శృంగార ఆసక్తిని నాశనం చేసేవి ఇవే..!
చాలా మంది వారి సంసార జీవితంలో ఆనందంగా సాగుతున్నప్పటికీ ఇంకా చాలామంది ఆనందం ఇంకా ఎక్కువ పొందాలని ఆశతో కొన్ని చేయకూడని పనులు కూడా చేస్తూ అనవసరంగా తిప్పలు పడుతున్నారు.
శృంగారం పట్ల అందరికీ ఆసక్తి ఉంటుంది. దాని గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా చాలా మందిలో ఉంటుంది. అయితే.. ఆసక్తి ఎలాం ఉంటుందో.. దీనిపై అనుమానాలు, సందేహాలు కూడా చాలానే ఉంటాయి.
వాటిని నివృత్తి చేసుకోవడానికి చాలా మంది చాలా అగచాట్లు పడుతున్నారు. అలాంటివి పూర్తిగా సందేహం తీర్చుకోకుండా శృంగార సమయంలో చాలా పొరపాటు చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలా మంది వారి సంసార జీవితంలో ఆనందంగా సాగుతున్నప్పటికీ ఇంకా చాలామంది ఆనందం ఇంకా ఎక్కువ పొందాలని ఆశతో కొన్ని చేయకూడని పనులు కూడా చేస్తూ అనవసరంగా తిప్పలు పడుతున్నారు.
ఇంకా కొందరైతే ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా పురుషుల్లో లైంగిక ఆసక్తి పెంచుకునేందుకు ఆయుర్వేద మందు, టాబ్లెట్స్... అంటూ రకరకాలవి ప్రకటనలు వస్తూనే ఉంటాయి.
నిజంగా వాటిని చూసి ఏదో అయిపోతుందని మోసపోయి కొనుగోలు చేస్తే లేనిపోని సమస్యలు ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఇలాంటి మందులు వాడే చాలామంది ప్రాణాల మీదకు కూడా తెచ్చుకున్న సంఘటనలు అనేకం అని నిపుణులు తెలియజేస్తున్నారు.
శృంగార సమయంలో ఏ చిన్న ఇబ్బంది కలిగిన దంపతుల్లో ఏ ఒక్కరూ పరిపూర్ణ శృంగారాన్ని అనుభవించలేరు. అలాంటి సమయంలోనే సెక్సాలజిస్టును కలవాల్సి వస్తుంది. ఇకపోతే చాలామంది ఆ విషయం తప్పించి మిగతా అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.
ముఖ్యంగా మగవారు వారి లైంగిక శక్తిని పెంచుకోవాలని ఆరాటంతో మరికాస్త అనుభూతిని పొందాలన్న తపనతో వయసుతోపాటు వచ్చే పరిమితిని ఒక పోటీలో గెలవాలన్న ఆశతో వారు పక్కదారులు పడుతున్నారు. కాకపోతే ఆధునిక వైద్యంలోనూ శృంగార శక్తిని పెంచే మందులు కూడా ఉన్నాయి. కాకపోతే అది వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి.
లేకపోతే వాటికి దుష్ప్రభావాలు చాలా ఎక్కువ. చివరికి వారి ప్రాణాలు పోయే స్థితి కూడా వెళ్ళవచ్చు. శృంగారం గురించి కూడా బోలెడు సమాచారాన్ని సాంకేతికత ఉపయోగించి తెలుసుకోవచ్చు కానీ అదే టెక్నాలజీ మనకు ప్రతికూలంగా మారుతోంది.
మన ఇంట్లో టైం పాస్ అవ్వడానికి మనం చూసే టీవీలు శృంగార జీవితం పై ప్రతికూల ప్రభావం పడుతున్నాయి. ఇకపోతే ఒక సర్వేలో ఇంట్లో టీవీ లేనివారితో పోలిస్తే టీవీ ఉన్న వాళ్ళు ఆరు శాతం మంది తక్కువగా శృంగారంలో పాల్గొంటున్నారు.
కాబట్టి శృంగారం జీవితం కేవలం టీవీలతోపాటుస్మార్ట్ ఫోన్ కూడా నాశనం చేస్తున్నాయి. కాబట్టి రాత్రిపూట వీటికి కొద్దిగా దూరంగా ఉండాలి.