శృంగారానికి రాచబాట వేసే ‘ముద్దు’..
తొలిప్రేమను, తొలివలపును..తొలి కలయికను ఎప్పటికీ గుర్తుండేలా చేసేది ముద్దు. నాలుగు పెదాల సయ్యాటతో.. శృంగారానికి రాచబాట వేసే ముద్దు అంటే ఇష్టపడని జంటలు ఉంటారా? జంటలమధ్య ముద్దులు తగ్గాయంటే.. వారి అనుబంధంలో ఏదో కొరత ఏర్పడినట్టే..
తొలిప్రేమను, తొలివలపును..తొలి కలయికను ఎప్పటికీ గుర్తుండేలా చేసేది ముద్దు. నాలుగు పెదాల సయ్యాటతో.. శృంగారానికి రాచబాట వేసే ముద్దు అంటే ఇష్టపడని జంటలు ఉంటారా? జంటలమధ్య ముద్దులు తగ్గాయంటే.. వారి అనుబంధంలో ఏదో కొరత ఏర్పడినట్టే..
ముద్దు అనే చర్య భావోద్వేగానికి సంబంధించినది. అప్పటివరకు మీ మానసిక, శారీరక స్థితి ఎలా ఉన్నా ముద్దు వాటన్నింటికీ చిటికెలో మాయం చేసి.. హార్మోన్లలో అద్భుతమైన మార్పును తీసుకువస్తుంది. అంతేకాదు ఫోర్ ప్లే లో ముద్దులు కీలకంగా పనిచేస్తాయి. భాగస్వామిని సెక్స్ కు పురిగొల్పడంలో దోహదపడతాయి. లైంగిక జీవితంలో చురుకుదనాన్ని పెంచుతాయి.
ఒత్తిడిని తగ్గించే సూపర్ మెడిసిన్ ముద్దు. ఇష్టమైన వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం అనే ప్రక్రియతో నరాల్లో ఉత్తేజితం కలుగుతుంది. దీంతో శరీరంలో ఆక్సిటోసిన్, డోపమైన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి, మెదడును ఉత్సాహంగా చేస్తుంది. అందుకే వీటిని ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటారు.
మీ భాగస్వామితో రిలేషన్ షిప్ ను మరింత దృఢంగా మార్చడానికి ముద్దు ముఖ్యమైన సాధనం. రిలేషన్ షిప్ లో ఒకరికి ఒకరు ఇచ్చే ప్రాధాన్యతే చాలా ముఖ్యం. ఆ ప్రాధాన్యతను ముద్దుతో తెలపండి. మీ రిలేషన్ షిప్ ను దీర్ఘకాలం కొనసాగించడానికి ముద్దు చాలా తోడ్పడుతుంది. ఒకవేళ ఇప్పటికే మీరిది పాటిస్తున్నట్లైతే మరిన్ని ముద్దులు యాడ్ చేయడం కూడా మంచిదే.
ముద్దు నాలుగు పెదాలు పాడే అద్భుతమైన కావ్యం. మీ ప్రేమ బంధానికి ఉత్సాహాన్ని అద్దుతుంది. పెదాలు పాడే వింతరాగమైన ముద్దు తో మీ శరీరంలో కరెంట్ ప్రవహించి, అది శరీరానికి, మనసుకు ఉల్లాసాన్ని, హాయిని ఇస్తుంది.
అందుకే శృంగారానికి మొదటి మెట్టు ముద్దు అంటారు. అయితే ఈ ముద్దు కేవలం కోరికకు, శృంగార కాంక్షకు మాత్రమే సంకేతం కాదు. మీ భాగస్వామికి క్షమాపణ చెప్పడానికీ ఇదొక అందమైన మార్గం. అప్యాయతకు అసలు అర్థాన్ని కలిగిస్తుంది. అభినందించడానికి అద్భుతమైన మార్గం.
ముద్దు అంటే కేవలం పెదాల మీదే పెట్టేది కాదు. నుదుటిమీద పెట్టే ముద్దు, చెంపల మీద పెట్టే ముద్దు ఆప్యాయంగా హత్తుకుని మెడవొంపులో పెట్టే ముద్దు, హత్తుకున్న ప్రేయసి తల మీద పెట్టే ముద్దు... చేతిమీద ముద్దు ఇలా ఎన్నో రకాలు. ఈ ముద్దులు మీ బంధానికి మరింత బలోపేతం చేస్తాయి.
ముద్దు శారీరకమైనదైనా.. భాగస్వాముల మధ్య మానసిక దగ్గరితనాన్ని పెంచుతుంది. ఇద్దరు మనసులు అల్లుకుపోవాలంటే ఆ తీగ ముద్దే అయి ఉండాలి. ముద్దు ఇద్దరి మధ్య అందమైన అనుబంధాన్ని పెనవేయడంతో పాటు, సాన్నిహిత్యపు ద్వారాలు తెరుస్తుంది.
నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే క్రమంలో ఏర్పడే ఒత్తిడి శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతుంది.
అందుకే వీలైనంతవరకు స్ట్రెస్ కు దూరంగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు అన్వేషించాలి. ముద్దు అనేది ఎంతటి ఒత్తిడినైనా చిటికెలో తీసేస్తుంది. అదే సమయంలో మీ ప్రేమబంధానికి కొత్త చిగురులు తొడిగిస్తుంది.
ఏ బంధానికైనా నమ్మకమే పునాది. నమ్మకం లేని చోట ఎలాంటి అనుబంధమైన, ఎంత గొప్ప బంధమైన నిలబడలేదు. మీ భాగస్వామిని ముద్దు పెట్టుకోవడం అంటే వారిలో మీ ప్రేమ పట్ల నమ్మకాన్ని కలిగించడమే. ప్రతీరోజూ ఇచ్చే ముద్దు మీరు వాళ్లను ఎంత ప్రత్యేకంగా చూస్తున్నారో చెప్పకనే చెబుతుంది.
ముద్దు మీ పట్ల వారికి, వారి పట్ల మీకు నిజమైన ప్రేమకు సంకేతంగా నిలుస్తుంది. దీంతో ఇద్దరి మధ్య పొరపొచ్చాలకు అవకాశం ఉండదు. మీ బంధం కలకాలం సంతోషంగా గడిచిపోవడానికి ముద్దు తారకమంత్రంగా పనిచేస్తుంది.