సెక్స్ విషయంలోనూ స్వార్థమేనా..?
ప్రతి విషయంలోనూ చాలా కంట్రోల్ గా ఉంటారు. చేసేదంతా చేసి.. చివర్లో మాత్రం.. మనం ఎప్పటికీ కలిసే ఉంటాం అంటూ ప్రామిస్ లు చేస్తూ ఉంటారట.
స్వార్థం .. ప్రతి ఒక్కరిలో ఏంతో కొంత ఉంటుంది. అయితే... కొందరు తమ కోసం.. తమ వారి కోసం.. అందరూ మంచిగా ఉండాలని..కోరుకుంటారు. అందులో ఎలాంటి తప్పులేదు. కానీ... కొందరు ప్రతి విషయంలోనూ చాలా స్వార్థం ఆలోచిస్తారు. తాను తప్ప మరెవరో ఆనందంగా ఉండాలని వారు కోరుకోరు. అలాంటి లక్షణాలు ఉన్నవారు మీ జీవితంలో కూడా ఎవరైనా ఉన్నారా.. అతను మీ బాయ్ ఫ్రెండ్ అయితే..? అసలు స్వార్థపరులను ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం..
స్వార్థపరులు.. ప్రతి విషయంలో తమకు ఏ ప్రయోజనం ఉంటుందనే ఆలోచిస్తారు. ఎప్పుడూ తమను తాము గమనించుకుంటూ ఉంటారు. ప్రతి కోణాన్ని.. తమ వైపు నుంచే ఆలోచిస్తూ ఉంటారు.
మీకో విషయం తెలుసో తెలీదో.. స్వార్థపరులు, సెల్ఫిష్ పీపుల్.. ప్రతి విషయంలోనూ చాలా కంట్రోల్ గా ఉంటారు. చేసేదంతా చేసి.. చివర్లో మాత్రం.. మనం ఎప్పటికీ కలిసే ఉంటాం అంటూ ప్రామిస్ లు చేస్తూ ఉంటారట.
మరీ ఎక్కువ స్వార్థపరులను ఎవరు మాత్రం భరిస్తారు చెప్పండి.. అందుకే.. ఎప్పుడైనా వారిని ప్రశ్నించినా.. వారికి ఎదురు తిరిగినా.. వెంటనే.. రివర్స్ లో వారే మనల్ని బ్లేమ్ చేస్తారు. చివరకు.. నిజంగా తప్పు చేసింది మనమేనా అనే అనుమానం మనకే కలగేలా చేయడంలో వీరు సిద్ధహస్తులు.
ఇక వీరు రొమాన్స్, శృంగారం విషయంలోనూ ఇదే విధంగా ప్రవర్తిస్తారు. వారికి కావాలనిపించినప్పుడు మాత్రమే సెక్స్ చేస్తారు. ఆసమయంలోనూ వారి తృప్తి మాత్రమే చూసుకుంటారు. మీరు కనీసం సుఖపడ్డారో లేదో.. మీకు ఎలా ఉంటే ఇష్టం లాంటివి కూడా పట్టించుకోరు.
తమకు ఇష్టం అయిన వారి కోసం కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. తమకు కావాల్సింది మాత్రమే చూసుకుంటారు. కాంప్రమైజ్ అనేది వారి డిక్షనరీలోనే ఉండదు.
అంతేకాదు.. వీరికి అభద్రతా భావం చాలా ఎక్కువ. ఎక్కడైనా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ తామే కావాలని అనుకుంటారు. ఇక జీవిత భాగస్వామి విషంయలో చాలా పొసెసివ్ గా.. జెలస్ గా ఉంటారు.
ఇక వీళ్లు.. తమకు సమస్య వస్తుంది అంటే.. ప్రేమించిన వారికి కూడా అండగా నిలపడరు. నీ చావు నువ్వు చావు అన్నట్లు.. చల్లగా అక్కడ నుంచి తప్పుకుంటారు.