భార్యభర్తల మధ్య నమ్మకం ఉంటే.. వారు ఇలానే ఉంటారు..!
ఈ మధ్యకాలంలో దంపతుల మధ్య ముఖ్యంగా కరువౌతుందే ఈ నమ్మకమట. కాగా.. అసలు దంపతుల మధ్య నమ్మకం ఉంటే.. వారు ఒకరితో మరొకరు ఎలా ఉంటారో ఓసారి చూద్దాం..
sex
భార్య భర్తల మధ్య ప్రేమ ఎంత ముఖ్యమో... నమ్మకం కూడా అంతే ముఖ్యం. వారి మధ్య ప్రేమ, నమ్మకం ఉన్పప్పుడే... వారి బంధం బలంగా ఉంటుంది. అయితే... ఈ మధ్యకాలంలో దంపతుల మధ్య ముఖ్యంగా కరువౌతుందే ఈ నమ్మకమట. కాగా.. అసలు దంపతుల మధ్య నమ్మకం ఉంటే.. వారు ఒకరితో మరొకరు ఎలా ఉంటారో ఓసారి చూద్దాం..
ఒకరిపై మరకరికి నమ్మకం, విధేయత ఉన్న దంపతులు.. ఒకరు చెప్పేది మరొకరు కచ్చితంగా వింటారు. అంతేకాదు.. ఒకరి నిర్ణయాలను మరొకరు గౌరవం ఇస్తారు. ప్రతి విషయంలోనూ ఒకరికి మరొకరు మద్దుతుగా ఉంటారు.
ఇక.. ఈ రకం దంపతులు.. సోషల్ మీడియాకు డిస్ట్రాక్ట్ అవ్వరు. ఎన్ని కొత్త రకం యాప్స్ వచ్చినా.. ఆ సోషల్ మీడియాకు వారు బానిసలుగా మారరట. వాటికి బానిసలుగా మారి.. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి ని మర్చిపోవడం పక్కన పెట్టడం లాంటివి చేయరు. ఎంత యాప్స్ వాడినా... వారు తమ జీవిత భాగస్వామి తో సమయం కేటాయిస్తారు.
ఒక ఒకరిపై మరొకరికి నమ్మకం ఉన్న దంపతులు... తమ జీవిత భాగస్వామి కి ప్రతి విషయంలో అండగా నిలుస్తారు. తమ పార్ట్ నర్ కి అవసరమైన సమయంలో అండగా నిలుస్తారు. ఇద్దరూ కలిసి సమస్యలను పరిష్కరించుకుంటారు.
అంతేకాదు.. ఇలాంటి దంపతులు.. తమ పర్సనల్ విషయాలను వారితో మాత్రమే ఉంచుకకుంటారు. తమ దాంపత్యానికి సంబంధించిన ఏ విషయాన్నీ ఎవరికీ చెప్పరు.
ఏ విషయం అయినా.. ఇద్దరూ చర్చించుకుంటారు. తమ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాకుండా చూసుకుంటారు. ప్రతి విషయాన్ని వారు వివరంగా మాట్లాడుకుంటారు.
నమ్మకం, విధేయత ఉన్న దంపతులు.. ఏ విషయంలోనూ తమ జీవిత భాగస్వామి నమ్మకాన్ని బ్రేక్ చేయరు. తమ దంపతును గుడ్డిగా నమ్మేస్తారు. అంత నమ్మకం ఒకరిపై మరొకరికి ఉంటుంది.
ఒకరి అవసరాన్ని మరొకరు ముందుగానే గుర్తించి... దానికి తగినట్లు ప్రవర్తిస్తారు. వారి అవసరాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. తమ పార్ట్ నర్ కష్టపడకుండా ఉండేలా చూసుకుంటారు.
అంతేకాదు.. కెరీర్ పరంగానూ ఒకరికి మరొకరిని మోటివేట్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు.. దాంపత్య జీవితం సజావుగా సాగేందుకు వారు అన్ని ప్రయత్నాలు చేస్తారు.