ప్రేమ.. పెద్దలు కుదిర్చిన పెళ్లి... రెండింటిలో ఏది బెస్ట్..?
అయితే.. దాదాపు 85శాతం మంది తల్లిదండ్రులు పెద్దలు కుదిర్చిన పెళ్లి మాత్రమే చేయాలని భావిస్తున్నారట. ప్రేమ పెళ్లిలో మతాలు, కులాలు తేడాలు ఉంటున్నాయని అవి పెద్దలకు నచ్చడం లేదని తెలుస్తోంది.
పెళ్లి.. చాలా పవిత్రమైనది. ఇద్దరు మనుషులతోపాటు.. రెండు కుటుంబాలను ఏకం చేస్తుంది. ఒకరి కోసం మరొకరు అంటూ... జీవితం మొత్తం కలిసి జీవిస్తారు. అయితే... కొందరు.. ప్రేమ పెళ్లి చేసుకుంటుంటే.. మరి కొందరు మాత్రం పెద్దలు కుదర్చిన పెళ్లి చేసుకుంటారు.
అయితే.. ఈ పెళ్లిళ్ల విషయంలో చాలా మందికి ఓ సందేహం ఉంటుంది. ప్రేమ పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటామా..? పెద్దలు కుదర్చిన పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటామా..? అని ఈ విషసయంలో ఓ సంస్థ సర్వే చేయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అయితే.. దాదాపు 85శాతం మంది తల్లిదండ్రులు పెద్దలు కుదిర్చిన పెళ్లి మాత్రమే చేయాలని భావిస్తున్నారట. ప్రేమ పెళ్లిలో మతాలు, కులాలు తేడాలు ఉంటున్నాయని అవి పెద్దలకు నచ్చడం లేదని తెలుస్తోంది.
చాలా కొద్ది మంది మాత్రమే..ప్రేమ వివాహాలకు అంగీకరించినట్లు తెలుస్తోంది. చాలా కొద్ది మాత్రమే కులాలు, మతాలు పట్టింపు లేవని చెప్పడం గమనార్హం.
పెళ్లంటే.. కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య బంధమే కాకుండా... రెండు కుటుంబాలు కలవాలి. ఈ క్రమంలో.. ఆచార సంప్రదాయాల్లో తేడాలు ఉండటం వల్ల ప్రేమ వివాహాలను అడ్జస్ట్ కాలేకపోతున్నారట.
అధిక శాతం మంది ప్రజలు ఎటువంటి బలవంతం లేకుండా ఏర్పాటు చేసిన వివాహాన్ని ఇష్టపడతారు, ఎందుకంటే వారు శాంతి మరియు సామరస్యంతో జీవించగలరు.
అనేక సందర్భాల్లో, ప్రేమ వివాహాలు చాలా ఇబ్బందులు మరియు వివాదాలను తెస్తాయి. పెద్దలు అంగీకరించకపోవడం లాంటి కారణాల వల్ల తేడాలు వస్తున్నాయి. దీంతో.. దీనికన్నా పెద్దలు కుదిర్చిన పెళ్లే బెటర్ అని చాలా మంది భావిస్తున్నారట.
చాలా మంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ప్రేమ వివాహాలలో విడాకుల రేటు ఎక్కువగా ఉంటుంది. భారతీయ యువకులు తమ పెద్దలను వివాహానికి అనువైన భాగస్వామిని ఎంచుకోవాలని భావిస్తుంటారు.
అదే ప్రేమ పెళ్లి అయితే.. జంటలు తమ కుటుంబాలను ఏకాభిప్రాయం కోసం ఒప్పించడానికి అదనపు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది, ప్రత్యేకించి, భాగస్వాములు వివిధ మతాలకు లేదా కులానికి చెందినవారు అయితే...మరింత కష్టతరం అవుతుంది.
అందుకే భారత దేశంలో.. ప్రేమ వివాహాల కంటే.. పెద్దలు కుదర్చిన పెళ్లిళ్లే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది దానికే ఓటు వేస్తున్నారు. పెద్దలు కుదర్చిన పెళ్లిళ్లలో.. దంపతుల మధ్య బేధాభిప్రాయాలు వస్తే.. దానిని ఇరు కుటుంబీకులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రేమ పెళ్లిలో ఇలాంటి వెసులు బాటు ఉండదు అనే భావన చాలా మందిలో ఉంది.