శృంగార సమయంలో మహిళలు చేయకూడని పొరపాట్లు ఏంటో తెలుసా?
శృంగారం (Romance) అనేది రెండు తనువుల దాహం తీరే ప్రక్రియ. వైవాహిక జీవితంలో శృంగారం అనేది వారి జీవిత ప్రయాణాన్ని ఆనందంగా ఉంచుతుంది. యుక్తవయసులో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలలో శృంగార భావనలు కలగడం సర్వసాధారణం. ఈ ప్రక్రియలో ఎప్పుడెప్పుడు పాల్గొనాలని తహతహలాడుతుంటారు. అయితే వివాహం తరువాత ఆ తరుణం రాగానే మొదటిసారి శృంగారంలో పాల్గొనే సమయంలో మహిళలలో అనేక సందేహాలు ఎదురవుతాయి. వారిలో తెలియని ఆందోళన (Anxiety) మొదలవుతుంది.
ఇలా ఆందోళన చెంది ఒత్తిడికి గురవుతారు. అప్పుడు వారి మనస్సు స్థిరంగా ఉండదు. అలాంటప్పుడు వారు భాగస్వామికి సంపూర్ణ అనుభూతిని ఇవ్వలేకపోతారు. ఇలా జరగకూడదు అంటే శృంగార సమయంలో మహిళలు పొరపాటున కూడా చెయ్యకూడని విషయాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వివాహం తరువాత మొదటిసారి శృంగారంలో పాల్గొనే చాలామంది మహిళలలో అనేక సందేహాలు (Doubts) ఏర్పడుతాయి. మొదట వారిలో కాస్త తెలియని భయం అంటూ ఉంటుంది. శృంగారం పట్ల సరైన అవగాహన లేకపోవడంతో భాగస్వామికి సంపూర్ణ అనుభూతిని అందిస్తామో లేదో లేక ఆ కార్యంలో పాల్గొంటే నొప్పి కలుగుతుందనో, శృంగారం పట్ల వారికున్న కోరికలను (Desires) భాగస్వామితో పంచుకుంటే తను ఎలా స్పందిస్తాడో ఏమో అని ఆలోచిస్తారు.
ఇలా ఎక్కువగా ఆలోచించి వారి మనస్సు ఒత్తిడికి (Stress) గురవుతుంది. ఇలా మనస్సు ప్రశాంతంగా లేకుండా ఆ కార్యంలో పాల్గొంటే భాగస్వామికి సంపూర్ణ అనుభూతిని (Feel) అందించలేరు. కనుక మీ మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోరాదు. మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఆ కార్యం పైనే ఏకాగ్రత చేయాలి. అప్పుడే పూర్తి శృంగార అనుభూతిని మీ భాగస్వామితో కలిసి పొందగలుగుతారు.
పడక గదిలోకి వెళ్లిన తరువాత భాగస్వామితో శృంగార భరితమైన కబుర్లను మాత్రమే పంచుకోవాలి. అలా కాకుండా ఇతర విషయాలను చర్చించే సమయం కాదు. భాగస్వామిలో శృంగార కోరికలు కలిగేలా తమ వంతు ప్రయత్నం చేయండి. పడక గదిలో అహం (Ego) అనేది ఉండరాదు. అహంతో భాగస్వామినే మీ దగ్గరకు వస్తాడనే ప్రయత్నం మంచిది కాదు. వైవాహిక జీవితంలో శృంగార జీవితం (Sex life) బాగుంటేనే భార్య జీవన ప్రయాణం కూడా బాగుంటుంది.
కనుక మీ మనసును ఎటువంటి సందేహాలను, భయాలను పెట్టుకోరాదు. శృంగారంలో పాల్గొనే సమయంలో మీకు అసౌకర్యంగా (Discomfort) ఉంటే మీ భాగస్వామికి చెప్పే ప్రయత్నం చేయాలి. మొదటిసారి శృంగారంలో పాల్గొంటే కాస్త నొప్పి కలగడం సర్వసాధారణం. అయితే ఈ సమస్య అందరిలోనూ ఉండదు. మొదట ఫోర్ ప్లే (Foreplay) ని ట్రై చేసి తర్వాత కలయికలో పాల్గొంటే నొప్పి తక్కువగా ఉంటుంది.
అదేవిధంగా మీకు అనువైన పద్ధతి గురించి భాగస్వామికి చెప్పి ఆ భంగిమలలో (Posture) పాల్గొంటే రతిక్రీడను మరింత ఆస్వాదించవచ్చు. పడకగదిలో భాగస్వామితో వాదనకు సరైన సమయం కాదు. భాగస్వామిని ఆకర్షించేలా మీ వస్త్రధారణ ఉండాలి. శృంగారంలో కిస్సింగ్ (Kissing) అనేది తప్పనిసరి. ముద్దులతో మీ భాగస్వామిని ముంచెత్తి వారిలో కామ కోరికలు పెంచి ఆ కార్యంలో పాల్గొంటే రతిక్రీడ మరింత రసవత్తరంగా మారుతుంది. ఆరోగ్యకరమైన శృంగారం మీ జీవన ప్రయాణానికి మంచిది.