ఫిఫా వరల్డ్ కప్ 2022: ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ని తాకిన 5 బిగ్గెస్ట్ సెక్స్ స్కాండల్స్...
ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీ ఘనంగా జరుగుతోంది. మొట్టమొదటిసారి ఓ అరబ్ కంట్రీ (ఖతర్), ఫిఫా వరల్డ్ కప్ టోర్నీకి వేదిక నిస్తోంది. ఎన్నో విమర్శలు, మరెన్నో వివాదాల మధ్య ఆరంభమైన ఫిఫా వరల్డ్ కప్, సజావుగానే సాగుతోంది. అయితే ఫిఫాని వివాదాలు తాకడం కొత్తేమీ కాదు. ఫుట్‌బాల్‌కి, వివాదాలకు విడదీయరాని అనుబంధం ఉంది... ముఖ్యంగా సెక్స్ స్కాండల్స్‌తో ఫిఫా వరల్డ్ కప్స్, ఫుట్‌బాల్ ప్రపంచాన్ని షేక్ చేశాయి...
Image Credit: Getty Images
2010 ఫిఫా వరల్డ్ కప్‌కి సౌతాఫ్రికా ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నీలో పాల్గొన్న చెక్ రిపబ్లిక్ టీమ్ సెక్స్ కుంభకోణంలో ఇరుక్కుంది. చెక్ రిప్లబిక్ టీమ్‌లోకి ఆరుగురు ప్లేయర్లతో పాటు కోచ్ పీటర్ రడా, సెక్స్ వర్కట్లతో సెక్స్‌లో పాల్గొంటున్న ఫోటోలు బయటికి వచ్చాయి. ఈ వివాదం తర్వాత ఈ ప్లేయర్లను జట్టు నుంచి తొలగించడం, చెక్ రిప్లబిక్ టీమ్, స్లోవకియాతో మ్యాచ్‌లో 2-1 తేడాతో ఓడిపోవడం జరిగిపోయాయి...
Christopher Nkunku, Karim Benzema and Kylian Mbappe
2010 సౌతాఫ్రికా ఫిఫా వరల్డ్ కప్‌లోనే ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కరీమ్ బెంజెమాతో పాటు ఫ్రాక్ రిబ్బెరీ, సిడ్నీ గోలు సెక్స్ వివాదంలో ఇరుక్కున్నారు. ఈ ముగ్గురూ సెక్స్ వర్కర్లు ఉండే క్లబ్‌కి వెళ్లడంతో పాటు అక్కడ వేశ్యలతో సెక్స్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో వీరిపై వేటు వేసింది ఫ్రాన్స్ ఫుట్‌బాల్ టీమ్...
Qatar Football Team
1988 వరల్డ్ కప్‌లో అమెరికా ఫుట్‌బాల్ టీమ్‌ని సెక్స్ కుంభకోణం కుదిపేసింది. అమెరికా ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ జాన్ హరీక్స్ని కోచ్ స్టీవెన్ సామ్సన్, వరల్డ్ కప్‌కి కొన్ని రోజుల ముందే జట్టు నుంచి తొలగించాడు. దీనికి కారణం యూఎస్ టీమ్ సభ్యుడు ఎరిక్ వినాడ భార్యతో జాన్ హారీక్స్కి వివాహేతర సంబంధం ఉందని తేలింది. అయితే హారీక్స్, ఈ ఆరోపణలను తోసిపుచ్చినా వరల్డ్ కప్ ఆడలేకపోయాడు..
Image Credit: Getty Images
రష్యాలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2018 టోర్నీని కూడా సెక్స్ స్కాండల్ కుదిపేసింది. వరల్డ్ కప్‌కి కొన్ని రోజుల ముందు నిర్వహించిన ఫేర్వెల్ పార్టీలో మెక్సికన్ టీమ్, 30 మంది సెక్స్ వర్కర్లతో పార్టీ చేసుకుంటూ దొరికిపోయింది. ఈ ఫోటోలు వైరల్ కావడంతో ప్రపంచమంతా షాక్‌కి గురైంది...
1982 వరల్డ్ కప్ టోర్నీకి ముందు కూడా ఫ్రాన్స్ ఫుట్‌బాల్ టీమ్‌కి ఇలాంటి సెక్స్ కుంభకోణం కుదిపి వేసింది. ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ జీన్ ఫ్రాకోసిస్ లారియో, తన టీమ్మేట్ మైకెల్ ప్లాటినీ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తేలింది. ఈ ఎఫైర్ గురించి బయటికి పొక్కడంతో జట్టుని వివాదాలు వెంటాడాయి. దీంతో లారియోని వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఫ్రాన్స్...