ఈ రోజే అమావాస్య.. ఏం చేయాలంటే?
Mauni Amavasya 2024: మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈ రోజున కొన్ని పనులను తప్పకుండా చేయాలంటారు జ్యోతిష్యులు. ముఖ్యంగా ఈ రోజున మౌన ఉపవాసం పాటించడానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది తెలుసా?
సనాతన ధర్మంలో పౌర్ణమి, అమావాస్య తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మాఘ మాసంలో మౌని అమావాస్య వస్తుంది. రోజున మౌన ఉపవాసం కూడా పాటిస్తారు. ఈ ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం మాఘ మాసం జనవరి 26 నుంచి ప్రారంభమైంది. ఈ మాసంలో పవిత్ర నదిలో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే మౌని అమావాస్య రోజున నదిలో స్నానం చేయడాన్ని పవిత్రంగా భావిస్తారు.
మౌని అమావాస్య నాడు స్నానం చేయడానికి శుభ సమయం
పంచాంగం ప్రకారం.. మాఘ అమావాస్య తిథి ఫిబ్రవరి 9 న ఉదయం 08:02 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 10 నాడు ఉదయం 04:28 గంటలకు ముగుస్తుంది. అందుకే మౌని అమావాస్యను ఫిబ్రవరి 9 న జరుపుకుంటారు. ఈ రోజు ఉదయం 05.21 గంటల నుంచి 06.13 గంటల వరకు స్నానం చేయడానికి మంచి సమయం.
మౌని అమావాస్య శుభ యోగం
ఈ సంవత్సరం సర్వార్థ సిద్ధి యోగంలో మౌని అమావాస్య శుభకార్యం రూపుదిద్దుకుంటోంది. ఉదయం 07.05 నుంచి రాత్రి 11.29 గంటల వరకు సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది చాలా శుభప్రదం. సర్వార్థ సిద్ధి యోగంలో చేసే పనిలో విజయం తప్పక లభిస్తుంది. అలాగే పూజా ఫలం కూడా పొందుతారు.
మౌని అమావాస్యను ఎందుకు అలాగ పిలుస్తారంటే?
మాఘ అమావాస్య తిథినే మౌని అమావాస్య అంటారు. మను ఋషి ఈ రోజున జన్మించాడని నమ్ముతారు. ఈ కారణంగానే దీనిని మౌని అమావాస్య అంటారు. మౌని అమావాస్య నాడు మౌని ఉపవాసం ఉండటం వల్ల సానుకూల శక్తి ప్రసరిస్తుందని కూడా నమ్ముతారు. అలాగే పితృ దోషం, కాలసర్ప దోషం నుంచి విముక్తి పొందడానికి కూడా ఈ రోజు మంచి రోజు.
మౌని అమావాస్య రోజున గంగానదిలో స్నానమాచరించి నువ్వులు, ఉసిరి మొదలైన వాటితో చేసిన స్వీట్లను దానం చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల మరణం తర్వాత మోక్షం పొందుతారట. అలాగే రోగాల నుంచి కూడా విముక్తి పొందొచ్చని నమ్ముతారు.
Mauni Amavasya
మౌని అమావాస్య ప్రాముఖ్యత
మౌని అమావాస్య రోజున గంగానదిలో స్నానం చేయడం పుణ్యం మని జ్యోతిష్యులు అంటారు. మౌని అమావాస్య నాడు గంగాదేవి నీటిని అమృతంలా భావిస్తారు. అందుకే ఈ రోజున గంగానదిలో స్నానం చేసినవాని సకల పాపాలు నశించి అదృష్టాన్ని పొందుతారట.