గొర్రెకుంట బావిలో 9 డెడ్‌బాడీలు: సంజయ్ సెల్ఫోన్లో ఆశ్లీల వీడియోలు
తెలంగాణలోని వరంగల్ గొర్రెకుంట బావిలో తొమ్మిది మందిని చంపిన కేసులో నిందితుడు సంజయ్ సెల్ ఫోన్ ఇంటర్నెట్ ను ఉపయోగించడంలో సిద్దహస్తుడు. అతని ఫోన్ లో ఫోర్న్ వీడియోలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.
సంచలనం సృష్టించిన గొర్రెకుంట బావిలో తొమ్మిది మందిని హత్య చేసిన సంజయ్ కుమార్ యాదవ్ నేర పూరిత స్వభావం కలవాడుగా పోలీసులు గుర్తించారు. సంజయ్ ఫోన్ నిండా అశ్లీల వీడియోలు, మహిళలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు ఉన్నట్టుగా సమాచారం. తక్కువ చదువుకున్నా ఇంటర్నెట్ ను ఉపయోగించడంలో సంజయ్ మాత్రం దిట్ట.
ఈ నెల 21వ తేదీన గొర్రెకుంట బావిలో నాలుగు మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. ఈ నెల 22వ తేదీన మరో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి.ఈ ఐదు హత్యల వెనుక మాస్టర్ మైండ్ సంజయ్ కుమార్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే.
సంజయ్ సెల్ ఫోన్ సెర్చ్ హిస్టరీ అంతా నేర పూరిత అంశాల గురించి వెతికినట్టుగా ఉందని పోలీసులు తేల్చారు. అశ్లీల చిత్రాలు, వీడియోలతోనే నిండి ఉండడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. మహిళలతో బెడ్ రూమ్‌లో ఉన్న ఫోటోలు, నెట్లో డౌన్లోడ్ చేసిన అశ్లీల వీడియోలు వందల కొద్దీ ఉన్నట్లు గుర్తించారు.
బీహార్ రాష్ట్రానికి చెందిన సంజయ్ కేవలం మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. కానీ, సెల్ ఫోన్ లో ఇంటర్నెట్ ను ఉపయోగించుకోవడంలో మాత్రం అతనికి అతనే సాటి. మనుషుల ప్రాణం తీయడమంటే అతనికి పెద్ద విషయం కాదు.
టీ తాగినంత సులభంగా మనుషుల ప్రాణాలు తీస్తాడు. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ టూల్ లోని ఓకే గూగుల్ ఆఫ్షన్ ద్వారా నేరాలు చేసి ఎలా తప్పించుకోవచ్చనే విషయమై సంజయ్ ఇంటర్నెట్ లో సెర్చ్ చేశాడని తెలుస్తోంది,
గతంలో ఢిల్లీలో సెల్‌ఫోన్ దుకాణంలో సంజయ్ కొంత కాలం పనిచేశాడు. దీంతో ఆయనకు ఇంటర్నెట్ ఉపయోగించడంపై కొంత పట్టు లభించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. నేరాలు చేసి ఎలా తప్పించుకోవచ్చనే విషయమై అతను ఇంటర్నెట్ లో సెర్చ్ చేశాడు.
స్లీపింగ్ పిల్స్ కొనుగోలు కోసం కూడ నిందితుడు గూగుల్ ను ఉపయోగించాడు. ఏ రకమైన టాబ్లెట్లను ఎక్కువ మంది ఉపయోగిస్తారు. ఏ టాబ్లెట్ తో ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయనే విషయాలను సెర్చ్ చేసిన తర్వాత వాటిని కొనుగోలు చేశాడని పోలీసులు గుర్తించారు.సాధారణ ధర కంటే ఎక్కువ ధరను చెల్లించి నిందితుడు నిద్ర మాత్రలను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది.
గొర్రెకుంట ప్రాంతంతోపాటు వరంగల్ వెంకట్రామ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలో సంజయ్ దృశ్యాలు రికార్డయ్యాయి ఈ సీసీ పుటేజీ దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. దీంతో సంజయ్‌ను అరెస్ట్ చేసి విచారణ జరిపితే అసలు విషయం వెలుగు చూసింది.