వేరే స్త్రీతో సంబంధం.. మీ భార్య దగ్గర ఒప్పుకునేదెలా?
నమ్మకపు పునాదుల మీద ఏర్పడేదే వైవాహిక బంధం. ఆ బంధంలో వివాహేతర సంబంధాలు నిలువుగా ముంచేస్తాయి. భార్య ను భర్త, భర్తను భార్య మోసం చేయడం ఆ వివాహబంధానికి గొడ్డలిపెట్టులా మారుతుంది.
నమ్మకపు పునాదుల మీద ఏర్పడేదే వైవాహిక బంధం. ఆ బంధంలో వివాహేతర సంబంధాలు నిలువుగా ముంచేస్తాయి. భార్య ను భర్త, భర్తను భార్య మోసం చేయడం ఆ వివాహబంధానికి గొడ్డలిపెట్టులా మారుతుంది.
మిమ్మల్నే తనలోకంగా ప్రేమించే భార్యకు ఇది అనుకోని అశనిపాతంలా తాకుతుంది. దీంతో ఆమె ఆత్మన్యూనతాభావంలోకి వెళ్లిపోతుంది. డిప్రెషన్ కి లోనవుతుంది. మీమీద విశ్వాసాన్ని, ప్రేమను కోల్పోతుంది. అనుమానితురాలిగా మారుతుంది.
ఇలాంటి సంబంధాలు చాలావరకు ఏదో ఫాంటసీగానో, అనుకోకుండానో జరిగిపోతుంటాయి. అది తెలియడం వల్ల కాపురం విడిపోతుందనే భయంతో చాలామంది చెప్పకుండా దాస్తుంటారు. అయితే ఇలాంటివి బైటికి పొక్కకుండా ఉండవు కాబట్టి తెలిసినప్పుడు జీవితాలు తలకిందులవుతాయి.

ఎవరిద్వారానో తెలిసేకంటే మీరే మీ తప్పును ఒప్పుకుంటే మీ బంధం కొద్ది రోజులు ఒడిదుడుకుల్లో పడ్డా.. తిరిగి గాడిలో పడే అవకాశం ఉంది. అలా చెప్పడం, తప్పు ఒప్పుకోవడానికి మామూలు ధైర్యం సరిపోదు. కాకపోతే మీ అనుబంధం ముందు ఇవి చిన్నవే. అందుకే ఈ చిట్కాలు పాటించి.. మీ బంధాన్ని నిలబెట్టుకోండి.

దేనికైనా సమయం, సందర్భం ఉండాలంటారు కదా.. ఈ విషయానికి కూడా తగిన సమయం, స్థలం ఎన్నుకోండి. అంతేకాదు మీరు మాట్లాడే విషయం మూడో వ్యక్తికి తెలియకూడదు. మీరిద్దరే ఉండేలా చూసుకోండి.
అందుకే బహిరంగ ప్రదేశాల్లో కంటే ఇల్లే బెటర్. ఇక ఇంకో ముఖ్య విషయం మీ భార్య అప్పటికే ఏదైనా టెన్షన్ లో ఉంటే ఈ విషయం ఇప్పుడు మాట్లాడకపోవడమే మంచిది.
మీరు మాట్లాడే మాటలు సరిగా ఉంటే ఎంత పెద్ద తప్పైనా క్షమించాలనిపిస్తుంది. అందుకే మీరు చేసిన తప్పును చెప్పడానికి ఎంచుకునే పదాలు చాలా సున్నితంగా.. సూటిగా ఉండాలి. అప్పుడే మీరు చెప్పేది బాధపెట్టినా క్షమాపణకు దారి తీస్తుంది. దీనికోసం ముందుగా రిహార్సల్ చేసుకోండి.
జరిగిందేదో జరిగిపోయింది.. దాంట్లో మీ పాత్ర ఎంత అనేది అప్రస్తుతం అలాగని మీరు చేసింది కరెక్ట్ కాదు. అందుకే మీ చర్యలను సమర్థించుకోవడానికి ప్రయత్నించకండి. నిజాయితీగా ఉండండి. మీరు చేసిన తప్పు మీదే దృష్టి పెట్టండి.
నిజం నిప్పులాంటిది. మీరు దాని పక్షాన నిలబడ్డప్పుడు బాధ సహజమే. మీ భాగస్వామి అడిగే ప్రశ్నలు మిమ్మల్ని ఎంత బాధించినా సూటిగా సమాధానం చెప్పండి. ఏ వివరాలూ వదిలి పెట్టొద్దు. తన అనుమానాలు పూర్తిగా తొలిగించేలా వ్యవహరించండి.
కొంతమంది తమ భాగస్వామి తమను ఎంతగా మోసం చేశాడో పూర్తిగా తెలుసుకోవాలనుకుంటారు. దానికోసం రకరకాలుగా గుచ్చిగుచ్చి అడుగుతారు. దీనికోసం వారు ఇబ్బంది పడుతూ, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అవన్నీ పూర్తిగా క్లారిఫై అయితే కానీ బంధాన్ని ముందుకు సాగించలేదు. ఈ సమయంలో ఓపిక, నిజాయితీ, నమ్మకం చాలా అవసరం.
మీ మనసులోని విషయాలు మీరు ఎన్నో చెప్పలనుకున్నా.. మీ భాగస్వామి చెప్పేది కూడా ఓపిగ్గా వినాలి. తన గురించి మాట్లాడడం మానేసి శ్రద్ధగా వినండి. వారి ఆలోచనలు, భావాలకు గౌరవం ఇవ్వండి. అప్పుడే మీ బంధం ముందుకు సాగుతుంది.
తప్పును ఒప్పుకోవడం ఒక విషయం. దెబ్బతిన్నబంధాన్ని సరిచేయడానికి ఏం చేయాలో దానికి సిద్ధంగా ఉండండి. మీరిద్దరికీ ఈ బంధాన్ని కాపాడుకోవడం చాలా విలువైనది అనే నిర్ణయానికి వస్తే, ముందుకు సాగడానికి మీరు ఏమి చేయాలో గుర్తించాల్సిన సమయం ఆసన్నమైనట్టే.