క్రికెటర్లను మించిపోయిన నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ..! మను భాకర్ రికార్డుల మోత !
Neeraj Chopra-Manu Bhaker Brand Value: పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత్ మొత్తం 6 మెడల్స్ సాధించింది. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన నీరజ్ చోప్రా, మను భాకర్‌ల బ్రాండ్ విలువ విపరీతంగా పెరిగింది.
Neeraj Chopra-Manu Bhaker Brand Value
Neeraj Chopra-Manu Bhaker Brand Value : ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, షూటర్ మను బాకర్ బ్రాండ్ విలువ భారీగా పెరిగింది. నీరజ్ బ్రాండ్ విలువ చాలా మంది క్రికెటర్ల బ్రాండ్ విలువను దాటేసింది.
Neeraj Chopra-Manu Bhaker Brand Value
నీరజ్ చోప్రా ప్రస్తుత బ్రాండ్ విలువ 330 కోట్లకు చేరింది. ఇది క్రికెటర్ హార్దిక్ పాండ్యా బ్రాండ్ విలువకు సమానం. రానున్న రోజుల్లో ఇది మరింత పెరగనుందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అంతకుముందు ఒక యాడ్‌కు 3 కోట్లు తీసుకుంటుండగా, ఇప్పుడు నీరజ్ చోప్రా రూ.4-4.50 కోట్లు అందుకుంటున్నారు.
Neeraj Chopra-Manu Bhaker Brand Value
మరోవైపు ఒలింపిక్స్ మహిళల షూటింగ్ విభాగంలో రెండు కాంస్య పతకాలు సాధించి రికార్డు సృష్టించిన మను భాకర్ బ్రాండ్ వాల్యూ కూడా భారీగా పెరిగింది. ఒలింపిక్స్‌కు ముందు ఒక్కో ప్రకటనకు 25 లక్షలు అందుకున్న మను భాకర్.. ఒలింపిక్స్ మెడల్ సాధించిన తర్వాత తన ఫీజును రూ.1 నుంచి రూ.1.5 కోట్లకు పెంచాడు. అయినప్పటికీ ప్రకటనల కోసం ఇప్పటికే 40కి పైగా కంపెనీలు మను ను సంప్రదించినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
Neeraj Chopra-Manu Bhaker Brand Value
అలాగే, పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించనప్పటికీ.. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ బ్రాండ్ విలువ భారీగా పెరిగింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ వినేష్ పారిస్ ఒలింపిక్స్‌కు ముందు ఒక్కో ప్రకటనకు ₹25 లక్షలు అందుకునే వారు. అయితే ఇప్పుడు ఒక్కో ప్రకటనకు ₹75 లక్షల నుంచి ₹1 కోటి వరకు అందుకుంటున్నట్టు సమాచారం.
Vinesh Phogat Brand Value
కాగా, పారిస్ ఒలింపిక్స్ లో భారత్ మొత్తం ఆరు మెడల్స్ గెలుచుకుంది. ఇందులో రెండు షూటింగ్ లో మను భాకర్, మను-సరబ్జోత్ సింగ్ ల జోడీ బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలిచాడు. హాకీ జట్టు బ్రాంజ్ మెడల్ సాధించింది. అమన్ సెహ్రావత్ రెజ్లింగ్ లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. అలాగే, షూటింగ్ లో స్వప్నిల్ కుసలే కూడా బ్రాంజ్ మెడల్ సాధించాడు.