ఆయన మా నాన్న కాదు, 9 ఏళ్ల వయసులోనే... రెజ్లర్ వినేష్ ఫోగట్ ఎమోషనల్ పోస్ట్...
టోక్యో ఒలింపిక్స్‌లో భారీ అంచనాలతో అడుగుపెట్టింది వినేష్ ఫోగట్. అయితే బెలారస్ రెజ్ల్ కలాదీన్సాకియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో వినేష్ పోరాడి ఓడింది. ఈ పరాజయం తర్వాత వినేష్ ఫోగట్‌పై అనేక రకాల కథనాలు వచ్చాయి...
రియో ఒలింపిక్స్‌లో 50 కిలోల విభాగంలో బరిలో దిగిన వినేష్, పోటీ మధ్యలోనే గాయపడింది. ఒలింపిక్స్‌కి ఏడాది ముందు 2019లో బరువు పెరిగి, 53 కిలోల కేటగిరిలోకి మారింది. ఫోగట్ ఫ్యామిలీ నుంచి ఈ రెజ్లర్, ఒలింపిక్స్ ఓటమి తర్వాత వస్తున్న కథనాలపై ఓ ఎమోషనల్ పోస్టు చేసింది...
‘డియర్ మీడియా... అథ్లెట్ల గురించి కానీ లేదా మరేవరైనా వ్యక్తి గురించి కానీ కథనం రాయాలనుకుంటే, వారి గురించి పూర్తిగా తెలుసుకుని రాయండి. పూర్తిగా సరైన సమాచారం తెలిస్తేనే, ఆ కథనాన్ని ప్రజలకు చేర్చండి...
నాకు 9 ఏళ్లు ఉన్నప్పుడే మా నాన్న చనిపోయారు. ఆయన పేరు రాజ్‌పాల్ ఫోగట్. ఆయన ఏ విధమైన భూతగాదాల కారణంగా చనిపోలేదు...
అప్పటినుంచి నన్ను, మా అన్నయ్యనీ, చెల్లెలినీ మా అమ్మే పెంచింది. మహావీర్ ఫోగట్, మా నాన్న వాళ్ల అన్నయ్య, అంటే నాకు పెదనాన్న. చాలా చోట్ల ఆయన్ని మా నాన్నగా పేర్కొన్నారు...
వ్యక్తిగత సమాచారం రాసేటప్పుడు అలా తెలిసీ తెలియకుండా రాయకండి. రాసేటప్పుడు నిజాలు తెలుసుకోండి... మా నాన్న జ్ఞాపకాలకు నేను ఎంతో విలువనిస్తా, గౌరవిస్తా...
ఇలాంటి సగం సగం సమాచారాలు మమ్మల్ని తీవ్రంగా బాధిస్తాయి... మమ్మల్ని ఎమోషనల్‌గా బాధపెట్టకండి...’ అంటూ సుదీర్ఘ పోస్టు చేసింది వినేష్ ఫోగట్...
బాలీవుడ్లో సూపర్‌హిట్ అయిన ‘దంగల్’ సినిమాలో అమీర్‌ఖాన్ పోషించిన పాత్ర పేరు మహావీర్ ఫోగట్. వినేష్ ఫోగట్‌లో ఫోగట్ ఉండడంతో చాలామంది మహావీర్ కూతురే వినేష్ అంటూ అనుకుంటూ ఉంటారు...