గరుడపురాణం : అబద్ధాలు చెప్తే ఎలాంటి శిక్ష పడుతుంది..?
మనం చేసే పనులకు విధించే శిక్షలను వివరంగా చెప్పేదే గరుడ పురాణం.
// Comment this Pagview call for Gallery 4 Dec 2024 -- revert back to 18 Dec --, request by Deepak and Nathan Start // Comment this Pagview call for Gallery 4 Dec 2024 -- revert back to 18 Dec --, request by Deepak and Nathan StartGaruda Purana
మన జీవితంలో మనం చాలా మంచి పనులు, చెడ్డ పనులు చేసి ఉంటాం. వాటికి భూమి మీద ఉన్నప్పుడు కర్మ ఫలితాన్ని అనుభవించినా, అనుభవించకున్నా.. మరణానంతరం మాత్రం వాటికి తగిన శిక్షలు కచ్చితంగా ఉంటాయి. అలా మనం చేసే పనులకు విధించే శిక్షలను వివరంగా చెప్పేదే గరుడ పురాణం.
హిందూమతంలోని 18 మహా పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి. ఇందులో మనిషి జననం, మరణం, స్వర్గం, నరకం, యమలోకం, పునర్జనమ్మ, అధోకరణం మొదలైన వాటిన్నంటినీ వివరంగా వివరించారు.
Garuda Purana
గరుడ పురాణంలో చెడ్డ పనులు చేసే వారి ఆత్మలు మరణానంతరం నేరుగా నరకానికి వెళతాయని రాసి ఉంది. గరుడ పురాణం ప్రధానంగా 16 నరకాలను గురించి చెబుతుంది. ఈ 16 నరకాల్లో పాపాలను బట్టి శిక్షను పొందుతారు. గరుడ పురాణం ప్రకారం ఎవరైనా చనిపోయినప్పుడు, యమదూతలు అతని ఆత్మను యమరాజు ఆస్థానానికి తీసుకెళ్తారని, చిత్రగుప్తుడు అతని పనుల గురించి వివరిస్తాడు. దీని తరువాత, అతని చర్యల ప్రకారం అతని శిక్ష ఏమిటో నిర్ణయిస్తారు. అందుచేత జీవితంలో మంచి పనులు చేయడంతో పాటు ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి, ఎవరికీ హాని చేయకూడదు.
Garuda Purana
అబద్ధాలు చెప్తే ఎలాంటి శిక్ష పడుతుంది..?
మనలో చాలా మందికి ఉదయం లేచినదగ్గర నుంచి అబద్దాలు చెప్పే అలవాటు ఉంటుంది. అబద్ధమే కదా చెప్పాం.. అందులో పెద్ద నేరం ఏముంది అని అనుకుంటూ ఉంటారు. కానీ.. అబద్ధం చెప్పేవారికి కూడా కఠిన శిక్షలు ఉంటాయట. అబద్ధాలు చెప్పే వారికి నరకంలో ప్రత్యేక శిక్ష విధించే నిబంధన ఉంది. మీరు అబద్ధం చెప్పి చాలాసార్లు తప్పించుకుని ఉండవచ్చు, కానీ మీరు శాశ్వతంగా సేవ్ అయిపోయారు అనుకోకండి, బదులుగా మీరు యమరాజు ఆస్థానంలో దీనికి శిక్షతప్పదు.
Garuda Purana
అబద్ధాలు చెప్పినా నరకానికి…
యమరాజు ఆస్థానంలో, అబద్ధాలు చెప్పిన వారిని కూడా వదిలిపెట్టరు. శిక్ష తప్పదు. అబద్ధాలు చెప్పే వారిని తప్త్ కుంభ నరకానికి పంపుతారు. ఈ నరకంలో చుట్టుపక్కల మంటలు చెలరేగుతాయని, వేడి నూనె లో వేస్తారట. ఇనుప చువ్వలతో కాలుస్తారని.. వేడి గిన్నెలో తలకింద్రులుగా ఉంచుతారని గరుడ పురాణం చెబుతోంది.