వయసు తక్కువ... తృప్తి ఎక్కువ
తానకేమీ వయసు మించిపోలేదు అని మనసులో బలంగా నమ్మేవారు శృంగారంలో ఎక్కువ తృప్తి పొందగలరని నిపుణులు చెబుతున్నారు. వాటర్ లూ విశ్వ విద్యాలయ సంస్థ ఈ విషయంపై కొన్ని సంవత్సరాలపాటు పరిశోధనలు జరిపింది.
శృంగారం అనేది భార్య భర్తల బంధాన్ని మరింత ధృడం చేస్తుంది. అయితే.... చాలా మంది యవ్వనంలో ఉన్నప్పుడు మాత్రమే సంసారం ఎక్కువ ఎంజాయ్ చేయగలరని.. వయసు పెరిగిపోతుంటే దానిపై ఆసక్తి తగ్గిపోతుందని భావిస్తుంటారు
అయితే... ఈ ఆలోచనలో ఎలాంటి నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. వయసు పైబడిన దంపతులు కూడా సంసారాన్ని బాగా ఆస్వాదించగలరని వారు చెబుతున్నారు. ఈ వయసు, శృంగారం విషయంపై నిపుణులు చేసిన పరిశోధనలో ఓ ఆసక్తికర విషయం వెలువడింది.
sకొందరు మీ యవసు ఎంత అని అడిగితే... అసలు వయసు కన్నా తక్కువ చెబుతూ ఉంటారు. తాము ఇంకా చిన్నవారిమే.. వయసు ఎక్కువ కాదు అని నిరూపించుకోవడానికి వయసు విషయంలో అబద్ధం చెబుతూ ఉంటారు. అయితే... ఇలా వయసు తక్కువ చెప్పడం వల్ల వారి శృంగార జీవితం ఆనందంగా సాగుతుందని ఓ పరిశోధనలో తేలింది.
తానకేమీ వయసు మించిపోలేదు అని మనసులో బలంగా నమ్మేవారు శృంగారంలో ఎక్కువ తృప్తి పొందగలరని నిపుణులు చెబుతున్నారు. వాటర్ లూ విశ్వ విద్యాలయ సంస్థ ఈ విషయంపై కొన్ని సంవత్సరాలపాటు పరిశోధనలు జరిపింది.
ముఖ్యంగా 40-60 ఏళ్ల వయసు వారిలో శృంగార ధోరణులపై పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అసలు వయసుతో పోలిస్తే.. మానసికంగా తామింకా చిన్నవాళ్లమే అని ఫీలయ్యేవారు శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారని నిపుణులు చెబుతున్నారు.
దానర్థం.. వాళ్లు ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొంటున్నారని కాదని... కేవలం పాల్గొన సమయంలోనే ఎక్కువ తృప్తిని పొందుతున్నారని అర్థమని వారు చెబుతున్నారు.
వయసు తుక్కువ అని భావించేవాళ్లు సహజంగానే చురుకుగా ఉంటారు. అంతేకాకుండా.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాడం, తరచూ వ్యాయామం చేయడం వల్ల కూడా వయసు పైబడినా చురుకుగా కనిపిస్తారు.
తరచూ వ్యాయామం చేస్తూ ఫిట్ గా ఉండేవారు.. చురుకుగా ఉంటారు కాబట్టే.. వాళ్లు శృంగారాన్ని తృప్తిగా ఆస్వాదించగలుగుతున్నారని వారు చెబుతున్నారు.