ఇవి మీ సెక్స్ డ్రైవ్ ను సహజంగా పెంచుతాయి
మీ లిబిడోను పెంచడానికి, మీ సెక్స్ డ్రైవ్ ను మెరుగుపర్చడానికి మీ రోజువారి జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
sex drive
తక్కువ లిబిడో అనేది పురుషుల కంటే మహిళలనే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. లిబిడో తక్కువగా ఉంటే సెక్స్ డ్రైవ్ తగ్గుతుంది. ఇది భాగస్వామితో సంబంధాన్ని దెబ్బతీస్తుంది. మహిళల్లో సెక్స్ డ్రైవ్ తగ్గడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, యాంగ్జైటీ వంటి సమస్యలు సెక్స్ డ్రైవ్ ను తగ్గిస్తాయి. అయితే కొన్ని జీవన శైలి మార్పులతో సెక్స్ డ్రైవ్ ను పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
సరైన పండ్లను తినడం
అవును పండ్లు మీ లిబిడోను పెంచుతాయని నిపుణులు అంటున్నారు. అరటిపండ్లు, అవొకాడో, అత్తి పండ్లు, పుచ్చకాయ, స్ట్రాబెర్రీలు వంటి పండ్లు జననేంద్రియాలకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడతాయి. అలాగే మీ లైంగిక జీవితాన్ని మెరుగుపర్చడానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లను అందించడానికి సహాయపడతాయి.
ఒత్తిడి
ఒత్తిడి వల్ల కలిగే ఆందోళన మీ లైంగిక జీవితాన్ని దెబ్బతీస్తుంది. ఒత్తిడి, యాంగ్జైటీ రెండూ మీ సెక్స్ డ్రైవ్ ను ప్రతికూల ప్రభావితం చేస్తాయి. అయితే వ్యాయామం, ధ్యానం వంటివి ఒత్తిడి, యాంగ్జైటీని తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో మీ లైంగిక జీవితం మెరుగుపడుతుంది.
ఆహారంలో మూలికలను చేర్చండి
కొన్ని మూలికలు లిబిడోను పెంచడానికి సహాయపడతాయని శాస్త్రీయంగా నిరూపించబడింది. వీటిలో..ఇంద్రియాలను ఉత్తేజపరిచే తులసి ఉంది. అలాగే వెల్లుల్లిలోని అల్లిసిన్ జననేంద్రియాలకు రక్తప్రవాహాన్ని పెంచుతుంది. అలాగే అశ్వగంధ ఇది మీ లైంగిక కోరికను పెంచుతుంది.
తగినంత నిద్ర
ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల మీ లైంగిక జీవితం మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది లైంగిక కోరికలు రావడానికి సహాయపడుతుంది. జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ మే 2015 లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. తగినంత నిద్ర పొందడం వల్ల మీ మానసిక స్థితి, శక్తి మెరుగుపడుతుంది. ఇది మీ లిబిడోను పెంచుతుంది.
భాగస్వామితో సమయం
బిజీగా ఉండటం వల్ల భాగస్వామితో మంచి సమయాన్ని గడిపేవారు చాలా తక్కువ. ఇది మీ మధ్య ధూరాన్ని పెంచడమే కాకుండా మీ సెక్స్ డ్రైవ్ ను కూడా తగ్గిస్తుంది. మీ బంధం, మీ సెక్స్ డ్రైవ్ మెరుగ్గా ఉండాలంటే మాత్రం.. మీ భావాలను పంచుకోండి. ఒకరితో ఒకరు సమయాన్ని గడపండి. ఇది మీ బంధాన్ని మెరుగుపర్చడంతో పాటుగా మీ సెక్స్ డ్రైవ్ ను పెంచడానికి కూడా సహాయపడుతుంది.