రాలిపోయిన జుట్టు మళ్లీ పెరగాలంటే.. ఇలా చేయాల్సిందే..!
మార్కెట్లోకి వచ్చే ఏవేవో హెయిర్ సీరమ్స్ కూడా వాడేస్తున్నారు. అయినా పెద్దగా ఫలితం కనపడటం లేదు. అయితే.. ఈ కింది రూల్స్ కనుక మీరు ఫాలో అయితే.. రాలిపోయిన జుట్టు కూడా మళ్లీ పెరుగుతుంది. మరి అవేంటో ఓసారి చూద్దాం..
Here are expert tips for hair growth
జుట్టు రాలడం అనేది ఇప్పుడు అందరికీ కామన్ సమస్యగా మారిపోయింది. ఆడ, మగ అనే తేడా లేదు ప్రతి ఒక్కరూ తమ జుట్టు రాలిపోతోందని, ఏ క్రీములు, షాంపూలు, ఆయిల్స్ మార్చినా ఫలితం ఉండటం లేదని తెగ బాధపడిపోతున్నారు. మార్కెట్లోకి వచ్చే ఏవేవో హెయిర్ సీరమ్స్ కూడా వాడేస్తున్నారు. అయినా పెద్దగా ఫలితం కనపడటం లేదు. అయితే.. ఈ కింది రూల్స్ కనుక మీరు ఫాలో అయితే.. రాలిపోయిన జుట్టు కూడా మళ్లీ పెరుగుతుంది. మరి అవేంటో ఓసారి చూద్దాం..
1.ఆయిల్ మసాజ్..
జుట్టు మంచిగా పెరగాలంటే దానికి ఆయిల్ చాలా అవసరం. అయితే.. మామూలుగా ఆయిల్ రాయడం కాకుండా.. ఆయిల్ తో మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఆయిల్ ఏదైనా పర్వాలేదు. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, బాదం నూనె ఏధైనా సరే.. మంచిగా మసాజ్ చేయడం ముఖ్యం. దీని వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి.. హెయిర్ మంచిగా పెరగడానికి సహాయపడుతుంది.
Avoid Over-Washing
2.షాంపూ..
ఇక చాలా మంది మార్కెట్లో వచ్చే చాలా రకాల షాంపూల ప్రకటనలు చూసి మోసపోతూ ఉంటారు. ఏవేవో షాంపూలు వాడి జుట్టు పాడుచేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా.. సహజంగా, కెమికల్స్ లేకుండా ఉండే షాంపూని వాడటం వల్ల.. రాలిపోయిన జుట్టు మళ్లీ జీవం వచ్చినట్లుగా పెరిగే అవకాశం ఉంటుంది.
3.హెల్దీ డైట్..
మనం పై పైకి ఎన్ని ఆయిల్స్, షాంపూలు, కండిషనర్స్ వాడినా కూడా లోపలి నుంచి కూడా రావాలి. అందుకోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. జింక్, ప్రోటీన్, బయోటిన్ లు పుష్కలంగా ఉండే ఆహారాలను డైట్ లో భాగం చేసుకుంటే.. ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతం అవుతుంది.
4.వ్యాయామం..
చాలా మంది వ్యాయామం చేయడం వల్ల తమ జుట్టు ఊడిపోయింది అని అనుకుంటూ ఉంటారు. కానీ.. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ.. మంచి ఆహారం తీసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. వ్యాయామం అయినా, యోగా అయినా పర్లేదు. ఇవి శరీరానికి మంచిగా రక్త ప్రసరణ జరగడానికి, జుట్టు మళ్లీ పెరగడానికి సహాయపడతాయి.
sleep
5.మంచి నిద్ర..
మనం ఆరోగ్యంగా ఉండటానికి మాత్రమే కాదు.. మన జట్టు ఆరోగ్యంగా ఉండటానికి కూడా మంచి నిద్ర చాలా అవసరం. రోజుకి కనీసం 8గంటలు నిద్రపోయేవారిలో జుట్టు రాలే సమస్య చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా కొత్తగా జుట్టు పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ ట్రిక్స్ ఫాలో అయితే.. మీరు రాలిపోయిన జుట్టు మళ్లీ జీవం పోసుకొని పెరిగిపోతుంది.