ఇలాంటి స్త్రీలంటే.. పురుషులు పడిచచ్చిపోతారు..
తాము మానసికంగా, శారీరకంగా.. వీలైతే ఆర్థికంగా కూడా ఆధారపడదగిన మహిళలే భార్యలుగా రావాలని ఎక్కువమంది పురుషులు కోరుకుంటున్నారు.
మారుతున్న కాలంతో పాటు పురుషుల అభిరుచుల్లోనూ మార్పు వచ్చింది. ముఖ్యంగా జీవితభాగస్వామిగా ఎంచుకునే మహిళల విషయంలో వారి అభిరుచిలో చాలా మార్పు వచ్చింది.
అందుకే పురుషుల్ని అర్థం చేసుకోవడం అంత కష్టమైన విషయమేమీ కాదు. ఇది వరకులా తానే కుటుంబానికి పెద్దగా ఉండాలని, డామినేటింగ్ గా ఉండాలని అనుకోవడంలేదు.
తాము మానసికంగా, శారీరకంగా.. వీలైతే ఆర్థికంగా కూడా ఆధారపడదగిన మహిళలే భార్యలుగా రావాలని ఎక్కువమంది పురుషులు కోరుకుంటున్నారు.
కుటుంబాన్ని ఒంటిచేత్తే నడిపించే వారిగా ఉండాలని నేటి తరం పురుషులు కోరుకోవడం లేదు. ఇంటినిర్వహణలో భార్య తనతో పాటు సమాన పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు.
ఎమోషనల్ మెచ్యూరిటీ ఉండాలని కోరుకుంటున్నారు. మెచ్యూరిటీ లేని మహిళలు వెంటనే నిర్ణయాలు మార్చుకుంటూ గందరగోళ పడుతుంటారు.
అందుకే మానసికంగా పరిణతి చెందిన స్త్రీలే తమకు భాగస్వాములుగా రావాలని కోరుకుంటారు. అంతేకాదు వివాహవయసు విషయంలో కచ్చితమైన నిర్ణయాలు ఉండడం మంచి ఆలోచన.
బాగా చదువుకుని, మంచి ఎడ్యుకేషనల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న మహిళలనే పురుషులు భార్యగా కోరుకుంటారు. కెరీర్ లో ముందుకు దూసుకుపోవాలనే కోరిక, ఎదగాలనే తపన ఉండేవాళ్లంటే పడిచచ్చిపోతారు. కేవలం ఇంటిపనులకే పరిమితం అయ్యేవాళ్లంటే కాస్త విసుగనే చెప్పచ్చు.
చక్కగా సంభాషించగలగడం, నలుగురితో సులభంగా కలిసిపోవడం, అందర్నీ స్నేహితులుగా చేసుకోవడం లాంటి లక్షణాలున్న స్త్రీలంటే పురుషులు బాగా ఇష్టపడతారు. ఇలాంటి భాగస్మామిని నలుగురిలో చూపించుకోవడానికి గర్వపడతుంటారు కూడా.
తన ఆరోగ్యం గురించి స్పృహ ఉన్న భార్యను ఇష్టపడతారు. వ్యాయామాలు, రన్నింగ్, యోగాలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారంటే చాలా ఇష్టపడతారు. నేటి బిజీ, ఆధునిక జీవితంలో ఇవే భాగస్వాములిద్దరినీ ఆరోగ్యంగా ఉంచుతాయి.
తన కలలు, ఆశయాల పట్ల చాలా సీరియస్ గా ఉండే భార్యను పురుషులు ఆరాధిస్తారు. వారి కలలు సాకారాం చేసుకునే దిశగా వారి ప్రయాణానికి తోడ్పాటునందిస్తారు. తనలాగే తన భార్య కూడా ఆంబీషియస్ గా ఉండాలని.. వీలైతే ఇంకా ఎక్కువ ఉండాలని కోరుకుంటారు.