ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు ఛార్జింగ్ రావాలంటే ఏం చేయాలి?
స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచాలంటే ఏం చేయాలో తెలుసా? ఛార్జింగ్ చేసే సమయంలో ఎలాంటి తప్పులు చేయడం వల్ల మనం నష్టపోతామో తెలుసా? ఈ విషయాలు తెలుసుకుందాం...
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా బతకడం చాలా కష్టం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ స్మార్ట్ ఫోన్ వాడేవారే. ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా ఫోన్ చేతిలో ఉండాల్సిందే. అయితే... ఫోన్ వాడే సమయంలో చాలా మంది కామన్ గా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్ల కారణంగా ఆ ప్రభావం బ్యాటరీ మీద చూపిస్తుంది. ఒక్కోసారి ఏకంగా ఫోన్ మొతంతం పాడయ్యే అవకాశం కూాడా లేకపోలేదు.
మొబైల్ చిట్కాలు
చాలా మంది తమ మొబైల్ ఫోన్‌లను బ్యాటరీ కాస్త తగ్గినప్పుడు చార్జ్ చేసే అలవాటు ఉంటుంది లేదా కొంత సమయం తర్వాత మళ్ళీ చార్జ్ చేయడానికి చార్జర్ నుండి తీసేస్తారు. ఇలాంటి అలవాట్లు కాలక్రమేణా మీ మొబైల్ బ్యాటరీ లైఫ్‌ను తగ్గిస్తాయి. టెక్నికల్ నిపుణుల ప్రకారం, అవసరమైతే మీ ఫోన్‌ను రోజుకు రెండుసార్లు చార్జ్ చేయడం మంచిది.
మొబైల్ చార్జింగ్
రోజుకు చాలాసార్లు ఓవర్ చార్జింగ్ చేయడం,అసలు ఛార్జింగ్ పెట్టకపోవడం లాంటి పనులు మానేయాలి. బ్యాటరీ లెవెల్ 20% దగ్గర ఉన్నప్పుడు మీ మొబైల్‌ను చార్జ్ చేయడం మంచిది. ఈ లెవెల్ కంటే తక్కువగా చార్జ్ చేయడం లేదా బ్యాటరీని పూర్తిగా ఖాళీ అవ్వనివ్వడం ఫోన్ లైఫ్ ని తగ్గించేస్తుంది.
స్మార్ట్‌ఫోన్
అదేవిధంగా, బ్యాటరీ 80% అయినప్పుడు ఫోన్‌ను చార్జర్ నుండి తీసివేయడం చాలా ముఖ్యం. ఈ లిమిట్‌లోపల చార్జ్ లెవెల్‌ను ఉంచుకోవడం వల్ల బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. మీ బ్యాటరీ లైఫ్‌ను కాపాడుకోవడానికి మరో మంచి మార్గం 45-75 రూల్. బ్యాటరీ 45% కంటే తక్కువైనప్పుడు మీ మొబైల్‌ను చార్జ్ చేయడం ప్రారంభించి, 75% అయినప్పుడు డిస్‌కనెక్ట్ చేయండి.
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ టిప్స్
ఈ కంట్రోల్డ్ చార్జింగ్ రేంజ్ బ్యాటరీ మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే, మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని ఎక్కువ కాలం సురక్షితంగా ఉంచుకోవచ్చు.