మీ ప్రేమను మీ పేరెంట్స్కు ఇలా చెప్పండి వెంటనే ఒకే చెప్పేస్తారు..?
మన జీవితం బాగుండాలని ఆలోచించే వారిలో మొదట తల్లిదండ్రులు (Parents) ఉంటారు. మన సంతోషం కోసమే వారు నిరంతరం కృషి చేస్తుంటారు. మనం జీవితంలో తీసుకునే నిర్ణయాల్లో కచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది. తల్లిదండ్రులు మనతో మంచి స్నేహితులుగా ఉంటూ మన అన్ని కష్ట సుఖాలలో తోడు ఉంటారు. అన్ని విషయాలను వారితో చెప్పుకునే చనువు మనకు ఉంటుంది. కానీ ప్రేమించిన వ్యక్తి గురించి వారితో చెప్పడానికి తెలియని ఆందోళన, భయం మొదలవుతుంది. అయితే కుటుంబాన్ని ఒప్పించి ప్రేమను (Love) ఎలా గెలుచుకోవాలో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
ప్రేమించిన వ్యక్తి గురించి తల్లిదండ్రులకు చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు వారిలో దిగులు (Worried) మొదలవుతుంది. తల్లిదండ్రులకు వారి ప్రేమ గురించి చెప్పినప్పుడు వారు ఒప్పుకుంటారో లేదో అన్న సందేహాలు (Doubts) పిల్లలలో మొదలవుతాయి. వారి ప్రేమ గురించి ఇంట్లో వాళ్లకు తెలిస్తే తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో అని ఆందోళన చెందుతారు.
ఇలాంటి విషయాలు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య అడ్డుగోడగా మారుతాయి. ఈ విషయంలో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య మనస్పర్ధలు (Conflicts) ఏర్పడతాయి. కానీ నిజమైన ప్రేమ (True love) ఉన్నచోట తల్లిదండ్రులను ఎలాగైనా ఒప్పించి వారి ప్రేమను గెలుచుకునే ప్రయత్నం చేస్తారు. అయితే తల్లిదండ్రులను ఏ విధంగా ఒప్పించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీద కలుగుతుందో చెప్పడం కష్టమే. కానీ ప్రేమించిన వ్యక్తితోనే మీ జీవితాన్ని పంచుకోవాలంటే తల్లిదండ్రుల అనుమతి (Permission) కూడా ముఖ్యమే. మీ ప్రేమ విషయం గురించి తల్లిదండ్రులకు తెలియచేయాలి. వారు మీ ప్రేమ గురించి ఎలా స్పందిస్తున్నారో (Responding) మీ ప్రేమ కారణంగా వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
అయితే చాలా మంది తల్లిదండ్రులకు కులం (Caste), మతం (Religion), అంతస్తులు వంటి విషయాలలో తేడాలు ఉంటే ఒప్పుకోవడానికి సంకోచిస్తారు. కానీ మీ స్వచ్ఛమైన ప్రేమ గురించి వారికి అర్థమయ్యేలా వివరించాలి. మీరు ప్రేమించిన వ్యక్తి ఎలాంటి వారో పెళ్లి తర్వాత మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో వారికి తెలియజేయాలి. మీరు ప్రేమించిన వ్యక్తి పై కుటుంబ సభ్యులకు ఎన్నో సందేహాలు ఉంటాయి.
వారి సందేహాలకు మీరు చికాకుపడకుండా ఓపికతో (Patience) సమాధానం ఇవ్వండి. తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవడానికి వారికి కావల్సిన సమయాన్ని ఇవ్వండి. అప్పుడే మీకు తల్లిదండ్రుల మీద ఎంత బాధ్యత (Responsibility) ఉందో ప్రేమించిన వ్యక్తి మీద కూడా అంతే బాధ్యత ఉందని తల్లిదండ్రులకు అర్థమౌతుంది. అలాగే ప్రేమించిన వ్యక్తికి కూడా మీ తల్లిదండ్రుల పట్ల సరైన అవగాహన కల్పించాలి.
అప్పుడే ప్రేమించిన వ్యక్తి కూడా మీ తల్లిదండ్రులతో సర్దుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలా సాధ్యమైనంత వరకు ఇరుకుటుంబాల అంగీకారంతో (Acceptance) పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రుల ప్రేమ ఎప్పటికీ మీ మీద అలానే ఉంటుంది. పెళ్లి తర్వాత మీ భవిష్యత్తు బాగుంటుంది. ఎలాంటి సమస్యలు (Problems) ఉండవు.