ఈ లక్షణాలున్న స్త్రీలంటే.. పురుషులు ఈజీగా పడిపోతారు...
మనిషి మనిషికి ఇష్టాలు, అభిరుచులు మారుతుంటాయి. తినే ఆహారం నుండి మొదలుపెట్టి వేసుకునే బట్టలు, కొనుక్కునే వస్తువుల విషయాల్లో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. ఇక అదే తన జీవిత భాగస్వామి విషయానికి వచ్చేసరికి ఇంకా చాలా కోరికలుంటాయి.
మనిషి మనిషికి ఇష్టాలు, అభిరుచులు మారుతుంటాయి. తినే ఆహారం నుండి మొదలుపెట్టి వేసుకునే బట్టలు, కొనుక్కునే వస్తువుల విషయాల్లో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. ఇక అదే తన జీవిత భాగస్వామి విషయానికి వచ్చేసరికి ఇంకా చాలా కోరికలుంటాయి.
అందుకే మనిషి మనసులో ఏముందో కనిపెట్టడం అసాధ్యం. ఎలాంటి వ్యక్తి, ఏ అభిరుచులు, అలవాట్లు నచ్చుతాయో చెప్పలేం. స్త్రీలు ఎంత అందంగా ఉన్నా, అన్ని విషయాల్లో ఎంతో పర్ఫెక్ట్ గా ఉన్నా కొన్నిసార్లు మగవాడిని మెప్పించలేకపోవచ్చు. దీనికి కారణం స్త్రీలలో లోపం కాదు. పురుషుల కోరికలు, ఆలోచనా విధానంలో తేడాలవల్లే ఇలా జరుగుతుంది.
అందుకే అసలు స్త్రీలలో పురుషులు ఏం కోరుకుంటారు. తన జీవితభాగస్వామి అయ్యే స్త్రీ ఎలా ఉండాలని ఆశపడతారు అనే అంశంమీద ఓ అధ్యయనం జరిగింది. దీని ప్రకారం ఓ అంచనాకు వచ్చి కొన్ని పాయింట్స్ ను సెలెక్ట్ చేశారో. అవేంటో చూడండి.
అందంతో పాటు తెలివి ఉన్న మహిళలనే పురుషులు ఇష్టపడతారని కొంతమంది అంటారు. కానీ ఇది నిజం కాదు షురుషుల దృష్టి ముందు బాహ్య సౌందర్యానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది.
తనను తాను అందంగా, అద్భుతంగా ప్రజెంట్ చేసుకోగలిగే స్త్రీలనే పురుషుడు ఇష్టపడతాడు. అందంగా మాట్లాడడం, చక్కగా ముస్తాబవ్వడం, చక్కటి డ్రెస్సింగ్ సెన్స్ వీటికే అట్రాక్ట్ అవుతారు. మంచి వ్యక్తిత్వం అనేది వీరి విషయంలో సెకండరీ. అయితే మాగ్జిమమ్ పురుషులు మాత్రం అందంతో పాటు తెలివి కలిగిన ఆడవారినే ఎక్కువగా ఇష్టపడతారట.
ప్రతీదానికి తమ మీద ఆధారపడే స్త్రీలంటే పురుషులు ఆమడదూరం పరిగెడతారంట. ఇది కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా, పురుషులు ఎక్కువగా సొంత వ్యక్తిత్వం ఉండి, సెల్ఫ్ సఫీషియంట్ అయిన స్త్రీలకే ఎక్కువ ఆకర్షితులవుతారట.
ఇంటి యజమానిగా తానే ఉండాలని పురుషులు కోరుకుంటారనేదానికి ఇది పూర్తిగా భిన్నం. స్త్రీ కూడా ఇంటి నిర్వహణలో సమభాగస్వామ్యం తీసుకోవడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అన్ని విధాలుగా దానికోసం ప్రయత్నించేవారంటేనే ఎక్కువ మోజు చూపిస్తారట.
తమ భాగస్వామి లేదా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు కోపంగా ఉంది, అలిగింది లాంటి విషయాలు గెస్ చేయడం అంటే పురుషులకు చాలా అసహ్యం. పరిస్థితి ఎలాంటిదైనా కావచ్చు.. కూర్చుని మాట్లాడుకుని విషయాలు సాల్వ్ చేసుకోవడానికే ఇష్టపడతారు. దీనివల్ల అపార్థాలు తొలగిపోతాయని నమ్ముతారు. అందుకే మగవారిని ఎక్కువ ఆలోచించద్దని చెప్పడం మంచిదట.
స్త్రీల కౌగిలిలో కరిగిపోవడం అంటే పురుషులు బాగా ఇష్టపడతారు. అది కూడా చుట్టూ ఎవ్వరూ చూడని టైంలో.. అంతేకాదు తాము చేసిన పనికి ప్రశంసలు కోరుకుంటారు. హెవీ వర్క్ తరువాత ఇంటికి చేరుకున్న భర్తను హత్తుకుని, ముద్దులు కురిపిస్తే వారి మొహంలో కోటికాంతుల వెలుగు కనిపిస్తుందట. ఇలాంటి అనుకోని సర్ ఫ్రైజ్ లు ప్రతీ మగవాడు తన జీవితంలో ఉండాలనుకుంటాడట.
పురుషులు స్త్రీలలో కంఫర్ట్ కోరుకుంటారు. అది బెడ్ రూం కానివ్వండి, డేట్ కానివ్వండి, డిన్నర్ కు వెళ్లడం ఏదైనా కావచ్చు. తమ స్త్రీ అందంగా సందర్భానికి తగ్గట్టుగా ఉండాలని కోరుకుంటారు. అందుకే సందర్బాన్ని బట్టి డ్రెస్సింగ్ ఎంచుకోవాలి. ప్రతీసారీ సెక్సీ అవుట్ ఫిట్స్ అనేవి పనికిరావు.
బెడ్ రూంలో వాళ్ల ఫాంటసీలకు తగ్గట్టుగా డ్రెస్సింగ్ లో కాస్త విశాలత కనబరిస్తే వారు ఎంతో ఇష్టపడతారు.
హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు వెయిటర్స్ తో వ్యవహరింతే తీరును బట్టి పురుషులను అంచనా వేయడం స్త్రీలు చేసినట్టే.. పురుషులు కూడా అంచనా వేస్తారు. తన చుట్టుపక్కల ఉన్నవారితో దయగా, కనికరం కలిగి ఉండే స్త్రీనే ప్రతి పురుషుడూ కోరుకుంటారు. అలాగని అనవసరపు గొప్పలు, ఆడంభరాలు చెప్పుకోవడాన్నీ ఇష్టపడరు. తన స్నేహితులతో గొప్పగా చెప్పుకోగలిగిన స్త్రీనే పురుషులు ఇష్టపడతారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.