నేను ఈ ఫుడ్ తినలేను, అవన్నీ తెప్పించండి... జైలులో రెజ్లర్ సుశీల్ కుమార్ కోరికల చిట్టా...
యువ రెజ్లర్ హత్యకేసులో అరెస్టు అయిన ఒలింపిక్ విన్నర్ రెజ్లర్ సుశీల్ కుమార్ జైలులో పెట్టే చిప్ప కూడు తినలేకపోతున్నాడు. జైలులో తనకి ఏ ఫుడ్ కావాలి, ఏయే సదుపాయాలు కోరుతూ రెజ్లర్ పెట్టుకున్న డిమాండ్ల పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు కొట్టిపారేసింది...
జైలులో పెట్టే ఫుడ్ తనకి సరిపోదని చెప్పిన సుశీల్ కుమార్... తనకి ఒమెగా 3 క్యాప్సిల్స్, ప్రీ వర్కవుట్ సప్లిమెంట్స్, మల్టీ విటమిన్ పిల్స్ కావాలని కోరాడు. రెజ్లింగ్ పోటీలకు ప్రిపేర్ అవుతున్న తనకి ఎక్సర్సైజ్లు చేసుకునేందుకు వ్యాయామ పరికరాలు కూడా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు...
అయితే ఢిల్లీ హై కోర్టు, సుశీల్ కుమార్ డిమాండ్‌ను ‘గొంతెమ్మ కోరికలు’గా పేర్కొంది... ‘ప్రస్తుతం జైలులో పెడుతున్న ఆహారం పరిమాణం గురించి కానీ, వాటిలో పోషకాలు లేవని కానీ దరఖాస్తుదారుడు (రెజ్లర్ సుశీల్ కుమార్) ఎక్కడా పేరొన్నలేదు.
జైలులో పెట్టే ఫుడ్‌లో మనిషికి అవసరమైన పోషక నిల్వలన్నీ ఉంటాయి. అలాంటప్పుడు అతనికి అదనంగా సదుపాయాలు అందచేయాల్సిన అవసరం లేదు’ అంటూ కొట్టిపారేసింది...
ఎలాంటి అనారోగ్యంతో బాధపడని రెజ్లర్, ఓ సాధారణ ఖైధీగానే పరిగణించబడతానని, అతన్ని ప్రత్యేకంగా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. కోరినవన్నీ తెచ్చి ఇవ్వడానికి ఇది ఫైవ్ స్టార్ హోటెల్ కాదని స్పష్టం చేసింది...
యువరెజ్లర్ సాగర్ ధన్కర్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న సుశీల్ కుమార్, పోలీసులకు చిక్కకుండా పారిపోయి 19 రోజులు తప్పించుకుతిరిగాడు. అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్‌తో పాటు సమాచారం అందించినవారికి రూ.1లక్ష బహుమతి అందిస్తామని ప్రకటన ఇచ్చిన ఢిల్లీ పోలీసులు, అతన్ని మే 23న అరెస్టు చేశారు.
సాగర్ ధన్కర్ హత్యలో తన ప్రమేయం ఉందని పోలీసుల ముందు అంగీకరించిన సుశీల్ కుమార్, అది అనుకోకుండా జరిగిపోయిన పరిణామం అంటూ వ్యాఖ్యానించాడు...
అయితే యువ రెజ్లర్ సాగర్ ధన్కర్పై సుశీల్ కుమార్, తన బృందతో కలిసి విచక్షణారహితంగా దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అతన్ని కలిసేందుకు కూడా ఎవ్వర్నీ అనుమతించడం లేదు పోలీసులు.