క్యాజువల్ సెక్స్ పై క్రేజ్.. ప్రమాదమూ ఉంది..!
ఇటీవల ఓ సంస్థ జరిపిన సర్వేలో ఈ క్యాజువల్ సెక్స్ గురించి చాలా విషయాలు భయటపడ్డాయి. అసలు తమకు ఎలాంటి పరిచయం లేని ఓ వ్యక్తితో ఒక రాత్రి అంతా గడపడానికి ఈ కాలం యువత ఎలాంటి సందేహం వ్యక్తం చేయకపోవడం గమనార్హం.
ప్రస్తుత కాలంలో యువత ప్రతిదీ అడ్వెంచర్ గా ఉండాలని.. భిన్నంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. కొత్తగా ఏ ట్రెండ్ వస్తే.. దానిని ఫాలో అవ్వాల్సిందే అన్నట్లు ఉంటున్నారు. ఒకవేళ ఎవరైనా ఆ ట్రండ్ ని ఫాలో అవ్వకపోతే.. అదేదో పెద్ద నేరంగా చూసేవాళ్లు కూడా ఉన్నారు. డ్రస్సులు, స్మార్ట్ ఫోన్లు లాంటి ట్రెండ్ ఫాలో అయితే పర్లేదు.. వాటిని దాటి మరో సరికొత్త ట్రెండ్ కి కూడా తెరలేపుతున్నారు. అదే క్యాజువల్ సెక్స్.
ఇటీవల ఓ సంస్థ జరిపిన సర్వేలో ఈ క్యాజువల్ సెక్స్ గురించి చాలా విషయాలు భయటపడ్డాయి. అసలు తమకు ఎలాంటి పరిచయం లేని ఓ వ్యక్తితో ఒక రాత్రి అంతా గడపడానికి ఈ కాలం యువత ఎలాంటి సందేహం వ్యక్తం చేయకపోవడం గమనార్హం.
అర్బన్ ఇండియాలో గత పదిహేనేళ్లలో వచ్చిన భారీ మార్పులో ఈ క్యాజువల్ సెక్స్ ఒకటి. మెట్రో నగరాల్లో 41శాతం మంది యువకులు, 29శాతం మంది యువతులు ఒక రాత్రి అనుభవవానికి సముఖంగా ఉన్నట్లు సర్వేలో తేలింది.
ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో ప్రతి ఏడుగురిలో ఒకరు.. తమకు పరిచయం లేనివారితో రాత్రి గడిపామని అంగీకరించారు. అంతేకాదు.. సెల్ఫ్ పోర్న్ ని వారు అదో కొత్త ట్రెండ్ గా భావిస్తున్నట్లు సర్వేలో తేలింది.
ఇంకొందరైతే.. సెల్ఫీలు తీసుకున్నంత సింపుల్ గా తమ పార్టనర్స్ తో కలిసి రతిక్రీడను వీడియోలుగా తీసుకుంటున్నారట. ఆ వీడియోలను వారే స్వయంగా స్నేహితులతో షేర్ చేసుకుంటున్నట్లు తెలిసింది.
అయితే... ఈ క్యాజువల్ సెక్స్ కారణంగా భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా పరిచయం లేని వ్యక్తితో గడిపే సమయంలో.. ఆ తర్వాత మీ రిలేషన్ పై ముందుగానే క్లారిటీ ఇచ్చుకోవాలి. లేకపోతే.. తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
క్యాజువల్ సెక్స్ లో పాల్గొన్న తర్వాత.. ప్రేమగా ఒకరినొకరు హత్తుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం లాంటివి కూడా చేయకూడదట. దాని వల్ల ఒకరిపై మరొకరికి ప్రేమ పుట్టే అవకాశం ఉంది. దాని వల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ బంధం ఆ ఒక్కరోజుది మాత్రమే అన్న విషయం గుర్తుంచుకోవాలి.
ఈ క్యాజువల్ సెక్స్ లో పాల్గొనడానికి ముందు.. ఇద్దరి అనుమతి ముఖ్యం. ఇద్దరూ కలిసి మాట్లాడుకొని.. తర్వతే ప్రోసీడ్ అవ్వాలి. బలవంతం మీద చేయకూడదు. కావాలంటే ముందే ఒప్పంద పత్రం రాసుకోవచ్చు.
చాలా మంది ఈ క్యాజువల్ సెక్స్ తర్వాత ఫ్రెండ్స్ లా ఉందామని అనుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదని నిపుణుల అభిప్రాయం. వారిని చూసిన ప్రతిసారీ.. ఆ రాత్రి జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు వారు స్నేహితులుగా ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది
క్యాజువల్ సెక్స్ లో పాల్గొనేవారు రక్షణ తీసుకోవడం చాలా అవసరం. అది లేకుండా చేయడం వల్ల సుఖ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.