కేంద్రానికి మద్ధతుగా ట్వీట్లు... బీజేపీలోకి పరుగుల రాణి పీటీ ఉష...
దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెంచిన భారతీయ జనతా పార్టీ, కేరళ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎర్రజెండా రాజ్యంలో కాషాయ జెండా ఎగురవేసేందుకు కావాల్సినంత అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది బీజేపీ. ఇందులో భాగంగా కేరళలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న సెలబ్రిటీల ఫోకస్ పెట్టింది బీజేపీ. పరుగుల రాణి పీటీ ఉష కూడా బీజేపీ ద్వారా రాజకీయ ఆరంగ్రేటం చేయబోతున్నట్టు టాక్ నడుస్తోంది...
కొన్నాళ్ల క్రితం నూతన వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఢిల్లీలో నిరసనలు చేపడుతున్న రైతుల గురించి రిహానా వేసిన పోస్టుపై స్పందించిన మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కి రాజకీయ రంగు పూశారు నెటిజన్లు.
సచిన్ టెండూల్కర్, బీజేపీ ప్రభుత్వం తరుపున బ్యాటింగ్ చేస్తున్నారని, అందుకే రైతులు ఆయనకు ప్రత్యర్థులుగా కనిపిస్తున్నారని కామెంట్లు చేశారు. రైతుల గురించి కానీ, ప్రభుత్వం గురించి కానీ ట్వీట్ చేయకపోయినా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొన్నాడు సచిన్...
సచిన్ టెండూల్కర్‌పై తీవ్రమైన వ్యతిరేకత చూపించినవారిలో మలయాళీలు ఎక్కువగా ఉన్నాయి. కేరళలో కొందరు యువకులు, సచిన్ టెండూల్కర్ ఫోటోలు, ఫ్లెక్సీలపై నల్ల ఇంకు పోసి అవమానించారు...
కొన్నేళ్ల క్రితం సచిన్ టెండూల్కర్ ఎవరో తెలియదని వ్యాఖ్యానించిన టెన్నిస్ ప్లేయర్ మారియా షరపోవాకు క్షమాపణలు చెబుతూ కామెంట్ల వర్షం కురిపించినవాళ్లు కూడా మలయాళీలే..
అయితే కేరళలోని కుట్టలీ ఏరియాలో జన్మించిన పరుగుల రాణి పీటీ ఉష మాత్రం కేంద్ర ప్రభుత్వానికి మద్ధతుగా ట్వీట్లు చేసింది. రిహానా వేసిన ట్వీట్లపై అభ్యంతరం తెలిపిన ఆమె, అంతర్గత వ్యవహారాల్లో బయటికి జోక్యాన్ని సహించబోమంటూ సచిన్ ట్వీట్‌కి వంతు పాడింది...
అయితే కేరళలోని కుట్టలీ ఏరియాలో జన్మించిన పరుగుల రాణి పీటీ ఉష మాత్రం కేంద్ర ప్రభుత్వానికి మద్ధతుగా ట్వీట్లు చేసింది. రిహానా వేసిన ట్వీట్లపై అభ్యంతరం తెలిపిన ఆమె, అంతర్గత వ్యవహారాల్లో బయటికి జోక్యాన్ని సహించబోమంటూ సచిన్ ట్వీట్‌కి వంతు పాడింది...
కొన్నేళ్ల క్రితం శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి అనుమతిచ్చిన కేంద్రం, మహిళా సంఘాల ఆదరణను దక్కించుకుంది. ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలను దింపి, శాసనసభ ఎన్నికల్లో ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని చూస్తోంది...
1985లో పద్మశ్రీ అవార్డుతో పాటు మూడు యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన పీటీ ఉష, భారత జట్టుకి ఏషియన్ ఛాంపియన్షిప్స్, ఆసియా క్రీడల్లో ఎన్నో విజయాలను అందించింది..
‘భారత ట్రాక్ ఫీల్డ్ రాణి’గా గుర్తింపు తెచ్చుకున్న పీటీ ఉష వయసు ప్రస్తుతం 56 ఏళ్లు... 1998లో ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన ఉష, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సుకి చెందిన ఇన్స్పెక్టర్ శ్రీనివాసన్‌ను వివాహం చేసుకుంది...