చీఫ్ కోచ్ గా రవిశాస్త్రి మార్పు నిర్ణయం...టీమిండియాకు లాభమా? నష్టమా?

First Published 25, Jul 2019, 4:43 PM

టీమిండియా నూతన చీఫ్ కోచ్ ను నియమించే పనిలో బిసిసిఐ బిజీగా వుంది. ఇలాంటి సమయంలో ప్రస్తుత కోచ్ ను కొనసాగిస్తే జట్టుకు మంచిదని కొందరు...లేదు లేదు  తొలగిస్తేనే మంచిదని మరికొందరు వాదిస్తున్నారు. ఇలా వారు ఎందుకు వాదిస్తున్నారో తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవాల్సిందే.    

ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. అయితే అంచనాలకు తగ్గట్లు అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టిన మెన్ ఇన్ బ్లూ టీం దురదృష్టం వెంటాడటంతో సెమీస్ నుండే వెనుదిరగాల్సి వచ్చింది. అయితే కారణాలేమైనప్పటికి టీమిండియా వరల్డ్ కప్ ట్రోఫీని అందుకోలేకపోయింది. దీంతో 2023 వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగా ఇప్పటినుండే ప్రణాళికాబద్దంగా జట్టును సిద్దం చేయాలని బిసిసిఐ భావిస్తోంది. అందులో భాగంగా చేపట్టిన మొదటి ప్రయత్నమే టీమిండియా నూతన కోచ్ వేట.

ప్రస్తుత టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రిని పదవీకాలం కూడా ముగిసింది కాబట్టి నూతన కోచ్ ను నియమించేందుకు బిసిసిఐ ప్రయత్నిస్తోంది. మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, లంక మాజీ  కెప్టెన్ మహేల జయవర్ధనే తో పాటు మరికొంతమంది పేర్లు చీఫ్ కోచ్ రేసులో వున్నాయి. అలాగే రవిశాస్త్రి కూడా మరోసారి ఈ పదవిని చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిసిసిఐ టీమిండియా చీఫ్ కోచ్ గా పనిచేయాలన్న ఆసక్తి, అర్హత వున్న అభ్యర్థుల నుండి దరఖాస్తులను కూడా ఆహ్వానించింది.

అయితే వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ వరకు  రవిశాస్త్రిని చీఫ్ కోచ్ గా కొనసాగించాలని ఓ కొత్త వాదన తెరపైకి వచ్చింది. ప్రస్తుతం అతడు జట్టుతో సభ్యలతో ముఖ్యంగా కెప్టెన్ కోహ్లీతో మంచి సత్సంబంధాలను కలిగివున్నాడు. అందువల్లే ఆటగాళ్లకు, కోచింగ్ సిబ్బంది మధ్య ఎలాంటి  చిన్న విభేదాలు కూడా లేకుండా టీమిండియా జర్నీ సాఫీగా సాగుతోంది. ఈ సమయంలో టీమిండియా కోచింగ్ సిబ్బందిని మార్చితే జట్టుపై తీవ్ర ప్రభావంపడనుందని కొందరు క్రికెట్ విశ్లేషకులతో పాటు అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.

అయితే రవిశాస్త్రిని చీఫ్ కోచ్ పదవినుండి తొలగాస్తేనే మంచిదన్న మరో వాదన కూడా ప్రచారంలో వుంది. 2019 ప్రపంచ కప్ లో కోహ్లీ టీమిండియా సారథిగా పనిచేశాడు కాబట్టి రవిశాస్త్రి చీఫ్ కోచ్ గా వుండటం మంచిదే. కానీ 2023  ప్రపంచ కప్ నాటికి రోహిత్ శర్మ ను సారథిగా తయారుచేయాలన్నది బిసిసిఐ భావిస్తున్నట్లు ఇటీవల ఓ ప్రచారం జరిగింది. ఇదే నిజంగా బిసిసిఐ ఆలోచన అయితే వెంటనే రవిశాస్త్రితో పాటు  ఇప్పుడున్న మిగతా  కోచింగ్ సిబ్బందిని మార్చడం మంచింది. ఇప్పుడున్న వారంతా కోహ్లీతో మంచి సమన్వయాన్ని కలిగివున్నట్లే కొత్తగా నియమించబడే కోచింగ్ సిబ్బంది రోహిత్ తో మంచి  సమన్వయాన్ని ఏర్పర్చుకునేలా చేయడం కూడా టీమిండియా మేనేజ్ మెంట్ పనే.

ఇలా టీమిండియా కోచ్ ఎంపిక విషయంలో రెండు బిన్నమైన వాదనలు బాగా ప్రచారంలో వున్నాయి. అయితే ఒకటి 2020 టీ20 ప్రపంచ కప్ లక్ష్యంగా రవిశాస్త్రిని  కొనసాగించమంటుంటే...మరొకటి 2023 వన్డే ప్రపంచ కప్ కోసం రవిశాస్త్రిని తొలగించాలని అంటోంది. మరి బిసిసిఐ ఏ వాదనకు ఓటేస్తుందో తెలసుకోవాలంటే మరికొంత కాలం ఎదురుచూడాల్సిందే.

loader