ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021: డిఫెండింగ్ ఛాంపియన్‌ కెనిన్‌కి షాక్... రెండో రౌండ్‌లోనే ఇంటిదారి...

First Published Feb 12, 2021, 10:38 AM IST

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021లో సంచలనం నమోదైంది. రెండో రౌండ్‌లోనే అమెరికా ప్లేయర్, డిఫెండింగ్ ఛాంపియన్‌ సోఫియా కెనిన్ ఓటమి పాలైంది. 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత సోఫియా కెనిన్‌ను 35 ఏళ్ల ఈస్టోనియా ప్లేయర్ కియో కానెపి ఓడించడం విశేషం.