింక్ ముందుంటుంది.
అయితే సింక్ లో దుర్వాసన రాకూడదన్నా.. మురికిగా మారకూడదన్నా.. దాంట్లో అన్నం, కూరలు వంటి మిగిలిన పదార్థాలను వేయకూడదు. అలాగే దీన్ని క్రమం తప్పకుండా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే మురికిగా మారుతుంది. అయితే బేకింగ్ సోడాతో సింక్ చాలా తొందరగా శుభ్రమవుతుంది.
kitchen cleaning
గ్యాస్ బర్నర్ క్లీనింగ్
చాలా మంది రాత్రివంట పూర్తైన తర్వాత గ్యాస్ స్టవ్ ను క్లీన్ చేస్తుంటారు. కానీ ఈ క్లీనింగ్ గ్యాస్ స్టవ్ బాడీకి మాత్రమే. దీనివల్ల గ్యాస్ స్టవ్ పై మురికి కనిపించదు. కానీ గ్యాస్ బర్నర్ మాత్రం నల్లగా మారుతుంది. దీనివల్ల మంట కూడా సరిగ్గా రాదు. ఎందుకంటే వాటి రంధ్రాల్లో దుమ్ము, ధూళి బాగా పేరుకుపోతాయి. దీనితో మంట రాదు. లేదా చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి గ్యాస్ స్టవ్ తో పాటుగా బర్నర్లను కూడా క్లీన్ చేసుకోవాలి.
ఇత్తడి సామాగ్రి శుభ్రం
ఇత్తడి ఒక లోహం. ఇది చూడటానికి బాగున్నా.. టైంకి క్లీన్ చేయకపోతే మాత్రం తొందరగా నల్లగా, పాతగా అవుతాయి. మీరు గమనించారో లేదో ఇత్తడి ప్లేట్లు, గ్లాసులు వంటి ఇత్తడి పాత్రలే తుప్పు పడుతుంటాయి. ఇలాంటి వాటిని క్లీన్ చేయడం చాలా కష్టం. అందుకే ఎప్పటికప్పుడు వీటిని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల క్లీనింగ్ కు ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉండదు.
టైల్స్ క్లీన్
కిచెన్ స్లాబ్ ను, స్టవ్ ను క్లీన్ చేస్తే సరిపోదు. కిచెన్ టైల్స్ ను కూడా క్లీన్ చేయాలి. దీన్ని ఒక్క రోజు క్లీన్ చేయకుండా వదిలేస్తే గ్యాస్ ముందున్న టైల్స్ పై నూనె ఆవిరి, మసాలా దినుసులు చిల్లుతాయి. దీంతో ఆ టైల్స్ కు దుమ్ము, ధూళి పేరుకుపోతాయి. దీంతో టైల్స్ మురికిగా కనిపిస్తాయి. అందుకే టైల్స్ ను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి.