హస్తప్రయోగమా... సెక్స్ టాయ్సా..? దేనికి ఓటు?
హస్త ప్రయోగం పై ఉన్నన్ని అపోహలు మరేదానిపై కూడా లేవంటున్నారు. దీని మీద జరిగినంత చర్చ మరే అంశంపై కూడా జరిగి ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. హస్త ప్రయోగం వల్ల సెక్స్ జీవితానికి ఎటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు హామీ ఇస్తున్నారు.
అనేక మంది యువతీ యువకులు తమలోని లైంగిక కోర్కెలను అణిచి పెట్టుకోలేక హస్త ప్రయోగం ద్వారా స్వయంతృప్తి పొందుతుంటారు. ఇలాంటి వారిలో కొంతమంది రోజుకు ఐదారుసార్లు కూడా హస్త ప్రయోగం చేస్తుంటారు. అయితే.. హస్త ప్రయోగం ఎక్కువగా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చాలా మంది భావిస్తుంటారు.
ముఖ్యంగా.. కీళ్ల నొప్పులు రావడం, కళ్లకింద నల్లటి మచ్చలు ఏర్పడటం, శరీరమంతా నీరసంగా ఉండటం లాంటివి దీని వల్లే జరుగుతున్నాయని చాలా మంది భావిస్తుంటారు. అయితే.. అదంతా వట్టి అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు.
హస్త ప్రయోగం పై ఉన్నన్ని అపోహలు మరేదానిపై కూడా లేవంటున్నారు. దీని మీద జరిగినంత చర్చ మరే అంశంపై కూడా జరిగి ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. హస్త ప్రయోగం వల్ల సెక్స్ జీవితానికి ఎటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు హామీ ఇస్తున్నారు.
సెక్స్ భాగస్వామి లేనప్పుడు, సెక్స్‌లో పాల్గొనే అవకాశం కన్పించనప్పుడు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా స్వయంతృప్తి పొందవచ్చని వారు చెబుతున్నారు. ఇది చాలా ఆరోగ్యకరమైనదని.. ఎలాంటి అనారోగ్య సమస్యలకు దారి తీయదని చెప్పారు. హస్తప్రయోగ సమయంలో చేతిలో అంగం ఎలా కదులుతుందో అదే కదలిక సెక్స్ సమయంలో యోనిలో జరుగుతుందని వైద్యులు వివరిస్తున్నారు. కాబట్టి అతిగా హస్తప్రయోగం చేసుకోవడం వల్ల అంగం బలహీనపడుతుందనడంలో నిజం లేదన్నారు.
నిజానికి ఏ శరీర భాగమైనా సరిగా వాడకపోతే బలహీనపడుతాయి. కళ్ళ కింది నల్ల చారలు, కీళ్ళనొప్పులకు హస్తప్రయోగానికి సంబంధం లేదు. హస్త ప్రయోగం వల్ల లాభాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు. దీని వల్ల ఒత్తిడి పోతుందని అక్రమ సంబంధాలకు పోయి రోగాలు తెచ్చుకోవడం జరగదని వైద్యులు చెపుతున్నారు.
దీనిపై ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. హస్తప్రయోగం కన్నా కూడా.. సెక్స్ టాయ్స్ వినియోగించడం ద్వారా స్త్రీలు ఎక్కువ తృప్తి పొందుతున్నారట. హస్త ప్రయోగంతో పోలిస్తే..17శాతం ఎక్కువ తృప్తి లభిస్తుందని సర్వేలో తేల్చారు. 18నుంచి 50 ఏళ్ల వయసులోపల మహిళలపై చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడైనట్లు వారు తెలిపారు.
ఇక చాలా మంది ఈ స్వయంతృప్తి మహిళలకు మంచిదా కాదా అనే అనుమానాలు కూడా ఉంటాయి. దానిపై కూడా నిపుణులు క్లారిటీ ఇచ్చారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..స్వయంతృప్తి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలూ లేకపోగా, ఎలాంటి సుఖవ్యాధులూ దరి చేరకుండా ఉంటాయి.
పైగా స్వయంతృప్తి వల్ల గర్భం దాల్చే వీలూ ఉండదు. స్వయంతృప్తి వల్ల శరీరంలో ఫీల్‌గుడ్ ఎండార్ఫిన్లు విడుదలై ఒత్తిడి తొలగి, కండరాలు సాంత్వన పొందుతాయి. నెలసరి నొప్పులు కూడా తగ్గుముఖం పడతాయి. కాబట్టి మహిళలు స్వయంతృప్తి పొందడం అన్ని విధాలుగా సురక్షితం.
ఇటీవలే జరిపిన ఒక అధ్యయనంలో స్వయంతృప్తి వల్ల ‘రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్’ తగ్గుతుందనీ, గుండెకు తగిన వ్యాయామం కూడా అందుతుందనీ వెల్లడైంది.
అంతేకాదు... సెక్స్ టాయ్స్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. లైంగిక భాగస్వాములు లేనివారు మాత్రమే, సెక్స్ టాయ్స్‌ని ఆశ్రయిస్తా రనుకుంటే పొరపాటే. ‘సెక్స్ ఇన్ అమెరికా’ అధ్యయనం ప్రకారం... పరిపూర్ణ ఆరోగ్యవంతులైన దంపతులు కూడా శృంగారానుభూతిని రెట్టింపు చేసుకోడానికి పడకగదిలో బొమ్మల కొలువు పెట్టుకుంటారు.
లైంగిక అవసరాల్ని బట్టి, పడకగది అభిరుచుల్ని బట్టి ... రకరకాల పరిమాణాల్లో, రకరకాల రూపాల్లో బొమ్మలు అందుబాటులోకి వచ్చాయి. స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను తలపించే నిర్మాణాలతో సహా... రాకుమారినో, గ్రీకువీరుడినో గుర్తుకుతెచ్చే నమూనాల్ని కూడా విక్రయిస్తున్నారు.
కాస్త యంత్రశక్తిని జోడించిన ‘వైబ్రేటర్స్’కు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. వీటి వల్ల ఎలాంటి ప్రమాదం, నష్టం ఉండదని నిపుణులు చెబుతున్నారు.