తెలుగు సినీ రంగాన్ని కుదిపేసిన డ్రగ్స్ కేసు: వాళ్లు బాధితులే

First Published 14, May 2019, 3:29 PM IST

తెలుగు రాష్ట్రాల్లో  సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో  సిట్ దాఖలు చేసిన చార్జీషీట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 12 కేసుల్లో నాలుగు కేసులకు సంబంధించి ఎక్సైజ్ పోలీసులు నాలుగు చార్జీషీట్లు దాఖలు చేశారు.

డ్రగ్స్‌తో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధాలు ఉన్నాయనే కోణంలో ఎక్సైజ్ పోలీసులు విచారణ నిర్వహించారు. 2017లో అలెక్స్‌ అనే వ్యక్తిని హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై నుండి  హైద్రాబాద్‌కు డ్రగ్స్‌కు తరలిస్తున్న కేసులో ఆయనను అరెస్ట్ చేశారు అలెక్స్‌ను విచారించిన సమయంలో సినీ ప్రముఖులకు కూడ డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా అలెక్స్ సమాచారం ఇచ్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు.

ఈ కేసులో సినీ ప్రముఖులతో పాటు హైద్రాబాద్ నగరానికి చెందిన ఓ కార్పోరేట్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులు కూడ డ్రగ్స్ ఉపయోగిస్తున్నట్టుగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. స్కూల్ విద్యార్థులతో పాటు వ్యాపారస్తులకు చెందిన పిల్లలు కూడ డ్రగ్స్ ఉపయోగిస్తున్నట్టుగా ఎక్సైజ్ సిట్ గుర్తించింది.

ఈ కేసుతో సంబంధం ఉందనే అనుమానంతో  టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన నటులు, కెమెరామెన్లు, దర్శకులను ఎక్సైజ్ అధికారులు విచారించారు.ఈ కేసు విచారణ కోసం  ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేసింది.   కొందరు సినీ ప్రముఖుల నుండి  వెంట్రుకలు, గోళ్లను కూడ సేకరించారు.  అయితే ఈ శాంపిల్స్‌ను ఎఫ్ఎస్‌ఎల్‌కు పంపితే అక్కడి నుండి ఆలస్యంగా రిపోర్టులు వచ్చాయి. ఈ కేసులో  ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదిలే ప్రసక్తే లేదని ఆయన ఎక్సైజ్ ఉన్నతాధికారులు ప్రకటించారు

డ్రగ్స్ కేసులో‌ ఇప్పటికే నాలుగు చార్జీషీట్లు నమోదయ్యాయి. ఇంకా 8 కేసులకు సంబంధించి చార్జీషీట్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికీ ఎక్సైజ్ సిట్ దాఖలు చేసిన నాలుగు చార్జీషీట్లు దాఖలు చేశారు. ఈ చార్జీషీట్లలో ఇప్పటికీ కూడ సినీ ప్రముఖుల పేర్లు మాత్రం లేవు. ఉద్దేశ్యపూర్వకంగానే చార్జీషీట్లలో సినీ ప్రముఖుల పేర్లను తొలగించారా అని కొన్ని స్వచ్చంధ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.

డ్రగ్స్ కేసుకు సంబంధించి దాఖలు చేసిన చార్జీషీటు‌పై  సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ సంస్థకు చెందిన పద్మనాభయ్య  అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ కేసును ఏసీబీ ద్వారా విచారించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సిట్ దాఖలు చేసిన చార్జీషీటులో  సినీ ప్రముఖుల పేర్లు ఎందుకు చేర్చలేదని ఆయన ప్రశ్నించారు.

loader