MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • కోడి రెట్టతో కరెంటు తయారి.. విద్యుత్ శాఖపై విసిగి పోయి ఇప్పుడు అందరికీ ఆదర్శంగా..

కోడి రెట్టతో కరెంటు తయారి.. విద్యుత్ శాఖపై విసిగి పోయి ఇప్పుడు అందరికీ ఆదర్శంగా..

కోళ్ల ఫారం ద్వారా  కోళ్లు, గుడ్ల అమ్మకాలతో  మాత్రమే కాదు, మీరు కొత్త ఆవిష్కరణ చేసినప్పుడు మీ సంపాదన కూడా మరింత పెరుగుతుంది. ఎలా అనుకుంటున్నారా..  విద్యుత్ శాఖపై విసిగి పోయిన ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Sep 01 2023, 04:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ సరైన విద్యుత్ కనెక్షన్ లేదు. మారుమూల గ్రామాలు కావడం లేక ఇతర కారణాలతో విద్యుత్ శాఖ విద్యుత్ సౌకర్యం కల్పించడం కూడా కష్టంగా ఉంటుంది. అందుకే కొన్ని ప్రదేశాలలో ఇప్పటికి అంధకారంలో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో హర్యానాకు చెందిన జజ్జర్ కుటుంబం ఒకటి, హర్యానాకు చెందిన జజ్జర్ కుటుంబం ఉండే ప్రదేశంలో  విద్యుత్ కనెక్షన్ పొందలేదు. దీంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు ఓ కీలక నిర్ణయానికి వచ్చారు.

 సొంతంగా కరెంటు తయారు చేసుకోవాలని ఆలోచన వేసి అందులో విజయం సాధించారు. వీరు  విద్యుత్తును ఉత్పత్తి చేసి వినియోగించడమే కాకుండా విద్యుత్తును విక్రయిస్తున్నారు కూడా . కోడి రెట్టతో కరెంటును జజ్జర్ కుటుంబం తయారు చేస్తుందంటే నమ్మాల్సిందే. అంతేకాదు కోడి రెట్టల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు తేమను పారద్రోలడం, దుర్వాసన నుంచి ఉపశమనం వంటివి సాధించారు. 

ఇళ్లు, ఇంటి పనులన్నీ ఈ కరెంటు నుంచే సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ కుటుంబం కోడి రెట్టల నుంచి దాదాపు 50 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. పౌల్ట్రీ ఫారంలోనే విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన పరికరాలు అమర్చి 24 గంటల పాటు ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఝజ్జర్‌లోని సిలానీ కేషో గ్రామానికి చెందిన రామెహర్ విద్యుత్ కనెక్షన్ కోసం చాలాసార్లు విద్యుత్ కార్పొరేషన్‌ను సందర్శించాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పని  జరగలేదు. దీంతో కోపోద్రిక్తుడైన రామెహర్ తన ఇంటికి విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. వ్యవసాయ శాఖ సాయం పొందిన రైతు రామెహర్ తన ఇంట్లో 20 వేల కోళ్లను పెట్టుకున్నాడు. రామెహర్ మొదట్లో కోడి రెట్టలతో గ్యాస్ తయారు చేసేవాడు. దీన్ని తన ఇంటి అవసరాలకు వాడుకునేవాడు. తరువాత అతను విద్యుత్ ఉత్పత్తి  చేయడం ప్రారంభించాడు. 
 

34

ఇప్పుడు రాంహెర్ ఇల్లు పర్యాటక కేంద్రంలా  మారింది. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తుంటారు. రామెహర్ గతంలో భారత సైన్యంలో పనిచేశాడు. సుబేదార్ పదవి నుంచి రిటైర్మెంట్ పొందిన తర్వాత రామెహర్ పౌల్ట్రీ ఫారాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత కోడి రెట్టల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేశాడు. గతంలో  85 క్యూబిక్ మీటర్ల రెండు ట్యాంకులు తయారు చేసి దాని నుంచి గ్యాస్ తయారు చేశారు. తరువాత అతను 50% గ్యాస్ ఇంకా  50% డీజిల్‌తో నడిచే  జనరేటర్‌ను  ప్రారంభించాడు, దీనికోసం 30 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాడు.
 

44

రామెహర్  2011లో 160 క్యూబిక్ మీటర్ల డైజెస్టర్ ట్యాంక్‌ను నిర్మించారు. ఇద్ర సాయంతో 50 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది. ఇప్పుడు 240 క్యూబిక్ మీటర్ల ట్యాంక్ తయారు చేయబడింది. రామ్‌హెర్‌కు ఇప్పుడు విద్యుత్ శాఖ నుండి విద్యుత్ అవసరం లేదు. ఇంట్లో సిద్ధంగా ఉన్న విద్యుత్‌ను వినియోగిస్తున్నారు.

24 గంటలూ విద్యుత్తు తయారీ పనులు జరుగుతున్నాయి. రాంహెర్ తన ఇంటికి కరెంటు వాడడమే కాకుండా ఇతరులకు అమ్మేవాడు. తండ్రి స్ఫూర్తితో రామాహెన్‌ పిల్లలు మరో గ్రామంలో విద్యుత్‌ ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. కోడి పేడతో సీఎన్‌జీని తయారు చేసేందుకు ప్రయత్నాలు చేశామని, అయితే ఇప్పటి వరకు ఆ ప్రయత్నం ఫలించలేదని రామెహర్ చెబుతున్నారు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
iPhone 17: ఐఫోన్ కొనాల‌నే మీ క‌ల నెర‌వేరిన‌ట్లే.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో క‌ళ్లు చెదిరే డిస్కౌంట్
Recommended image2
Crane: క్రేన్లు టన్నుల బరువును ఎలా బ్యాలెన్స్ చేస్తాయి? అయినా ఎందుకు కిందపడదు?
Recommended image3
Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ హంగామా.. వన్‌ప్లస్, రెడ్‌మీ ఫోన్లపై ఊహించని ఆఫర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved