అసురక్షిత శృంగారం.. మహిళలకు యోనిలో కొత్త సమస్య
ప్రస్తుతం మహిళల్లో ఈ సమస్య చాలా సాధారణమైందంటూ నిపుణులు పేర్కొంటున్నారు. జననేంద్రియ ఇన్ఫెక్షన్ల వల్ల యోని ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయని కొత్త పరిశోధనలు సూచిస్తున్నాయి.
మహిళలకు పీరియడ్స్ మొదలుకొని చాలా రకాల సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. తాజాగా.. యోనిలో కూడా ఇన్ఫెక్షన్ సమస్యలు కూడా మొదలయ్యాయి. అసురక్షిత శృంగారం.. కండోమ్ వినియోగించకపోవడం కూడా ఈ సమస్యలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ప్రస్తుతం మహిళల్లో ఈ సమస్య చాలా సాధారణమైందంటూ నిపుణులు పేర్కొంటున్నారు. జననేంద్రియ ఇన్ఫెక్షన్ల వల్ల యోని ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయని కొత్త పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ సమప్య ఉన్నవారికి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది.
ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలను ఈ యోని ఇన్ఫెక్షన్ సమస్య( బ్యాక్టీరియల్ వాగినోసిస్) వేధిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. 50శాతం మహిళల్లో కనీసం ఎలాంటి లక్షణాలు కూడా ఉండటం లేదని.. దీంతో.. వారిలో ఆ సమస్య ఉందో లేదో కూడా గుర్తించడం కష్టమౌతోందని వారు అంటున్నారు.
లాక్టోబాసిల్లస్ అనేది ఓ బాక్టీరియా. ఇది సాధారణంగా యోనిలోని సూక్ష్మజీవిలో భాగం. ఈ బాక్టీరియా ఇతర సూక్ష్మజీవులతో పాటు, యోనిలో లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ మేరకు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మైక్రోబాలజీలో 2018లోనే ప్రచురితమైంది.
సూక్ష్మజీవిలో మార్పులు, ముఖ్యంగా లాక్టోబాసిల్లస్ అధిక లేదా లోపం కారణంగా, యోని లోని పీహెచ్ ఏక కాలంలో మారిపోతుంది. ఇది 'బాక్టీరియల్ వాగినోసిస్'కు దారితీస్తుంది.
బ్యాక్టీరియా వాజినోసిస్ లేని స్త్రీలు అసురక్షిత లైంగిక సంబంధం కలిగి ఉంటే ఈ సమస్య మరింత ఎక్కువగా బాధించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. స్త్రీలు ముఖ్యంగా యోనిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా సురక్షిత శృంగారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే.. కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొన కూడదు. కండోమ్ వినియోగిస్తే.. కొంత వరకు ఈ సమస్య తీవ్రతరం కాకుండా రక్షించుకునే అవకాశం ఉంటుంది.
అంటేకాకుండా.. కాటన్ తో తయారు చేసిన అండర్ వేర్స్ వేసుకోవడం ఉత్తమం.