పిల్లలు, అమ్మాయిల కోసం ట్రూకాలర్ అద్భుతమైన కొత్త యాప్.. ఎలా ఉప్యోగపడుతుందంటే ?

First Published Mar 5, 2021, 2:33 PM IST

కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ గార్డియన్ అనే కొత్త యాప్ లాంచ్ చేసింది. ఇది ట్రూకాలర్  నుండి వస్తున్న రెండవ యాప్. గార్డియన్ యాప్  అనేది వ్యక్తిగత భద్రతా యాప్, ఈ యాప్ లో వినియోగదారులు వారి కుటుంబం, స్నేహితులు, అధికారులను యాడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మీరు మీ కుటుంబం, స్నేహితులు, అధికారులను సంప్రదించడానికి మీకు సహాయపడే వివిధ ఫీచర్స్ వస్తుంది.