సంసారంలో చిచ్చు పెడుతున్న డ్రింక్స్.. సామర్థ్యం తగ్గిపోతుందా?
ఈ డ్రింక్స్ కూడా మీ సంసారంలో చిచ్చు పెట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డైట్ డ్రింక్స్, సోడాలు తాగడం వల్ల స్త్రీ, పురుషుల్లో సంతానం కలిగే సామర్థ్యం తగ్గిపోతుందట.
ఈ మధ్యకాలంలో దాదాపు అందరికీ ఆరోగ్యంపై దృష్టి పెరిగింది. ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి.. ఏది తిన్నాలన్నా.. తాగాలన్నా.. కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉంటున్నారు. వాటిలో షుగర్ ఉంటుంది కాబట్టి.. వాటిని దూరంగా పెడుతున్నారు.
అంతకవరకు బాగానే ఉంది. కానీ ఈ ఎండాకాలం దాహార్తి తీరాలంటే కూల్ డ్రింక్స్ తాగాలి కదా.. అందుకే.. నార్మల్ కూల్ డ్రింక్స్ కాకుండా.. డైట్ డ్రింక్స్, సోడా లాంటివి తాగుతున్నారు.
అయితే... ఈ డ్రింక్స్ కూడా మీ సంసారంలో చిచ్చు పెట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డైట్ డ్రింక్స్, సోడాలు తాగడం వల్ల స్త్రీ, పురుషుల్లో సంతానం కలిగే సామర్థ్యం తగ్గిపోతుందట.
ఈ మధ్యకాలంలో పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గిపోయి.. సంతానంలేక ఇబ్బంది పడుతున్నవారు చాలా మందే ఉన్నారు.
పిసిఒఎస్, ఎండోమెట్రియోసిస్ అనారోగ్యకరమైన బరువు పెరగడం మహిళల్లో ఇన్ ఫెర్టిలిటీ( వంధత్వం) కి చాలా సాధారణ కారణాలు. పురుషులలో, స్పెర్మ్ ఉత్పత్తి తగ్గుతుంది. దాని వల్ల సంతానం కలగదు.
అయితే... ఇలాంటి సమస్యలు ఏర్పడటానికి మన లైఫ్ స్టైలో మార్పులేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలిసీ తెలియక చేసే కొన్ని పొరపాట్లు పిల్లలు, ఆహారపు అలవాట్లు కారణమౌతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
డైట్ కోక్ పేరిట వచ్చే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల సంతాన సమస్యలు కలుగుతున్నాయని పరిశోధనలో తేలింది. డైట్ కూల్ డ్రింక్స్ లో షుగర్ లేకుండా తయారు చేస్తారు. అయితే.. అవి తాగినప్పుడు తియ్యని అనుభూతి కలిగేందుకు.. అందులో ఆర్టిఫీషియల్ డ్రింక్స్ కలుపుతారు. దాని వల్ల స్త్రీ, పురుషుల్లో ఈ ఫెర్టిలిటీ సమస్యలు మౌదలౌతాయని తాజా పరిశోధనలో స్పష్టంగా తేలింది.
సంతానం కావాలని కోరుకునేవారు ఇలాంటి డ్రింక్స్ కి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ పానీయాలలో సాధారణంగా కనిపించే కృత్రిమ స్వీటెనర్లను తరచుగా తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి చికిత్స పొందుతున్న స్త్రీని గర్భం ధరించే అవకాశాలు తగ్గుతాయి.
వివిధ అధ్యయనాలు సోడా ఎక్కువగా తీసుకోవడం వల్ల స్త్రీపురుషులలో ఫెర్టిలిటీ సమస్యలు రావడానికి కారణమౌతాయని తేలింది. అధ్యయనాల ప్రకారం, ఎక్కువ సోడా తాగే పురుషులు స్పెర్మ్ లెక్కింపు, చైతన్యం తగ్గిపోతుందని.. తద్వారా సంతానోత్పత్తి సమస్యలు తలెత్తుతాయని తేలింది.
ఈ పానీయాల్లో యాసిడ్స్ ఉంటాయి. అంటే అవి శరీరం యొక్క pH ని మార్చగలవు, ఇది సంతానోత్పత్తిని మరింత దిగజార్చుతుంది. చాలా హానికరమైన పదార్ధం, ఇది ఎండోక్రైన్ గ్రంథుల సరైన పనితీరును మారుస్తుంది మరియు హార్మోన్ల అసమతుల్యతను కలిగిస్తుంది.
చాలా పానీయాల తయారీలో కెఫెన్ వినియోగిస్తారు. దాని వల్ల మహిళల్లో రుతు స్రావం తగ్గుతుంది. అండశాయ మరణాలు, వీర్యం నాణ్యత తగ్గిపోతుంది.
సోడాలో అధిక చక్కెర కంటెంట్ అధిక బరువు, ఉబకాయం వంధ్యత్వానికి దారితీస్తుంది. సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. మహిళల్లో పీసీఓఎస్ సమస్యకు కారణమౌతుంది.
అధిక సోడా వినియోగం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది మరియు టైప్ -2 డయాబెటిస్‌కు దారితీస్తుంది, ఇది సంతానోత్పత్తిని దెబ్బతీస్తుంది.
అధ్యయనాల ప్రకారం, రోజుకు ఒక కప్పు చక్కెర లేదా డైట్ సోడా తాగడం వల్ల మీలో ఫెర్టిలిటీ సమస్య 20-25% పెరుగుదల పెరుగుతుంది. ఈ ప్రతికూల ప్రభావాలు సహజ గర్భధారణకు మాత్రమే పరిమితం కావు, అయితే వాటిని IUI మరియు IVF వంటి సంతానోత్పత్తి చికిత్సలు చేయించుకునే వారిపై కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి.. సోడాలకు దూరంగా ఉండండి.
సంతానోత్పత్తిని పెంచడానికి తగిన ఔషదాలను తీసుకోవడంతో పాటు, సంతానోత్పత్తిని పెంచే ఆహారాన్ని చేర్చడం చాలా అవసరం. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, పాలు, మల్టీవిటమిన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం మంచిది.
సాధారణ వ్యాయామం, అల్పాహారం తినడం, విశ్రాంతి తీసుకోవడం, కెఫిన్ తగ్గించడం మరియు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం వంటి కొన్ని ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు కూడా దీనికి అవసరం.