గ్యాస్ స్టవ్ ను ఈజీగా, ఫాస్ట్ గా క్లీన్ చేసే చిట్కాలు.. మీకోసం..
గ్యాస్ స్టవ్ పై మనం ప్రతిరోజూ ఎన్నో రకాల వంటలను చేస్తుంటాం. ఒక్కోసారి స్టవ్ పై పాలు పొంగడం, పప్పు ఒలికిపోవడం, గంజి ఒలకడంతో పాటున ఎన్నో పడుతుంటాయి. వీటిని అప్పటికప్పుడు క్లీన్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇవి ఎండిపోయిన తర్వాత మాత్రం మొండిగా అవుతాయి.
చాలా మంద మా గ్యాస్ స్టవ్ తక్కువ మంట వస్తుందని చెప్తుంటారు. నిజానికి దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో గ్యాస్ స్టవ్ పరిశోభ్రత లోపించడం ఒకటి. అవును వంట చేసేటప్పుడు చాలా సార్లు పాలు పొంగడమో, పప్పు చారు ఒలికిపోవడమో వంటివి జరుగుతుంటాయి. దీనివల్ల ఇవి గ్యాస్ బర్నర్ లో చిక్కుకుపోతాయి. దీంతో మంట చిన్నగా మండుతుంది. అందుకే గ్యాస్ స్టవ్ ను ఈజీగా, తొందరగా ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బేకింగ్ సోడాతో శుభ్రం
చాలాసార్లు మనం వంట చేసేటప్పుడు ఫుడ్ బర్నర్ మీద కూడా పడుతుంటుంది. దీని వల్ల బర్నర్ రంధ్రంలోకి మురికి పేరుకుపోతుంది. దీంతో మంట తక్కువగా మండుతుంది, అయితే మీరు దీన్ని బేకింగ్ సోడాతో ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు.
బేకింగ్ సోడాతో శుభ్రం చేయడమెలా?
మంట చిన్నగా మండుతుంటే.. మీరు ముందుగా బేకింగ్ సోడాను వేడినీటిలో వేసి దానిలో బర్నర్లను వేసి కాసేపు అలాగే ఉంచండి. ఆ తర్వాత బర్నర్ ప్రతి రంధ్రాన్ని టూత్ పిక్ సహాయంతో శుభ్రం చేయండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టండి.
=
వెనిగర్ తో శుభ్రం
వెనిగర్ తో కూడా మీరు చాలా ఈజీగా గ్యాస్ స్టవ్ ను క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం ముందుగా గ్యాస్ సిలిండర్ ను ఆఫ్ చేయండి. ఆ తర్వాత బర్నర్ ను తీసుకుని వెనిగర్, నీటి ద్రావణంలో 30 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత ఆరబెట్టండి. దీంతో బర్నర్ లోని రంధ్రాలన్నీ శుభ్రమవుతాయి.
నిమ్మకాయ, ఉప్పు
నిమ్మకాయ, ఉప్పుతో కూడా మీరు గ్యాస్ స్టవ్ ను శుభ్రం చేయొచ్చు. ఇది మురికిగా మారిన గ్యాస్ బర్నర్ ను కూడా శుభ్రం చేస్తుంది. దీనికి మీరు పెద్దగా కష్టడాల్సిన అవసరం లేదు. ఇందుకోసం శుభ్రమైన పాత్రలో నీళ్లను వేడి చేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, ఉప్పు వేసి కలపండి. ఆ తర్వాత గ్యాస్ బర్నర్ ను దానిలో వేసి 12 గంటల పాటు అలాగే ఉంచాలి.
టూత్ బ్రష్ తో శుభ్రం
టూత్ బ్రష్ తో కూడా మీరు స్టవ్ ను క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం బర్నర్ ను వేడినీటిలో వేసి టూత్ బ్రష్ తో లిక్విడ్ సబ్బుతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల బర్నర్ కు పట్టిన మురికి అంతా శుభ్రపడుతుంది.