మీ సెక్స్ డ్రైవ్ ను పెంచే చిట్కాలివి
వయసు పెరుగుతున్న కొద్దీ సెక్స్ డ్రైవ్ తగ్గడం చాలా కామన్ విషయం. అయితే కొంతమంది ఆహారలపు అలవాట్లు, జీవనశైలి వల్ల కూడా చిన్న వయసులోనే సెక్స్ డ్రైవ్ తగ్గుతుంది. అయితే కొన్ని కామోద్దీపన మూలికలు మీ సెక్స్ డ్రైవ్ ను తిరిగి పెంచడానికి సహాయపడతాయి. అవేంటంటే?
తక్కువ సెక్స్ డ్రైవ్ నే లిబిడో లేకపోవడం అంటారు. దీనివల్ల లైంగిక కోరికలు కలగవు. అలాగే సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనలేరు. దీనికి కారణాలు వ్యక్తి వ్యక్తికి మారుతాయి. రిలేషన్ షిప్ లో ప్రాబ్లమ్స్, అంగస్తంభన, ఒత్తిడి, యోని పొడిబారడం, ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే కొన్ని ఆయుర్వేద మూలికలు మీ సెక్స్ డ్రైవ్ ను పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
ashwagandha
అశ్వగంధ
అశ్వగంధను ఇండియన్ జిన్సెంగ్ అని అంటారు. ఈ మూలికను తీసుకుంటే శీఘ్రస్ఖలనం, నపుంసకత్వం సమస్యలే ఉండవు. అలాగే తక్కువ సెక్స్ డ్రైవ్ సమస్య నుంచి కూడా బయటపడతారు. అశ్వగంధ మీ నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. సెక్స్ డ్రైవ్ ను మెరుగుపర్చడానికి మీరు దీనిని గోరువెచ్చని పాలు, తేనె, అల్లంతో కలిపి తీసుకోవచ్చు. మీకు తెలుసా? అశ్వగంధలో యాంటీ స్ట్రెస్, యాంటీ ఏజింగ్,యాంటీ డిప్రెసెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఈ హెర్బ్ పునరుత్పత్తి హార్మోన్లను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది.
శతావరి
ఆడవాళ్ల పునరుత్పత్తి అవయవాలను పోషించడానికి శతావరిని బాగా ఉపయోగిస్తారు. ఈ మూలిక స్త్రీ సంతానోత్పత్తిని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ శతావరి హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే రక్త ప్రసరణను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఈ హెర్బ్ గర్భస్రావమయ్యే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. దీనిలో శోథ నిరోధక లక్షణాలు కూడా ఉంటాయి. ఈ హెర్బ్ నపుంసకత్వాన్ని పోగొడుతుంది. అలాగే జననేంద్రియ వాపును నయం చేస్తుంది. దీనిని ఉపయోగించి ఎన్నో రకాల పురుష లైంగిక సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇది మీరు సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇది పునరుత్పత్తి వ్యవస్థలో మంటను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
షిలాజిత్
షిలాజిత్ కూడా లైంగిక ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది లైంగిక పనితీరును మెరుగుపర్చడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ హెర్బ్ స్పెర్మ్ కౌంట్ ను, నాణ్యతను మెరుగుపరుస్తుంది. అలాగే స్పెర్మ్ చలనశీలతను కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఇది స్పెర్మ్ గుడ్డు వైపు కదిలే సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. అంతేకాదు ఈ హెర్బ్ హార్మోన్ల సమతుల్యతను నియంత్రించడానికి సహాయపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒంట్లో శక్తి స్థాయిలను పెంచుతుంది. శుద్ధి చేసిన షిలాజిత్ సప్లిమెంట్లు ఆరోగ్యకరమైన పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను దాదాపు 20 శాతం పెంచుతాయని నెబ్రాస్కాలోని క్రైటన్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ అధ్యయనం తెలిపింది.
కపికాచు
కపికాచును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ల ఉత్పత్తి బాగా పెరుగుతుంది. కపికాచులో కూడా కామోద్దీపన లక్షణాలు ఉంటాయి. ఈ హెర్బ్ మగవారిలో లిబిడోను బాగా పెంచుతుంది. అలాగే ఇది రోజువారి ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.